Pages

Monday, July 16, 2012

Will వాడదామా? Shall వాడదామా?

Will వాడదామా? Shall వాడదామా?

వర్తమాన కాలములో వుండే ప్రాధమిక క్రియ భూతకాలములోనికి వచ్చినపుడు సాధారణముగా కొంత మార్పును పొందును. ఉదాహరణకు write ... wrote అవుతుందిగదా (కొన్ని verb ల లో తప్ప) కానీ భవిష్యత్ కాలములో ఎటువంటి మార్పూ పొందదు. అందువలన shall,will ల తరువాత Root verb ని వుంచడం ద్వారా Future Tense ని తెలియ పరుస్తాము.


సాధారణముగా First Persons అయిన  I.We ల ముందు Shall మిగతా persons ముందు Will ఉపయోగిస్తారు. (మనము అటు,ఇటు,మారిస్తే అర్ధములో తప్పనిసరి,అని నిశ్చ్హయము అని తీసుకోవచ్చు) ప్రస్తుతానికి ఆ తేడా లేకుండా అది ఏ పర్సన్ అయినా 'Will' వాడటమే వాడుకగా మారింది.కానీ ప్రశ్నా వాక్యముగా మార్చినప్పుడు First Persons లో Shall మాత్రమే వాడటం గమనార్హం. Ex..Shall I go? (will I go? అనకూడదని కాదు)

No comments:

Post a Comment