
బడిపిల్లల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ ల్యాప్‌టాప్ ‘థింక్‌ప్యాడ్ ఎక్స్ 130ఈ’ ను త్వరలో విడుదల చేయనున్నట్లు లెనవూ ప్రకటించింది. పిల్లల చేతిలోంచి జారిపడ్డా చెక్కుచెదరని విధంగా ఉండే ఈ ల్యాప్‌టాప్‌లో మల్టీమీడియా సౌకర్యాలతోపాటు, వెబ్ బ్రౌజింగ్ కూడా వీలవుతుంది.
అంతేకాదు.. రోజంతా పనిచేసినా మన్నేలా సమర్థమైన బ్యాటరీని అమర్చారు. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ కోర్ ఐ-3 ప్రాసెసర్, రెండు గిగాబైట్ల ర్యామ్‌లతోపాటు ఈథర్‌రెట్, ఆడియా, మైక్రోఫోన్ పోర్టులు, రెండు యూఎస్‌బీ, వైఫై, బ్లూటూత్ సౌకర్యాలు దీంట్లో ఉన్న అదనపు హంగులు! పీసీని పొరబాటున ఎక్కడైనా మరచిపోయినా అసెట్ ట్యాగ్ ఫీచర్‌తో మళ్లీ గుర్తించడం చాలా సులువు. మరో వారం రోజుల్లో అమెరికా మార్కెట్‌లోకి వచ్చే థింక్‌ప్యాడ్ 130ఈ ఖరీదు దాదాపు రూ.25,000!
No comments:
Post a Comment