Saturday, February 16, 2013

http://www.youtube.com/watch?feature=player_embedded&v=BPJ0nkSipXk#t=0s

ఇంగ్లిష్ నేర్చుకుందాం

ఇంగ్లిష్ నేర్చుకుందాం ప్రస్తుత పోటీ ప్రపంచంలో Communication skills, ముఖ్యంగా Communication skills in ENGLISH ప్రాముఖ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందులోనూ మనం ప్రపంచీకరణదశలో ఉన్నాం. అంటే Communications లో వచ్చిన విప్లవం వల్ల, ప్రపంచం కుంచించుకుపోయి Global village అయిపోయింది. దీంతో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా విదేశాలతో సంబంధాలు పెరిగిపోతున్నాయి. చక్కటి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు అధికమవుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే ఉన్నతస్థాయికి ఎదగడం తేలికే. అందుకోసం English Communication skills ఎంత అవసరమో చెప్పనక్కరలేదు. 1. Conversational English (సంభాషణలకు ఉపయోగించే) in Informal contexts = మన సన్నిహితులతో మనం సంభాషించే సందర్భాలు. Formal contexts = మనకు పరిచయంలేనివాళ్లతో, మన పైస్థాయివాళ్లతో, ప్రత్యేకంగా గౌరవించేవాళ్లతో సంభాషించే పరిస్థితి. 2. Situational Conversation = వివిధ సందర్భాల్లో వాడాల్సిన ప్రత్యేకమైన మాటలూ, వాక్యాలూ లాంటి వాటిల్లో 3. Speech making = ఉపన్యాసాలు English లో ఇవ్వగలగడం - అయితే ఇది Spoken -English, formal లో చివరిగామీరు practice చేసే అవకాశం. 4. Vocabulary - వివిధ సందర్భాల్లో, ముఖ్యంగా మన దైనందిన జీవితంలో వాడే high frequency (ఎక్కువసార్లు వాడే) words. మనలో చాలామందికి పెద్దపెద్ద మాటల అర్థాలు, కొన్నిసార్లు వాడకం తెలుసు, School, College లో మనం English పుస్తకాలు చదివి నేర్చుకున్నాం కాబట్టి. అయితే వాటిని అలాగే నిత్యజీవితంలోని సందర్భాల్లో వాడటం పాండిత్యంగా (కృతకంగా, అసహజంగా) ఉంటుంది. నిత్యజీవితావసరాలకు వాడే చిన్నచిన్న English మాటలూ, వాటి వాడకం. 5. Phrases and Idioms - వీటిని కూడా ఈ శీర్షిక కింద తెలుసుకోవచ్చు. Spoken English తో పాటు, Written English మెళకువలు కూడా ఉంటాయి. Sentence Writing, Paragraph Writing, Essay Writing (వ్యాస రచన) లాంటి అంశాలు కూడా నేర్చుకోవచ్చు. వీటితోపాటు Structural Vocabulary- అంటే ఒక విషయం/సంఘటనకు సంబంధించిన పదాలన్నింటి గురించి వివరణలు. ఉదాహరణకు ఏదైనా ప్రమాదం (Accident) గురించి చెప్పాలనుకున్నా రాయలనుకున్నా ఏయే పదాలు దానికి సంబంధించినవో, వాటిని ఎలా వాడాలో తెలుసుకోవచ్చు. Advanced Vocabulary (అత్యున్నత స్థాయి పదజాలం) కూడా ఇందులో ఉంటుంది. Paragraph Writing, Essay Writing విధానాల వివరాలు కూడా ఉంటాయి. Reading: మనం చదివే English మనం అర్థం చేసుకోగలమా? ఈ అంశం ప్రతి పోటీపరీక్షలో పరీక్షిస్తారు. దీన్నే Reading Comprehension Exercise అంటారు. దీనికి సంబంధించి కూడా సలహాలు, సూచనలు ఈ శీర్షిక కింద తెలుసుకోవచ్చు.

75% డిస్కౌంట్ ఆఫర్

75% డిస్కౌంట్ ఆఫర్