Thursday, June 28, 2012

storage drive


5 GB of free online storage
Unlimited access from any computer
Never worry about losing your files again
Upload your music, photos, videos, and documents from your computer to your Amazon Cloud Drive.
You'll never lose your files from a hard drive crash or a lost or stolen laptop.
Download and preview your files with any web-connected computer.

What is Amazon Cloud Drive?

Amazon Cloud Drive is your personal hard drive in the cloud. Store your music, videos, photos, and documents on Amazon's secure servers. All you need is a web browser to upload, download, and access your files from any computer. Get more details about using Cloud Drive

5 GB of Free online storage

Your Cloud Drive comes with 5 GB of free storage—enough space to store up to 1000 songs. This space is yours to use as you like and you will never be charged for it.

Unlimited, secure access from any computer

Use your Amazon Cloud Drive as the go-to location for all your important files. At work, at home, during your commute or while on vacation—you'll always have access to everything you've uploaded to your Cloud Drive through your Amazon account.

Never worry about losing your files again

Store files in your Cloud Drive and never worry about losing them if your computer crashes, or is lost or stolen.

Songs purchased from Amazon MP3 are stored in your Cloud Drive for free

When you purchase songs or albums from the Amazon MP3 Store, you can now save your purchases to your Cloud Drive. All your purchases are backed up and available for you to download at any time. Even better, you can listen to your music from any web-connected computer with Amazon Cloud Player.
And the best part? When you save or upload your Amazon MP3 Store purchases to your Cloud Drive, they don't take up any of your storage space and are always stored for free.

Additional storage plans available: 20 GB to 1000 GB

Need more than 5 GB of space? We offer paid storage plans with up to 1000 GB of space. These plans are billed annually and renew automatically for your convenience. Learn more about changing your storage plan
Storage Plan
Songs
Holds up to:
Photos
Holds up to:
HD Video
Holds up to:
5 GB Free 1,000 2,000 20 minutes
20 GB $20 / year 8,000 1.5 hours
50 GB $50 / year 20,000 3.5 hours
100 GB $100 / year 40,000 7 hours
200 GB $200 / year 80,000 14 hours
500 GB $500 / year 200,000 35 hours
1000 GB $1000 / year 400,000 70 hours

Have more questions?

See the Amazon Cloud Drive Frequently Asked Questions or visit our help pages.




Tuesday, June 26, 2012

పీసీ సాఫ్ట్వేర్స్ (softwares)

ఉచితంగా లభించే సిడి రైటింగ్ సాఫ్ట్ వేర్

సిడిలను డివిడిలను రైట్ చేయ్యడానికి మనమందరం ఉపయోగించే Nero Expressవంటి సాఫ్ట్ వేల్లు ఆయా CD/DVD రైటర్లతో పాటు OEM వెర్షన్‍గా ఉచితంగా అందించబడుతున్నాయి. కానీ విడిగా అయితే అవి ఉచితమైనవి కావని మీకు తెలిసే ఉంటుంది. ఈ నేపధ్యంలో ఒకవేళ మీరు పూర్తిగా ఉచితంగా లభించే సిడి/డివిడి రైటింగ్ సాఫ్ట్ వేర్ కోసం వెదుకుతున్నట్లయితే Burn Aware Free Edition వాడుకోవచ్చు. దీని ద్వారా CD/DVD లతో పాటు Blu-Ray ( BD-R/BD-RE ) డిస్కులను సైతం (మీ వద్ద ఆ రైటర్ ఉన్నట్లయితే ) రైట్ చేసుకోవచ్చు. డిస్క్ ఇమేజ్‍లను క్రియేట్ చెసుకోవడం, డిస్క్ టు డిస్క్ కాపీయింగ్ వంటి అన్ని సదుపాయాలు అందిస్తుందిది.

సిస్టమ్ వనరులను ప్రాసెస్‍లు హరిస్తున్నాయా?


మీ కంప్యూటర్‍లో ఏవి బడితే అవి భారీ సంఖ్యలొ ప్రాసెస్‍లు రన్ అవుతూ మీ సిస్టమ్ పనితీరుని నెమ్మదింపజేయడంతో పాటు సిస్టమ్ క్రాష్ అవడానికి దారి తీస్తున్నాయా ? అయితే మీరు Process Lasso అనే చిన్న సాఫ్ట్ వేర్ మీ కంప్యూటర్లో ఇన్‍స్టాల్ చేసుకోండి. ఈ సాఫ్ట్ వేర్ సిస్టమ్ ట్రేలో రన్ అవుతున్న ప్రతీ ప్రాసెస్‍ని నిశ్శబ్దంగా మోనిటర్ చేస్తూ ఏదైనా ప్రాసెస్ 35% కన్నా ఎక్కువ CPU cycle ని హరిస్తుంటే దాన్ని kill చేస్తుంది. అలాగే రన్ అవుతున్న అన్ని ప్రాసెస్‍ల వివరాలూ నమోదు చేస్తుంది.

ఉచిత సిడి/డివిడి/బ్లూ - రే రైటింగ్ సాఫ్ట్ వేర్

సిడిలను డివిడిలను రైట్ చేయ్యడానికి మనమందరం ఉపయోగించే Nero Expressవంటి సాఫ్ట్ వేర్లు ఆయా CD/DVD రైటర్లతో పాటు OEM వెర్షన్‍గా ఉచితంగా అందించబడుతున్నాయి. కానీ విడిగా అయితే అవి ఉచితమైనవి కావని మీకు తెలిసే ఉంటుంది. ఈ నేపధ్యంలో ఒకవేళ మీరు పూర్తిగా ఉచితంగా లభించే సిడి/డివిడి రైటింగ్ సాఫ్ట్ వేర్ కోసం వెదుకుతున్నట్లయితే Burn Aware Free Edition వాడుకోవచ్చు. దీని ద్వారా CD/DVD లతో పాటు Blu-Ray ( BD-R/BD-RE ) డిస్కులను సైతం (మీ వద్ద ఆ రైటర్ ఉన్నట్లయితే ) రైట్ చేసుకోవచ్చు. డిస్క్ ఇమేజ్‍లను క్రియేట్ చెసుకోవడం, డిస్క్ టు డిస్క్ కాపీయింగ్ వంటి అన్ని సదుపాయాలు అందిస్తుందిది.

డిస్పోజబుల్ చాట్ రూమ్ తయారుచేసుకోండి…


వేర్వేరు దేశాల్లొ, వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్న మీ స్నేహితులంతా ఒకేచోట ముచ్చటించుకోవాలనుకుంటున్నారా? అయితే కొద్దిసేపు మీకంటు ఓ చాట్ రూమ్ సృష్టించుకోవచ్చు కదా! ఆ వెబ్‍సైట్‍లో create a chat room (chat room name) అని కన్పించే బాక్స్ లో మీరు ఆ చాట్ రూమ్‍కి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరుని ఇవ్వండి. వెంటనే ఆ క్రిందనే మీరు పేర్కొన్న పేరుతో ఓ తాత్కాలిక చాట్‍రూమ్ ప్రారంభించబడి దాని లింక్ ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు మీరు ఆ లింక్‍ని ఓపెన్ చేస్తే ఓ చాట్ విండో వచ్చేస్తుంది. ఇక మీరు చేయవలసినదల్లా , Gmail, Yahoo Messenger వంటి వాటిలో ప్రస్తుతం ఆన్‍లైన్‍లో మీకు అందుబాటులో ఉన్న మీ స్నేహితులందరికీ ఆ చాట్‍రూమ్ లింక్‍ని పంపించి వెంటనే వచ్చేయమని ఆహ్వానించడమే ! అందరూ వచ్చిన తర్వాత తీరిగ్గా ముచ్చటించుకోవచ్చు.

నెట్ ద్వారా టివి చానెళ్ళని ఉచితంగా చూడొచ్చు…


ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతున్న అనేక ఉచిత టెలివిజన్ చానెళ్ళని మన కంప్యూటర్ స్క్రీన్ మీదే వీక్షించడానికి “JLC Internet TV” అనే ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుంది. చాలా తక్కువ పరిమాణం గల ఈ ప్రోగ్రామ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అది నెట్‌కి కనెక్ట్ అయి ప్రస్తుతం లభిస్తున్న చానెళ్ళ వివరాలను అప్‌డేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత దేశాల వారీగా కావల్సిన చానెళ్ళని ఎంచుకుని వీక్షించవచ్చు. కొన్ని చానెళ్ళు Windows Media Player లోనూ, మరికొన్ని Real Player లోనూ ప్లే అవుతుంటాయి. కాబట్టి ఈ రెండు ప్రోగ్రాములు ఉండాలి. దీనిలో DD News, Sun TV వంటి కొన్ని భారతీయ చానెళ్ళూ లభిస్తున్నాయి.

Archive for May, 2008 అడోబ్ రీడర్ 8 సిపియుని ఎక్కువగా వాడుకుంటుంది


PDF ఫైళ్ళని ఓపెన్ చేయడానికి ఉద్దేశించబడిన Adobe Reader8 వెర్షన్‌తో ఓ ఇబ్బంది ఉంది.వాస్తవానికి Adobe Reader 7 వరకూ అప్‌డేట్లు అవసరం లేకపోతే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యే సదుపాయాన్ని డిసేబుల్ చేసుకునే అవకాశముంది. అయితే Adobe Reader 8 లో మనం కోరకుండానే adobeupdater.exe అనే అప్‌డేట్ ప్రోగ్రామ్ మనం ఇంటర్‌నెట్‌కి కనెక్ట్ అయినప్పుడు Adobe సైట్‌కి వెళ్ళి తాజా అప్‌డేట్లని డౌన్‌లోడ్ చేస్తుంటుంది. అది సక్రమంగా పనిచేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ adobeupdater.exe ప్రోగ్రామ్ 98% సిపియుని వినియోగించుకుంటూ సిస్టమ్‌ని పూర్తిగా స్లో చేస్తుంది. సో.. ఇలాంటి ఇబ్బందిని మీరు అధిగమించాలంటే Foxit Reader వంటి ప్రత్యామ్నాయ PDF రీడింగ్ సాఫ్ట్‌వేర్లని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

సంగీతం సృష్టించడానికో సాఫ్ట్ వేర్


చవులూరించే సంగీతాన్నీ సృష్టించాలనుకుంటే Ableton Live అనే సాఫ్ట్ వేర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. వేర్వేరు పరికరాల ఆధారంగా మ్యూజిక్ ని కంపోజ్ చేయడానికి, రికార్డ్, రీమిక్స్ చేయడానికి ఈ సాఫ్ట్ వేర్ వీలు కలిపిస్తుంది.32-bit/192kHz వరకు మల్టీ ట్రాక్ రికార్డింగ్ ని సపోర్ట్ చేయడం తో పాటు టైం స్త్రేచ్చింగ్, రాప్పింగ్ చేయవచ్చు. అనేక స్పెషల్ ఫిల్టర్లను అవసరాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు.

computer vinthalu - viseshaalu

USB ఫ్రిజ్ ఎంత ముచ్చటగా ఉందో కదా!

SNAG-0004SNAG-0005
మండువేసవి కాలం ముంగిట ఉంది.. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు వస్తుంటాయి. ఓ కోక్ బాటిల్ పిసికి అందుబాటులో chiilled గా ఉంటే ఎలా ఉంటుంది? USB ఫ్రిజ్ మీ కోరికని తీరుస్తుంది. ముచ్చటగా ఓ కోక్ టిన్ పట్టే సైజ్ లో ఉండే ఈ ఫ్రిజ్ ని మీ పిసి యొక్క USB పోర్ట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేకతలు:
                 
       కేవలం 5 నిముషాల్లో 8 డిగ్రీల సెంటిగ్రేడ్ కి ఉష్ణోగ్రత పడిపోతుంది.
       ఎలాంటి ప్రత్యేకమైన డివైజ్ డ్రైవర్లూ అవసరం లేదు.
        ఆపరేటింగ్ సిస్టమ్ తో సంబంధం లేకుండా అన్ని సిస్టమ్ లపై పనిచేస్తుంది. 
        365 గ్రాముల బరువు ఉంటుంది.
        ఇక ధర అంటారా.. కేవలం 1350 రూపాయలు సుమారుగా.

గదిలో పరిమళాలు వెదజల్లే USB పరికరం

sridhar
రూమ్ రిఫ్రెషనర్లకు బదులుగా నేరుగా కంప్యూటర్ నుండే పరిమళాలను వెదజల్లే AromaUSB అనే USB పరికరం ఒకటి ప్రస్తుతం మార్కెట్లో విడుదలైంది. ఇందులో పెర్ ఫ్యూమ్ నింపబడి ఉంటుంది. మనం ఈ పరికరాన్ని మన కంప్యూటర్ యొక్క USB పోర్టుకి కనెక్ట్ చేసిన తక్షణం అది ఉత్తేజభరితమైన పరిమళాన్ని వెదజల్లడం ప్రారంభిస్తుంది. వేర్వేరు ఫ్లేవర్లు, రంగుల్లో లభిస్తున్న ఈ పరికరం ధర రూ. 8,500 వరకూ ఉంది. లోపల పెర్ ఫ్యూమ్ ఖాళీ అయితే కొన్ని మోడళ్లలో మళ్లీ నింపుకోవచ్చు. http://www.aromausb.com/?action=product_productpage అనే పేజీలో ఆర్డర్ చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు జరిపి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

పాత కంప్యూటర్లు ఇలా ఉండేవి...

నాలుగు ప్రాసెసింగ్ కోర్ లతో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్లని ప్రస్తుతం మనం వినియోగించబోతున్న తరుణంలో అసలు 1970వ ప్రాంతం నుండి ఇప్పటివరకూ విడుదల చేయబడిన వివిధ కంప్యూటర్ల రూపాలను పరిశీలిస్తే కొన్ని కాలిక్యులేటర్లుగానూ, కొన్ని మైక్రోవేవ్ ఓవెన్లు గానూ వేర్వేరు రూపాల్లో నవ్వు తెప్పించడం ఖాయం. కేవలం 37 ఏళ్లలో మనిషి సాంకేతికంగా ఎంత ఎదిగాడో (సామాజికంగా దిగజారాడు అనుకోండి) అర్ధమవుతుంది.


గూగుల్ ఎర్త్….GOOGLE EARTH





’తాతా కంప్యూటర్లో మన ఇల్లు, పురులు, సూర్యలంకలు సముద్రపు ఒడ్డు కనిపిస్తున్నాయే’! అంటూ ఓ మనవడు చెబుతుంటే ఆ తాత మొహంలో సంభ్రమం కొట్టొచ్చినట్లు కనిపించింది. Google Earth, Wikipedia ల పుణ్యమా అని ప్రపంచంలోని ఏ మారుమూల ప్రదేశం గురించైనా క్షణాల్లో ఉపగ్రహ చిత్రాల ద్వాఅరా తెలుసుకోవడం సాధ్యపడుతోంది.

ఎక్కడ లభిస్తుంది, ఎంత సైజ్ ఉంటుంది?

Google Earth అనేది ఓ ఉచిత మృదులాంత్రము (Software). 11 MB సైజుగల ఈ ప్రోగ్రామ్‍ని http://earth.google.com అనే సైట్ నుండి పొందవచ్చు. ఫ్రీవర్షన్‍ని డౌన్‍లోడ్ చేసుకునేటప్పుడు ఓ రిజిస్ట్రేషన్ ఫారంని నింఫి యూజర్‍నేమ్, లైసెన్స్ కీలను పొందాలి. Google Earth ని నెట్‍కి కనెక్ట్ చేసే సమయంలో వీటిని తెలియజేస్తేనే లాగిన్ అవుతుంది.

ఎలా ఎక్స్ ప్లోర్ చేయాలి?

Google Earth ప్రోగ్రామ్‍ని రన్ చేసిన వెంటనే ఓ globe గుండ్రంగా తిరుగుతూ మన ముందుకు వస్తుంది. ఆ గ్లోబ్‍లో ఏ ప్రదేశం వద్ద అయినా మౌస్‍ని ప్రెస్ చేసి పట్టుకుని మీకు కావల్సిన దేశం వచ్చేటంతవరకూ కుడి, ఎడమ వైపులకు మౌస్‍ని డ్రాగ్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు మీకు కావలసిన దేశం వచ్చిన తర్వాత Mapsకి క్రింది భాగంలో కన్పించే కంట్రోళ్ళని ఉపయోగించి ఆ దేశంలోని ఇతర నగరాలు, పట్టణాలని వెతుకుతూ వెళ్ళాలి. ఉదా.కు New Delhi, Mumbai, Hyderabad వంటి నగరాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా నగరాన్ని సెంటర్ పొజిషన్‍లోకి తెచ్చుకుని.. ఆ నగరాన్ని జూమ్ చేసుకుంటూ వెళితే ఆ నగరంలోని వివిధ ప్రాంతాల పేర్లు కన్పిస్తుంటాయి. హైదరాబాదుని జూమ్ చేసుకుంటూ వెళితే హుస్సేన్‍సాగర్, అమీర్‍పేట్, ఎల్.బి. స్టేడియం, వంటి వివిధ ప్రదేశాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా ప్రదేశాన్ని ఎంచుకుని జూమ్ చేసుకుంటూ వెళితే ఆ ప్రదేశం పరిసర ప్రాంతాలు, భవనాలు, రోడ్లు ఉపగ్రహచిత్రం రూపంలో చూపించబడతాయి. మన రాష్ట్రంలోని చిన్న చిన్న పట్టణాల రూపురేఖలని సైతం Google Earth ప్రోగ్రామ్ ద్వారాఎక్స్ ప్లోర్ చేసుకోవచ్చు.




చిటికెలో కావలసిన ప్రదేశాన్ని చూడాలా?

Globe బొమ్మని జూమ్ చేస్తూ కావలసిన ప్రదేశానికి చేరుకోవడం కష్టంగా ఉందా … అయితే Google Earth ప్రోగ్రామ్‍లోని Fly to అనే బాక్సులో మీరు ఏ నగరాన్ని చూడాలనుకుంటున్నారో దాని పేరుని టైప్ చేయండి. ప్రముఖ ప్రాంతాలని సందర్శించడానికి ఇది సులభంగా ఉంటుంది. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని సైతం Google Earth ద్వారా పొందవచ్చు. ఏదైనా ప్రముఖ ప్రదేశానికి బ్రౌజ్ చేసేటప్పుడు అక్కడికి దగ్గరలో హైవేలు, రెస్టారెంట్లు, లాడ్జిలు, బ్యాంకులు, రిటైల్‍షాపులు, ఫార్మసీలు, వంటి ఎలాంటీ వనరులైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అవకాశముంది. దీనికి గాను Google Earth ప్రోగ్రాములో Layers అనే ప్రదేశం వద్ద కావలసిన అంశాలని ఎంచుకుంటే సరిపోతుంది. వివిధ ప్రదేశాలని బ్రౌజ్ చేసేటప్పుడు పలురకాల సింబల్స్ రూపంలో ఇవి చూపించబడతాయి.


ధర్డ్ పార్టీ ప్లగ్‍ఇన్‍లు సైతం లభిస్తున్నాయి…


Google Earth ప్రోగ్రాములో ఉన్న సదుపాయాలు సరిపోవడం లేదా… అయితే www.googleearthhacks.com అనే వెబ్‍సైట్‍లో అదనపు మ్యాపులు, ఫోటోలు లభించడంతో పాటు ఈ ప్రోగ్రామ్‍ని ఉపయోగిస్తున్న ఇతర యూజర్ల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలుసుకోవడానికి Google News స్టోరీలు, Earth చిత్రాలు చూసి చూసి విసిగిపోయి కొద్ది భిన్నంగా వేరే గ్రహం చిత్రాలు చూడాలనుకుంటే Jupiter గ్రహం యొక్క చిత్రాలు చూపించే ప్లగ్‍ఇన్‍లు వంటివి ఎన్నో ఈ సైట్‍లో డౌన్‍లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా లభిస్తున్నాయి.ది

Ctrl+Alt+Del ఎవరు కనుగొన్నారో తెలుసా?


కంప్యూటర్ హ్యాంగ్ అయినప్పుడు అందరూ సహజంగా ఉపయోగించే చిట్టచివరి ప్రయత్నం కీబోర్డ్ నుండి Ctrl+Alt+Del కీలను ప్రెస్ చేసి కంప్యూటర్ ని రీస్టార్ట్ చేయడం! ప్రతీ కంప్యూటర్ వినియోగదారుడికీ తెలిసిన ఈ సింపుల్ కీబోర్డ్ షార్ట్ కట్ ని ఎవరు కనుగొన్నారో తెలుసా? 1980వ సంవత్సరంలో "డేవిడ్ బ్రాడ్లే" అనే ఐబియం ఉద్యోగి కంప్యూటర్ ప్రతిస్పందించడం మానేసినప్పుడూ, ఇక ఎలాంటి కమాండ్లను స్వీకరించకుండా నిలిచిపోయినప్పుడు సులువుగా సిస్టం ని రీస్టార్ట్ చేయడానికి మార్గం ఒకటి కనుగొనాలన్న ఉద్దేశంతో ఒక చిన్న సోర్స్ కోడ్ ని రాశాడు. ఈ కోడ్ రాయడానికి అతనికి పట్టిన సమయం కేవలం ఒక నిముషం 23 సెకండ్లు మాత్రమే! అంత తక్కువ టైము పడితేనేం.. ఇన్నేళ్లు గడిచినా ఆ మూడు అక్షరాల తారక మంత్రానికి తిరుగే లేకుండా పోయింది. బ్రాడ్లే ఇంకా అనేక అంశాలను కనుగొన్నప్పటికీ Ctrl+Alt+Del మాత్రం అతనికి బాగా పేరు తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ ఆ షార్ట్ కట్ ని తన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉపయోగించడం మొదలుపెట్టాడో అప్పటి నుండీ అది ఎంతో ప్రాచుర్యం చెందింది.

తమాషా లెక్కలు

తమాషా లెక్కలు

ఈ వ్యాసము ముఖ్యంగా పిల్లలకు లెక్కల మీద మక్కువను ఎక్కువ చేయుటకు ప్రయత్నిచడం జరుగుతుంది. అంకెలతో గారడి తో చిన్న చిన్న లెక్కలు పిల్లలు తమ తోటి విధ్యార్దులకు చెప్పి వాటి మీద ఆసక్తి పెంచే విధంగా ఈ వ్యాసాన్ని కొనసాగిద్దాం. దానికి ఎవరైనా తమ ఆలొచలను ఆచరనలో పెట్టగలరని ఆశిస్తూ మెదలు పెడదాము.

తమాషా లెక్కలు

లెక్క అడిగి చూడు జాబు తట్టి చూడు
  • 1. అనగనగా ఒక ఊరిలో మూడు గుడులు ఉన్నాయి.
వాటి ముందు మూడు చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రతి చెరువులొ ఎన్ని పూలు ముంచితే అంతకు రెట్టింపు పూలు అవుతాయి. ఒక భక్తుడు కొన్ని పూలు తీసుకొని మొదట చెరువులొ ముంచితే అవి రెట్టింపు అయినాయి. వాటిలొ కొన్ని పూలు మొదట గుడిలొ పూజించి మిగిలిన పూలు రెండవ చెరువులొ ముంచితే అవి రెట్టింపు అయినాయి. మొదట గుడిలొ పూజించినన్నె పూలతొ రెండవ గుడిలొ పూజించి మిగిలిన పూలు ముడవ చెరువులొ ముంచితే అవి రెట్టింపు అయినాయి. మొదట గుడిలొ పూజించినన్నె పూలతొ ముడవ గుడిలొ పూజించి బయటకు వచ్చి చూచిన ఆ భక్తుడి వద్ద పూలు లేవు. మొదట తీసుకుకెల్లిన పూలు ఎన్ని? ఒక్కొక్కగుడిలో పూజించిన పూలు ఎన్ని?
జవాబు
ఏడు పూలు తీసుకొని బయలు దేరి ఒక్కొక్క గుడిలో ఎనిమిది పూలతో పూజించాడు.
  • 2. కొంతమంది పిల్లలు ఉన్నారు మరియు కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి.
ఒక్కొక్క పిల్లవానికి ఒక్కొక్క పండు ఇస్తే ఒక పండు మిగిలుతుండది. ఒక్కొక్క పిల్లవానికి రెండు పండ్లు ఇస్తే ఒక పిల్లవానికి పండ్లు దొరకలేదు. అయితే ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి?
జవాబు
ముగ్గురు పిల్లలు మరియు నాలుగు మామిడి పండ్లు
  • 3. ఒక పిల్లవాని పుట్టిన రోజున కొన్ని చాక్లేట్టులు తీసుకొని ఇంటికి వచ్చి లెక్కవేసాడు. తన స్నేహితులకు రెండు చాక్లేట్టులు చొప్పున పంచగా ఒక చాక్లేట్టు మిగిలింది.మిగలడం నచ్చక మూడు చాక్లేట్టుల చోప్పున పంచగా మరలా ఒక చాక్లేట్టు మిగిలింది. మిగలడం నచ్చక నాలుగు చాక్లేట్టుల చొప్పున పంచగా మరలా ఒక చాక్లేట్టు మిగిలింది. ఈ విధంగా ఈ ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది మరియు పది చోప్పున పంచగా ఒకె చాక్లేట్టు మిగిలింది. అయితే ఆ చాక్లేట్లు ఎన్ని?

జవాబు
2521

  • 4.మామిడి పండ్లు అమ్ముకొనే ముగ్గురు దగ్గర వరుసగా 50, 30 మరియు 10 పండ్లు ఉన్నాయి. 50 మామిడి పండ్లు ఉన్న వ్యాపారి ఏ ధరకు అమ్ముతాడో మిగిలిన ఇద్దరూ అదే ధరకు అమ్మవలసి ఉంది.మోత్తం మామిడి పండ్లు ఆ ముగ్గురు అమ్మిన తరువాత ఆ ముగ్గురు వద్ద డబ్బులు సమానంగా ఉన్నాయి. ఎలా?

జవాబు
50 పండ్ల వ్యాపారి మోదట 7 పండ్లు 10 రూపాయల చప్పున 49 మామిడి పండ్లు 70 రూపాయలకు అమ్మగా 1 పండు మిగులుతుంది. 30 పండ్ల వ్యాపారి 7 పండ్లు 10 రూపాయల చప్పున 28 మామిడి పండ్లు 40 రూపాయలకు అమ్మగా 2 పండ్లు మిగులుతుంది. 10 పండ్ల వ్యాపారి 7 పండ్లు 10 రూపాయల చప్పున అమ్మగా 3 పండ్లు మిగులుతుంది. 50 పండ్ల వ్యాపారి మిగిలిన ఆ ఒక పండును 30 రూపాయలకు అమ్మగా మోత్తం 100 రూపాయలు అవుతుంది. 30 పండ్ల వ్యాపారి మిగిలిన 2 పండ్లను 30 రూపాయల చప్పున 60 రూపాయలకు అమ్మగా మోత్తం 100 రూపాయలు అవుతుంది. 10 పండ్ల వ్యాపారి మిగిలిన 3 పండ్లను 30 రూపాయల చప్పున 90 రూపాయలకు అమ్మగా మోత్తం 100 రూపాయలు అవుతుంది. ఇది ఒక తమాష లెక్క మాత్రమే.

  • 5. 3X3 చబొద్దు పాఠ్యందరంలో ఏ నిలువ వరుసలోని సంఖ్యలను కూడినా, ఏ అడ్డు వరుసలోని సంఖ్యలను కూడినా, కర్ణాలలోని సంఖ్యలను కూడినా వాటి మొత్తం ఒకే సంఖ్య వస్తుంది.
జవాబు
ఆరున్నొక్కటి ఎనిమిది సారసముగ ఏడు ఐదు సద్గుణ మూడు రెండేసి తొమ్మిదేసి శ్రీరాముముని పేరు చెప్పి చివరకు నాలుగు. ఏ అడ్డు వరుసలోని సంఖ్యలను కూడినా, కర్ణాలలోని సంఖ్యలను కూడినా వాటి మొత్తం 15 వస్తుంది.
  • 6.సరద కూడికలు ( ముందుగా జవాబు వేసే కూడికలు)
ఎదైనా రెండు లేక మూడు అంకెల సంఖ్యను అడగాలి. తరువాత జవాబు అంటె కూడిక మెత్తం వేయాలి.తరువాత మరొ రెండు లేక మూడు అంకెల సంఖ్యను అడిగి దాని క్రింద రెండు లేక మూడు అంకెల సంఖ్యను మనం అంటె అడిగినవారు వేయాలి.మరల తరువాత మరొ రెండు లేక మూడు అంకెల సంఖ్యను అడిగి దాని క్రింద రెండు లేక మూడు అంకెల సంఖ్యను మనం అంటె అడిగినవారు వేయాలి.ఇప్పుడు ఆ మొత్తం ముందుగా వేసిన జవాబు కు సరిపోతుంది ఉదాహరణ: ఎదైనా రెండు లేక మూడు అంకెల సంఖ్యను అడగాలి.తరువాత జవాబు అంటె కూడిక మెత్తం వేయాలి
13


---
211
తరువాత మరొ రెండు లేక మూడు అంకెల సంఖ్యను అడిగి దాని క్రింద రెండు లేక ముడు అంకెల సంఖ్యను మనం అంటె అడిగినవారు వేయాలి.
13
25(అడిగినది)
74(అడిగినవారు వేసినది)

---
211
మరల తరువాత మరొ రెండు లేక మూడు అంకెల సంఖ్యను అడిగి దాని క్రింద రెండు లేక ముడు అంకెల సంఖ్యను మనం అంటె అడిగినవారు వేయాలి.
13
25(అడిగినది)
74(అడిగినవారు వేసినది)
37(అడిగినది)
62(అడిగినవారు వేసినది)
---
211
---
జవాబు సరిపోయింది

ఈ లెక్క లోని చిట్క
1.జవాబులోమొదట చెప్పిన సంఖ్యనుండి 2తీసివేయాలి.ఆ విధంగా వచ్చిన సంఖ్యకు మందు 2 వేయాలి.

2.తరువాత మరొ రెండు లేక మూడు అంకెల సంఖ్యను అడిగి దాని క్రింద అంకె కు మనం వేసే అంకె కూడగా 9 వచ్చునట్లు
పై ఉదాహరణలో 25 కు 2+7=9 మరియు 5+4=9 అయ్యే విధంగా 25 కు క్రింద 74 వేసాను.

3.ఈ విధంగా రెండవసారి కూడ వేయాలి.పై ఉదాహరణలో 37 కు 3+6=9 మరియు 7+2=9 అయ్యే విధంగా 37 కు క్రింద 62 వేసాను.
ఈ విధంగా రెండు లేక మూడు అంతకంటే ఎక్కువ సంఖ్యలకు కూడా చేయవచ్చును.
  • 7.బ్యాంకులో లెక్క తప్పింది
ఒక ముదుసలి బ్యాంక్ కు వెళ్ళి తను అనుకొన్నవిధంగా కాకుండా పైసలను రూపాయలుగా మరియు రూపాయలను పైసలుగా చెక్కుమీద వ్రాసి డబ్బుతీసుకొన్నాడు.బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఉన్న బిక్షువుకు ఐదు పైసలు దానం చేసినాడు.ఇంటికి వెళ్ళిచూడగా తను అనుకొన్నదానికి రెట్టింపు డబ్బులున్నవి.అయిన అనుకొన్నవి ఎన్ని రూపాయలు మరియు ఎన్ని పైసలు?
జవాబు
డబ్బులు తీసుకోవాల్నుకొన్నది రూ 31.63 పై. కాని చెక్కుమీద వ్రాసినది రూ 63.31 పై.బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఉన్న బిక్షువుకు ఐదు పైసలు దానం చేయగా మిగిలినది రూ 63.26 పై.ఈ మొత్తం అనుకొన్న దానికి రెట్టింపు (2×31.63=63.26)
  • 8.అడగకుండా జవాబు
ఏదైన ఒక అంకె కోరుకో.దానికి అదే అంకె కలుపు.కూడగా వచ్చిన సంఖ్య కు 10 కలుపు. అందులోనుంచి సగం దేవుని పేర తీసివెయ్యి.దానిలోనుంచి కొరుకోన్న అంకె తీసివెయ్యి.నీ దగ్గర మిగిలినది 5 అని అడగకుండా జవాబు చెప్పవచ్చు.
ఈ లెక్క లోని చిట్క ఎంత కలపమని ఇచ్చిన దానిలొ సగం మిగులుతుంది.పై ఉదాహరణలో 10 కలుపమనగా 5 మిగిలినది.
  • 9.చిన్న లెక్కలు
1-9 లోపు ఒక అంకె కొరుకొ. దానిని 2 తో గుణించి 2 కలుపు. తరువాత 5 తో గుణించి 5 కలుపు.తరువాత 10 తో గుణించి 10 కలుపు. వచ్చిన సంఖ్య ని అడగాలి. ఉదాహరణ:పై చెప్పిన విధంగా చేయగా వచ్చిన సంఖ్య 760 కొరుకొన్నది 6 ఈ లెక్క లోని చిట్క: ప్రతి సంఖ్య చివర 60 వస్తుంది.దానిని తీసివేయగా మిగిలిన అంకె నుండి 1 తీసివేయగా కొరుకొన్న అంకె వస్తుంది.

  • 10.వర్గాల మొత్తానికి సమానం
1233 = 12^2 + 33^2 = 144+1089 = 1233
990100 = 990^2 + 100^2 = 980100+10000 = 990100
5882353 = 588^2 + 2353^2 = 345744+5536609 = 5882353
94122353 =9412^2 + 2353^2 = 88585744+5536609 = 94122353

Monday, June 25, 2012

firefox tips


ఫైర్‍ఫాక్స్ టాబ్‍ల క్రమాన్ని మార్చుకోవడం …….


Internet Explorer కన్నా స్థిరంగా పనిచేస్తుండడం మూలంగా చాలామంది పిసి యూజర్లు ఇటీవలి కాలంలో firefox బ్రౌజర్‍ని ఉపయోగిస్తున్నారు. ఫైర్‍ఫాక్స్ ని మన అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే బ్రౌజర్ ద్వారానే అన్ని పనులూ నెరవేర్చుకోగలిగేలా ఫైర్‍ఫాక్స్ విషయంలో అనేక ధర్డ్ పార్టీ ఉచిత add-on లూ లభిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే మీరు ఫైర్‍ఫాక్స్ బ్రౌజర్‍ని ఉపయోగిస్తూ, ఒకే విండోలో ఒకదాని తర్వాత ఒకటి దాదాపు ఓ పదో పన్నెండో వెబ్‍సైట్లని ఓపెన్ చేశారనుకుందాం. ఇలా ఓపెన్ చేసేటప్పుడు మనం కొత్తగా వేరే టాబ్‍లో ఓపెన్ చేసే వెబ్‍సైట్ ప్రస్తుతం ఉన్న టాబ్‍కి ప్రక్కనే కొత్త టాబ్‍లొ ఓపెనవుతుంది. ఒకవేళ ఇలా ఓపెన్ చేయబడి ఉన్న టాబ్‍లు మీకు నచ్చిన క్రమంలో అమర్చబడి లేకపోతే వాటిని ముందుకూ వెనుకకూ కూడా రీఅరేంజ్ చేసుకోవచ్చు. అదెలాగంటే ఏ టాబ్‍నైతే మీరు మూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి కావలసిన దిశలో డ్రాగ్ చేయండి.

ఫైర్‌ఫాక్స్ వేగంగా పనిచేయడానికి ఓ Add-on



ఇంటర్నెట్ బ్రౌజింగ్‍కి IE బదులుగా ఫైర్‌ఫాక్స్ వాడేవారు Network Pipelining వంటి కొన్ని సెట్టింగులను మార్చడం ద్వారా వేగంగా పనిచేస్తుంది. అయితే వాటిని మేన్యు‍వల్‌గా కాన్ఫిగర్ చేయడం ఇబ్బంది అనుకున్నట్లయితే Fasterfox అనే add-on మీ ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇందులో Prefetching, Cache, Rendering ,కనెక్షన్ స్పీడ్, పైప్ లైనింగులకు సంబంధించిన రెడీమేడ్ సెట్టింగులు లభిస్తుంటాయి. వాటిని మీరు కోరుకున్న విధంగా సెట్ చేసుకోవచ్చు.

అనధికార సైట్లలో స్క్రిప్ట్‌లు, కంట్రోళ్ళు రాకుండా..


ఆన్‌లైన్ ద్వారా వ్యాప్తి చెందే అధికశాతం వైరస్‌లు, స్పైవేర్లు, adware ల వంటివి వివిధ చట్ట విరుద్ధమైన వెబ్‌సైట్లలో పొందుపరచబడి ఉండే జావా స్క్రిప్ట్, Active X కంట్రోళ్ళ ద్వారా మన సిస్టంలోకి ప్రవేశిన్స్తుంటాయి. ఈ నేపధ్యంలో ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ద్వారా మనం నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు కేవలం మనం సురక్షితమైనవిగా పేర్కొన్న Yahoo, Google వంటి కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే మన పిసిలో ఆయా స్క్రిప్ట్‌లను రన్ చేయగలిగేలా, ఇతర వెబ్‌సైట్ల నుండి రన్ అయ్యే స్క్రిప్ట్‌లు, ActiveX కంట్రోళ్ళు నిలుపుదల చేయబడేలా No Script అనే add-on లభిస్తుంది.

Stop బటన్‌కి ప్రేమ చిహ్నం కావాలా?


ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లోని Stop బటన్‌లోని X గుండ్రని ఆకారంలో కాకుండా

ప్రేమ చిహ్నంలో చూపించబడాలంటే Stop in the name of love అనే

add-on ని వాడవచ్చు.

PDF ఫైళ్ళుగా మార్చే ఫైర్ ఫాక్స్ Add-on


మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆయా వెబ్ పేజీలను PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయడానికి ప్రస్తుతం అనేక సాఫ్ట్ వేర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటి పని తీరుకు భిన్నంగా పనిచేసే LOOP for FireFox అనే ఫైర్ ఫాక్స్ add-on విడుదల చేయబడింది. దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా వెబ్ పేజీని చూసేటప్పుడు Add URL అనే బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే వెబ్ పేజీ PDF ఫైల్‌గా కన్వర్డ్ చేయబడుతుంది. ఒక ప్రక్క మనం వేరే సైట్లను బ్రౌజింగ్ చేసుకుంటూనే PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయవలసిన వెబ్ పేజీల లింకుల్ని add చేసి పెడితే బ్యాక్ గ్రౌండ్‌లో అవన్నీ మనకు ఇబ్బంది కలిగించకుండా PDF ఫార్మేట్ లోకి కర్వర్ట్ చేయబడుతుంటాయి.


Orkut స్క్రాప్‌లు సులభంగా పంపడానికి



ఈ మధ్య కాలంలో చాలామంది Orkut Scrap ల రూపంలో ముచ్చటించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వేరే టాబ్‌లో orkutని ఓపెన్ చేయవలసిన అవసరం లేకుండా నేరుగా ఇతరుల స్క్రాప్ బుక్‌కి స్క్రాప్‌లను పోస్ట్ చేయడానికి OrkutScrapEasy అనే add on ఉపయోగపడుతుంది. దీనిని http://addons.mozilla.org/en-US/firefox/addon/2669 అనే వెబ్ పేజి నుండి పొందవచ్చు.

ఓపెన్ చేయకముందే లింక్‌ల ప్రివ్యూ


మీరొక వెబ్‌సైట్‌ని బ్రౌజ్ చేస్తున్నారనుకుందాం. అందులో వేరే వెబ్‌పేజికి ఒక లింక్ ఉంటే అందులో ఏముందో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తేనే అర్ధమవుతుంది. అయితే లింక్‌ని ప్రత్యేకంగా ఓపెన్ చేయనవసరం లేకుండా సింపుల్‌గా లింక్‌పై మౌస్ పాయింటర్‌ని పెట్టిన వెంటనే ఆ లింక్ యొక్క ప్రివ్యూ చూపించబడేలా ఏదైనా సదుపాయం ఉంటే బాగుంటుంది కదూ! ఈ పనిని నెరవేర్చి పెట్టడానికి https://addons.mozilla.org/en-US/firefox/addon/2207 అనే వెబ్ పేజీలో Coolris Previews అనే add on లభిస్తోంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే లింక్‌పై మౌస్‌ని ఉంచినప్పుడు ప్రక్కనే బ్లూ బాక్స్ కనిపిస్తుంది. దానిపై మౌస్‌ని ఉంచితే ఆ లింక్ ప్రివ్యూ అక్కడే కనిపిస్తుంది.

గురువారం 6 డిసెంబర్ 2007

ఫైర్‌ఫాక్స్ లో తెలుగు అక్షరాలు కనిపించడం లేదా?



కొన్ని తెలుగు వెబ్ సైట్లని ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ చేసినప్పుడు పై చిత్రంలో విధంగా అక్షరాలు గజిబిజిగా కనిపిస్తుంటాయి.



ఈ పరిస్థితిని అధిగమించి తెలుగు సైట్లలోని సమాచారం ఫైర్ ఫాక్స్ లో సలక్షణంగా కనిపించాలంటే https://addons.mozilla.org/en-US/firefox/addon/873 అనే వెబ్‌పేజీలో కనిపించే Padma అనే add-on ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ add-on ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత తెలుగు, మలయాళం, తమిళం, మరాఠీ,గుజరాతీ, బెంగాలీ,గుర్‌ముఖి వంటి వివిధ భాషల్లోని వెబ్‌పేజీల్లోని సమాచారం సవ్యంగా ఫైర్‌ఫాక్స్ విండోలో ప్రదర్శింపబడుతుంది. మీ సిస్టమ్ లోని ఫైర్ ఫాక్స్ లో తెలుగు సరిగ్గా కనిపించనప్పుడు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

గురువారం 29 నవంబర్ 2007

registry

ఈ ఫైళ్లు ఎందుకూ పనికిరావు...


తక్కువ ధరలకే భారీ స్టోరేజ్ సామర్థ్యం గల హార్డ్ డిస్కులు లభిస్తున్న ప్రస్తుత తరుణంలో గతంలో హార్డ్ డిస్కు నుండి అనవసరమైన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకునే వారు కూడా "చాలా స్పేస్ ఉంది కదా" అని బద్ధకిస్తున్నారు. డిస్క్ స్టోరేజ్ సామర్ధ్యం ఎంత భారీగా ఉన్నా అందులో సమాచారం ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయి ఉంటే ఖచ్చితంగా కంప్యూటర్ పనితీరు మందగిస్తుంది. కాబట్టి వీలైనప్పుడలా విండోస్ లోని టెంపరరీ ఫోల్డర్, Cookies, History, Temporary Internet Files ఫోల్డర్లలోని ఫైళ్లని డిలీట్ చేసుకోవడం మంచిది. అలాగే Start>Find/Search ఆప్షన్ ద్వారా హార్డ్ డిస్కులో *.tmp, *.~mp, *.gid, *.fts, *.chk, *.00*, *.$$$, *.*$, *.syd, *.old, *.bak వంటి ఎక్స్ టెన్షన్ నేమ్ లను కలిగి ఉన్న ఫైళ్లన్నింటినీ తొలగించుకోండి. వాటన్నింటినీ డిలీట్ చేసిన తర్వాత ఒకసారి డిస్క్ డీఫ్రాగ్ మెంటేషన్ ప్రోగ్రామ్ ని రన్ చేయడం మంచిది. ఒకవేళ ఏవైనా ఫైళ్లని డిలీట్ చేస్తే ప్రాబ్లెమ్ వస్తుందేమోనని సందేహం వచ్చినట్లయితే వాటిని వేరే లొకేషన్ కి మూవ్ చేసి కొన్నాళ్లపాటు అబ్జర్వేషన్ లో పెట్టి వాటిని మూవ్ చేయడం వల్ల ఎలాంటి సమస్య రాకపోయినట్లయితే వాటిని తొలగించవచ్చు. విండోస్ లోని Disk Cleanupని రన్ చేయడం ద్వారా కూడా అధికశాతం వృధా ఫైళ్లని తొలగించుకోవచ్చు.

స్టెగనోగ్రఫీతో దాచిపెట్టబడిన వాటిని కనుక్కోవచ్చు..


ఫొటోలలోనూ, MP3 ఫైళ్లలోనూ రహస్యంగా ఇతర ఫైళ్లని జొప్పించి ఇతరులకు కనపడకుండా చేరవేసే ప్రక్రియను స్టెగనో గ్రఫీ అంటారు. ఇలా ఒక ఫైల్ లో రహస్యంగా సమాచారాన్ని జొప్పించడానికి అనేక రకాల స్టెగనోగ్రఫీ సాఫ్ట్ వేర్లు లభిస్తున్నాయి. అయితే ఈ స్టెగనోగ్రఫీకి విరుగుడుగా స్టెగనాలసిస్ అనే ప్రత్యేకమైన టెక్నిక్ సైతం వాడుకలోకి వచ్చింది. మనం ఏ పేరెంట్ ఫైళ్లలో అయితే రహస్య సమాచారాన్ని పొందుపరిచామో ఆ పేరెంట్ ఫైళ్లని స్వీకరించి, విశ్లేషించి, అందులో అంతర్గతంగా పొందుపరచబడి ఉన్న సమాచారాన్ని గుర్తించి నాశనం చేసే ప్రక్రియనే స్టెగనాలసిస్ గా వ్యవహరిస్తారు. స్టెగనోగ్రఫీ కంటెంట్ ని గుర్తించే ఇలాంటి సాఫ్ట్ వేర్లలో Stegdetect అనే ప్రోగ్రామ్ JPEG ఇమేజ్ ఫైళ్లలో రహస్యంగా పొందుపరచబడిన సమాచారాన్ని వెదికిపట్టుకోగలుగుతుంది.

ఫైల్ మేనేజ్‍మెంట్

ఫైళ్ళని సక్రమంగా నిర్వహించుకోనిదే కంప్యూటర్ ద్వారా ప్రయోజనం పొందడం సాధ్యపడదు. ఫైళ్ళని క్రియేట్ చేసుకోవడానికి వాటిని ఫోల్డర్లలో స్టోర్ చేసుకోవడానికి వీలు కల్పించే విండోస్ డిఫాల్ట్ సదుపాయాలతో పాటు వివిధ సందర్భాల్లో ఫైళ్ళని మేనేజ్ చెయ్యడానికి ఉపకరించే పలు ధర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు లభిస్తున్నాయి. ఫైళ్ళని మేనేజ్ చేసుకునే భిన్నమైన మార్గాల గురించి తెలుసుకుందాం.



ముక్కలు చెయ్యడానికి,కలపడానికి

4MB సైజ్‌గల ఫైల్‌ని ఫ్లాపీలో కాపీ చేయవలసి వస్తే సాధ్యపడదు కదా! అలాగే 1GB సైజ్‌గల ఒక ఫైల్‌ని నేరుగా సిడిలో రైట్ చేయలేం. అలాంటప్పుడు మనం కోరుకున్న పరిమాణంలో ఫైళ్ళని విడగొట్టడానికి , ఆల్రెడీ విడగొట్టబడి ఉన్న ఫైళ్ళని తిరిగి సింగిల్ ఫైల్‌గా జాయిన్ చేయ్యడానికి File Splitter, AxMan, Dariolius.Pro Splitter, GSplit వంటి సాఫ్ట్‌వేర్లు ఉపయోగపడుతుంటాయి.




భారీమొత్తంలో ఫైళ్ళ పేర్లు మార్చడానికి

డిజిటల్ కెమెరాల నుండి ఫోటోలను సిస్ట్‌లోకి ట్రాన్‌స్ఫర్ చేసుకునేటప్పుడు అన్ని ఫోటోలుDSC001,DSC002... వంటి ఒకే తరహా పేర్లతో స్టోర్ చెయ్యబడతాయి. వందలకొద్ది ఉండే ఇలాంటి ఫైళ్ళ యొక్క పేర్లని ఒకటోకటిగా మార్చడం చాలా కష్టమైన వ్యవహారం. భారీ సంఖ్యలో ఉన్న ఏ తరహా ఫైళ్ళనైనా మనం కోరుకున్న సీక్వెన్స్‌లో క్షణాల్లో రీనేమ్‌చెయ్యడానికి... Rename4U, Bulk Rename Utility, Rename Master, Lupas Rename వంటి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాములు అవసరం అవుతుంటాయి.




ఫైళ్ళు ఇతరులు ఓపెన్ చెయ్యకుండా

మన సిస్టమ్‌లో ఉన్న ముఖ్యమైన ఫైళ్ళని ఇతరులు చూడకుండా జాగ్రత్తపడాలంటే థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లపై ఆధారపడవలసి వస్తుందే. ఒకసారి పాస్‌వర్డ్ సెట్ చేసిన తర్వాత కేవలం పాస్‌వర్డ్ కరెక్ట్‌గా టైప్ చేస్తేనే ఆయా ఫైళ్ళని ఓపెన్ చేసి పెట్టే ఎన్‌క్రిప్షన్ సాఫ్ట్‌వేర్లని ఉపయోగించడం మంచిది.ఇలాంటి ప్రోగ్రాముల్లో Encrypt-it, Encryption Protection, Stealth File Encryptor, Encrypt Genie వంటి పలు సాఫ్ట్‌వేర్లు నెట్‌పై అందుబాటులో ఉన్నాయి.




ఫైళ్ళ పరిమాణాన్ని కుదించడానికి.

విలువైన హార్డ్‌డిస్క్ స్పేస్‌ని ఆదా చేసుకోవడం కోసం ప్రస్తుతం అంతగా అవసరం లేని ఫైళ్ళని కంప్రెస్ చేసుకుని స్టోర్ చేసుకోవడం మంచిది. WinME, Xp ఆపరేటింగ్ సిస్టమ్‌లలో Compressed Folders అనే సదుపాయం పొందుపరచబడినా దానికన్నా సాధ్యమైనంత ఎక్కువ పరిమాణంలో ఫైళ్ళ పరిమాణాన్ని కుదించే WinRar, WInZip, WinACE,CoolZip, Zip-n-Go వంటీ సాఫ్ట్‌వేర్లు అనేక సందర్భాల్లో ఉపయుక్తంగా ఉంటాయి. ట్రై చేసి చూడండి.

ఈ పదాలకు అర్థాలు తెలుసా

Mainframe, Minicomputer, Micro-computer: కంప్యూటర్లలోని ప్రధానమైన మూడు సైజులివి. భారీ కార్పోరేట్ సంస్థలు, బ్యాంకులు మెయిన్ ఫ్రేమ్‌లను ఉపయోగిస్తుంటాయి. స్కూళ్ళు, ఇతరత్రా మధ్యస్థాయి సంస్థలు మినీ కంప్యూటర్లను వాడుతుంటాయి. చివరగా మనం ఇళ్ళలో , ఆఫీసుల్లో వాడే పర్సనల్ కంప్యూటర్లు మైక్రో కంప్యూటర్లుగా పరిగణించబడుతూ ఉంటాయి. ఎక్కువ వాడుకలో ఉన్నవివే.

Male Connector పిన్‌లను కలిగిఉండే కంప్యూటర్ కనెక్టర్‌ని Male Connector గా పిలుస్తారు. ఉదా.కు పేరలల్ పోర్ట్ ప్రింటర్, స్కానర్లను కంప్యూటర్‌కి కనెక్ట్ చేసే కేబుల్, హార్డ్‌డిస్క్,సిడిరామ్ డ్రైవ్ వంటి వివిధ డిస్క్‌లకు మనం పవర్ సప్లై నిమిత్తం కనెక్ట్ చేసే కేబుళ్ళు,మేల్ కనెక్టరుకు చెందినవిగా చెప్పబడుతున్నాయి.

Margin : పేజ్ డిజైనింగ్, వర్డ్ ప్రాసెసింగ్, ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లలో ఈ పదం వినిపిస్తుంటుంది. ఒక ప్రామాణికమైన పేజీసైజ్‌ని తీసుకుని , అందులో పేజీ అంచులకు పెజీలో పొందుపరిచే సమాచారానికి మధ్య మనం వదిలివేసే ఖాళీ స్థలాన్ని మార్జిన్ అంటారు.

సోమవారం 6 ఆగస్టు 2007

డివిడి డిస్క్ లలో ఉండే ఫైళ్ల వివరాలు


ఎప్పుడైనా డివిడి డిస్క్ ల్లోని ఫైళ్ల పేర్లను చూసినట్లయితే VOB, IFO, BUP వంటి ఎక్స్ టెన్షన్ నేం కలిగిన ఫైళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక డివిడి డిస్క్ ని డివిడి ప్లేయర్లో ప్లే చేయాలంటే ఈ ఫైళ్లు తప్పనిసరిగా ఉండాలి. VOB ఫైళ్లలో సినిమా యొక్క ఆడియో మరియు వీడియో సమాచారం భద్రపరచబడి ఉంటుంది. IFO ఫైళ్లలో ఆ డివిడి మూవీని డివిడి ప్లేయర్ ఎలా ప్లే చేయాలన్న వివరణ ఉంటుంది. IFO ఫైల్ లేనిదే వీడియో, ఆడియో సమాచారంతో కూడిన VOB ఫైల్ ఉన్నాడివిడి ప్లేయర్ (టివికి కనెక్ట్ చేసుకునేది) ఆ వీడియోని ప్లే చేయలేదు. IFO ఫైళ్లు ఏ కారణం చేతైనా కరప్ట్ అయినట్లయితే, వాటి స్థానే బాధ్యతలు నిర్వర్తించడానికి IFO ఫైళ్లకు బ్యాకప్ కాపీగా BUP ఫైళ్లు డివిడి డిస్క్ల్ లో భద్రపరచబడి ఉంటాయి. చాలామంది కేవలం ఒరిజినల్ డివిడి డిస్క్ లోని VOB ఫైళ్లను వేరే ఖాళీ డివిడిలోకి కాపీ చేస్తే డివిడి రెడీ అయిపోతుందని భావిస్తుంటారు. IFO, BUP ఫైళ్లు లేకుండా ఒరిజినల్ VOB ఫైల్ ఉన్నా టివికి కనెక్ట్ చేసే డివిడి ప్లేయర్ విషయంలో అది నిరుపయోగమే!

ఫొటోలను ఎడిట్ చేసి సేవ్ చేసేటప్పుడు..


ఫొటోషాప్ వంటి పవర్ ఫుల్ ఇమేజ్ ఎడిటింగ్ సాప్ట్ వేర్ల సాయంతో రకరకాల ఇమేజ్ లను వివిధ Layersగా అమర్చుకుని అందంగా డిజైన్ చేసినప్పుడు దానిని BMP వంటి ఫొటో ఫార్మేట్లలోకి సేవ్ చేస్తే అందులోని లేయర్లు అన్నీ గ్రూప్ చేయబడతాయి. దానితో భవిష్యత్ లో ఆ ఇమేజ్ లో పొందుపరిచిన లేయర్లని విడివిడిగా ఎడిట్ చేయడానికి వీలుపడదు. కాబట్టి ఎంతో కష్టపడి వివిధ లేయర్లని అమర్చుకుని, పలు రకాల ఫిల్టర్లని ఉపయోగించుకుని మీరు డిజైన్ చేసుకున్న ఇమేజ్ లను "ఇక అదే ఫైనల్ ఇమేజ్, అంతకు మించి ఎడిట్ చేయడానికి ఇంకా ఏమీ లేదు" అనుకుంటే తప్ప లేయర్లని Flat చేయకండి. భవిష్యత్ లో మళ్లీ ఎడిట్ చేయాలనుకున్న ఇమేజ్ లను ఫొటోషాప్ ఇమేజ్ ఫార్మేట్ అయిన PSD ఫార్మేట్లో సేవ్ చేయండి. లేదా TIFF ఫార్మేట్లో సేవ్ చేయదలుచుకున్నా Layersని include చేయడం మాత్రం మరువకండి. ఇలా ఇమేజ్ తో పాటు లేయర్లనీ సేవ్ చేయడం వల్ల ఫైల్ యొక్క పరిమాణం పెరుగుతుంది. ఎన్ని ఎక్కువ లేయర్లు ఉంటే ఫైల్ సైజ్ అంత ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

ఆటో రన్ వల్ల నష్టమే ఎక్కువ!


Windows XP, 9x ఆపరేటింగ్ సిస్టంలలో సిడి/డివిడి డ్రైవ్ లో సిడి/డివిడిలను ఇన్ సర్ట్ చేసినప్పుడు వాటిలో ఉండే సమాచారం ఆటోమేటిక్ గా ఓపెన్ చేయబడే విధంగా Autorun సదుపాయం డీఫాల్ట్ గా ఎనేబుల్ చేయబడి ఉంటుంది. వాస్తవంగా సిడి/డివిడి డ్రైవ్ ల Autorun వల్ల మనకు కలిగే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ. ఈ సదుపాయం ఎనేబుల్ చేయబడి ఉన్నప్పుడు మనం సిడి డ్రైవ్ లో సిడిని పెట్టినా పెట్టకున్నా ఏవో కొంపలు ముంచుకుపోతున్నాయన్నట్లు ప్రతీ 5 సెకండ్లకోసారి విండోస్ ఆపరేటింగ్ సిస్టం సిడి డ్రైవ్ వైపు దృష్టి మళ్లిస్తుంటుంది. అంటే ప్రతీ 5 సెకండ్లకోసారి విండోస్ ఆపరేటింగ్ సిస్టం సిడి/డివిడి డ్రైవ్ లను తనిఖీ చేయడానికే కొన్ని వనరుల్ని వినియోగిస్తుందన్న మాట. దీనివల్ల చాలా సూక్ష్మ పరిమాణంలో సిస్టం పనితీరు నెమ్మదిస్తుంది. ఇకపోతే Autorun.inf అనే ఫైల్ పొందుపరచబడి ఉన్నసిడిలను ఇన్ సర్ట్ చేసినప్పుడు మాత్రమే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆటోరన్ సదుపాయం ఆ ఫైల్ని ఏక్టివేట్ చేసి అందులో పొందుపరచబడి ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సాధారణంగా మనం ఎక్కువగా autorun.inf ఫైల్ లేని మామూలు సిడిలనే ఇన్ సర్ట్ చేస్తుంటాం. Autorun సదుపాయం మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో డీఫాల్ట్ గా ఎనేబుల్ చేయబడి ఉంటుంది కాబట్టి.. అలాంటి మామూలు సిడిలను సైతం విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఎక్కడైనా Autorun.inf ఫైల్ ఉందేమోనని అన్వేషిస్తుంది. దీనివల్ల కూడా కొంతవరకూ పిసి పనితీరు క్షీణిస్తుంది. ఈ నేపధ్యంలో సిడి/డివిడిల ఆటోరన్ సదుపాయాన్ని డిసేబుల్ చేసుకోవడం ఉత్తమం. దీనికిగాను విండోస్ రిజిస్ట్రీని మోడిఫై చేయాలి. Start>Run కమాండ్ బాక్స్ల్ లో regedit అని టైప్ చేసి రిజిస్ట్రీ ఎడిటర్ ప్రోగ్రాం ని ఓపెన్ చేసి, అందులో HKEY_LOCAL_MACHINE\System\CurrentControlSet\Services\CDRom అనే విభాగంలోకి వెళ్లి కుడి చేతి వైపు AutoRun అనే Dword వేల్యూని వెదికి పట్టుకుని దానిపై మౌస్ తో రైట్ క్లిక్ చేయడం ద్వారా Modify అనే ఆప్షన్ ని ఎంచుకోండి. ఇప్పుడు ఆ Dwordకి ఆల్రెడీ ఉన్న 1 అనే విలువ స్థానంలో 0 అనే విలువను ఇస్తే autorun డిసేబుల్ అవుతుంది.

పదాలు చెప్పే కధలు



Sign off : లోకల్ ఏరియా నెట్‌వర్క్‌లో ఉన్న ఒక కంప్యూటర్ నుండి బయటకు రావడాన్ని లేదా మెయిల్ ఎకౌంట్ల నుండి వెలుపలికి రావడాన్ని Sign off లేదా log off, Sign Out అని వ్యవహరిస్తుంటారు.

Sign on/Sign In: కంప్యూటర్ సిస్టమ్‌లోకి ఇ-మెయిల్ ఎకౌంట్లలోకి ప్రవేశించే ప్రక్రియను sign on అని అంటారు. దీనినే ఒక్కోసారి Sign in అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రక్రియలో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు అవసరమవుతాయి.

Signal-to-Noise Ratio: వివిధ మాధ్యమాల ద్వారా సమాచారం ప్రసారం చెయ్యబడే సమయంలో డేటా ట్రాన్స్ఫరింగ్ లో మధ్యలో అవాంతరాలు ఏర్పడుతుంటాయి. దీనినే noise అంటుంటారు. ప్రసరించబడుతున్న సిగ్నల్‌కి నాయిస్‌కి మధ్య ఉన్న నిష్పత్తిని ఈ Signal-to-noise ratioగా పిలుస్తారు. సహజంగా దీన్ని డెసిబల్స్‌లో కొలుస్తారు.

Silicon: రాళ్ళు,ఇసుకలో లభిస్తూ కంప్యూటర్ చిప్‌లను తయారు చెయ్యడానికి ఉపయోగపడే మూలకమిది. ఈ సిలికాన్ అనే పదాన్ని ఆధారంగా చేసుకునే అమెరికాలోని SanJose, California చుట్టుపక్కల ప్రాంతాలకు సిలికాన్ వ్యాలీ అనే పేరుతో పిలుస్తుంటారు.

SIMD:Single Instruction/Multiple Data అనే పదానికి సంక్షిప్త రూపమిది. వేర్వేరు సమాచారంపై ఒకే ఆపరేషన్లను నిర్వహించే పారలల్ ప్రాసెసర్ ని SIMD పేరుతో పిలుస్తుంటారు.

పదాలు చెప్పే కథలు

Shell: యూజర్‌కి ఆపరేటింగ్ సిస్టమ్‌కి మధ్య పనిచేసే సాప్ట్ వేర్‌నే షెల్ అంటారు. ఉదా.కు. MS-DOS ఆపరేటింగ్ సిస్టమ్‌నే తీసుకుంటే COMMAND.COM అనే షెల్ ప్రోగ్రామ్ స్క్రీన్‌పై promptని ప్రదర్శిస్తూ యూజర్ కమాండ్లు టైప్ చెయ్యడానికి వీలు కల్పిస్తుంటుంది. పిసి యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కమ్యూనిటికేట్ చెయ్యడానికి వీలు కల్పించే ప్రతీ అంశం "షెల్" క్రిందికే వస్తుంది.

Shockwave: మాక్రోమీడియా సంస్థచే డెవలప్ చేయబడిన మల్టీ మీడియా ప్లేయర్‌నే shockwave player అంటాఅరు. షాక్‌వేవ్ ఫైళ్ళని క్రియేట్ చెయ్యడానికి Macromedia Director వంటి ప్రోగ్రాములని ఉపయోగిస్తారు. ప్రధానంగా ఇంటరాక్టివ్ గేమ్‌లను డెవలప్ చేయడానికి ఈ ఫార్మేట్ ఎంతో అనుగుణంగా ఉంటుంది.

Shortcut: ఒక ఫైల్, ఫోల్డర్ లేదా ప్రోగ్రామ్‌కి ప్రాతినిధ్యం వహిస్తూ డెస్క్‌టాప్‌పై గానీ, Quick launch bar లేదా Start మెనూల్లోగానీ, వివిధ ఫోల్డర్లలో గానీ పొందుపరచబడి ఉండే ఐకాన్లని షార్ట్‌కట్‌లుగా వ్యవహరిస్తారు. షార్ట్ కట్ ని క్లిక్ చేసినప్పుడు ఒరిజినల్ ప్రోగ్రాం యొక్క పాత్ గుర్తించబడి ఒరిజినల్ ప్రోగ్రాం/ఫైల్ ఓపెన్ చెయ్యబడుతుంది.

Shotgun debugging: ఒకేసారి పలు పరిష్కారాలను పరిగణనలోకి తీసుకుని ఏదైనా ప్రోగ్రామ్/హార్డ్‌వేర్/సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని సరిచెయ్యడానికి ప్రయత్నించడాన్ని "షాట్‌గన్ డీబగ్గింగ్" అంటారు. ఉదా.కు.. స్క్రీన్‌పై డిస్‌ప్లే రానప్పుడు క్యాబినెట్‌ని విప్పదీసి RAM మాడ్యూళ్ళని తొలగించి తిరిగి అమర్చడం, అదే సమయంలో హార్డ్‌డిస్క్ IDE, SATA కనెక్టర్లను రీకనెక్ట్ చెయ్యడం వంటి పలు పనుల్ని ఒకేసారి చెయ్యడం వల్ల ప్రాబ్లెం సాల్వ్ కావచ్చు. అయితే ఏ అంశం ప్రాబ్లెంకి దారి తీసిందన్నది మాత్రం గుర్తించలేం. ఇలా గుడ్డిగా డీబగ్ చెయ్యడాన్నే Shotgun Debugging అంటారు.

Shovelware: ఇతర వెబ్‌సైట్ల ద్వారా గానీ, ఫోరమ్‌ల నుండి గానీ సమాచారాన్ని సేకరించి డిజైనింగ్ వంటి ఏ అంశం గురించి ఆలోచించకుండా మరో వెబ్‌సైట్‌లో అదే సమాచారాన్ని ఉన్నది ఉన్నట్ట్లు పొందుపరచడాన్ని Shovelware అంటారు. ఆ సమాచారం ఎవరికి ఉపయోగపడుతుంది, డిజైనింగ్ ఎలా ఉండాలి వంటి అంశాలపై ఎటువంటి దృష్టి ఇలా చేసేటప్పుడు తీసుకోవడం జరగదు.

Show Control: హార్డ్‌వేర్, సాప్ట్ వేర్‌లచే నియంత్రించబడే లైటింగ్, సౌండ్, విజువల్ ఎఫెక్టులు తదితరాలు అందించే కంప్యూటర్ సిస్టమ్‌ని Show Control అంటారు.ఈ సిస్టమ్ DMX512, MediaLink,MIDI, SMPTE వంటి పలు టెక్నాలజీలను కలిగి ఉంటుంది.