సమాచారానికి స్పెషల్ ఎఫెక్టులు
కొంత సమాచారాన్ని టైప్ చేసి అది చుట్టచుట్టబడిన విధంగా క్రింది చిత్రంలోని
మాదిరిగా మార్చాలంటే మల్టీమీడియాపై ఎంతో అవగాహన కలిగి ఉండాలని చాలామంది
భ్రమపడుతుంటారు. వాస్తవానికి Adobe Photoshop, Illustrator వంటి పవర్ ఫుల్
ప్రోగ్రాంలకు మాత్రమే ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను సాధించే ప్రత్యేకమైన
ఫిల్టర్లు లభిస్తుంటాయి. అయితే ఆయా సాప్ట్ వేర్లు మీ వద్ద లేకపోయినా, లేదా

వాటిని ఉపయోగించడం ఎలాగో మీకు తెలియకపోయినా దిగులుపడవలసిన పనిలేదు. ఇంటర్నెట్ పై http://www.dotsphinx.com/partyprinter.en/ అనే వెబ్ సైట్ ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను అందిస్తోంది. ఈ వెబ్ సైట్లో కావలసిన షేప్ ని టెక్ట్స్ బాక్స్ లో మీకు కావలసిన సమాచారాన్ని టైప్ చేసి ఫాంట్ సైజ్ ని ఎంచుకుంటే సరిపోతుంది.

వాటిని ఉపయోగించడం ఎలాగో మీకు తెలియకపోయినా దిగులుపడవలసిన పనిలేదు. ఇంటర్నెట్ పై http://www.dotsphinx.com/partyprinter.en/ అనే వెబ్ సైట్ ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను అందిస్తోంది. ఈ వెబ్ సైట్లో కావలసిన షేప్ ని టెక్ట్స్ బాక్స్ లో మీకు కావలసిన సమాచారాన్ని టైప్ చేసి ఫాంట్ సైజ్ ని ఎంచుకుంటే సరిపోతుంది.
గురువారం 20 సెప్టెంబర్ 2007
ఏం ఫాంట్ వాడారన్నది తెలుసుకోవాలా?

వార్తాపత్రికలలోనూ, ఇంటర్నెట్ మీదా అనేక వెబ్‍సైట్లలో రకరకాల ఆకర్షణీయమైన
ఫాంట్లు పొందుపరచబడి ఉంటాయి. కొన్ని ఫాంట్లు మనకు బాగా నచ్చి వాటిని
మన డాక్యుమెంట్లలో ఉపయోగించాలన్న కోరిక ఉన్నా అది ఏ ఫాంట్ అన్నది
తెలియక ఊరకుండిపోతుంటాం ఈ నేపధ్యంలో న్యూస్ పేపర్‍లోని ఫాంట్ మీకు
నచ్చినట్లయితే దానిని స్కానర్ ద్వారా స్కాన్ చేసి, లేదా వెబ్‍పేజీల్లోని ఫాంట్
నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి http://www.myfonts.com/WhatTheFont/ వెబ్‍సైట్లో అప్‍లోడ్ చేస్తే ఆ ఫోటోలో ఉపయోగించిన ఫాంట్
పేరేమిటి, దాని వివరాలు, ఆ ఫాంట్ ఎక్కడైనా లభిస్తున్నట్లయితే దాని
డౌన్‍లోడ్ లింక్‍ని ఆ వెబ్‍సైట్ మనకు అందిస్తుంది. డౌన్‍లోడ్ చేసుకుని దాన్ని
వాడుకోవచ్చు.
శనివారం 15 సెప్టెంబర్ 2007
ఫోటోల్లో అవసరం లేని ఆబ్జెక్ట్ లుంటే…

ఓ గార్డెన్‍లో మీ కుటుంబ సభ్యులను నిలబెట్టి మీ దగ్గర ఉన్న డిజిటల్ కెమెరాతో
ఫోటో తీస్తున్నారనుకుందాం. Snap బటన్ క్లిక్ చేసేలోపే మీ ఫ్యామిలీ మెంబర్స్
వెనుకగా ఎవరైనా వ్యక్తులు వెళుతున్నా, జంతువులు వెళుతున్నా, కార్లు
వంటివి మూవ్ అవుతున్నా ఆ ఆబ్జెక్టులు సైతం మీరు తీసే ఫోటోలోకి చేరే అవకాశం
ఉంది. కొంతమంది నేచురాలిటీ కోసం అలాంటి అదనపు ఆబ్జెక్టులను పెద్దగా
పట్టించుకోరు. మరి కొంతమంది Photoshop వంటి సాఫ్ట్ వేర్లతో ఎలాగైనా ఆ
అనవసరమైన వస్తువులను తొలగించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి
కోసమే Tourist Remover అనే ఆన్‍లైన్ సర్వీస్ ఒకటి ఉపయోగపడుతుంది. www.snapmania.com/ అనే వెబ్‍సైట్‍లో
లభిస్తున్న ఈ సర్వీస్ ఫోటోగ్రాఫర్లకి ఉపయోగపడుతుంది. అనవసరమైన అంశాలు
ఫోటోలో తారసపడిన వెంటనే ఆలస్యం చేయకుండా మరో ఫోటోని షూట్ చేయండి.
ఈ రెండు ఫోటోలని Tourist Remover ప్రోగ్రామ్‍ని ఇస్తే అది మొదటి ఫోటోని
రెండవ ఫోటోతో మిక్స్ చేయడం ద్వారా మనం ఏ అంశాలైతే ఫోటోలో
కనిపించకూడదనుకుంటున్నామో వాటిని తొలగిస్తుంది. ఇది అధికభాగం పెయిడ్ సర్వీస్ కావడం కొద్దిగా ఇబ్బంది.
శుక్రవారం 14 సెప్టెంబర్ 2007
Wikia అందిస్తున్న ఉచిత హోస్టింగ్
వికియా సంస్థ తాజాగా ఉచిత వెబ్ హోస్టింగ్ సేవలను ప్రారంభించింది. Open Serving పేరిట
అందించబడుతున్న ఈ వెబ్ హోస్టింగ్ సర్వీసులను ఉపయోగించి ఎవరైనా తమ
స్వంత వెబ్‍సైట్లని ఇంటర్నెట్‍పై పొందుపరుచుకోవచ్చు. వెబ్‍స్పేస్, బ్యాండ్‍విడ్త్
పూర్తి ఉచితంగా అందించబడుతున్నాయి. మరో విశేషమేమిటంటే ఇతర ఫ్రీ వెబ్
హోస్టింగ్ సర్వీసులు ఉచిత బ్యాండ్‍విడ్త్ ని కల్పించిన మన వెబ్‍సైట్లలో
అడ్వర్‍టైజ్‍మెంట్లని గుప్పిస్తుంటాయి. దీని వల్ల మన సైట్‍ని విజిట్ చేయాలనుకునే
యూజర్లు వెనుకాడుతుంటారు. అయితే వికియా అందిస్తున్న
Open Serving సర్వీస్ ద్వారా మనమ్ వెబ్‍సైట్‍ని క్రియేట్ చేసుకున్నప్పుడు
మన సైట్‍లో ఎలాంటి అడ్వర్‍టైజ్‍మెంట్లు ప్రదర్శింపబడవు. నిజంగా ఇది పెద్ద విశేషమే.
YouTube సంస్థకి, Openservingకీ ఉన్న సంబంధాల దృష్ట్యా ఇది సాధ్యపడుతుంది
అని అంటున్నారు.. www.openserving.com సైట్ ద్వారా మీ సైట్‍ని
హోస్ట్ చేయండి.
అందించబడుతున్న ఈ వెబ్ హోస్టింగ్ సర్వీసులను ఉపయోగించి ఎవరైనా తమ
స్వంత వెబ్‍సైట్లని ఇంటర్నెట్‍పై పొందుపరుచుకోవచ్చు. వెబ్‍స్పేస్, బ్యాండ్‍విడ్త్
పూర్తి ఉచితంగా అందించబడుతున్నాయి. మరో విశేషమేమిటంటే ఇతర ఫ్రీ వెబ్
హోస్టింగ్ సర్వీసులు ఉచిత బ్యాండ్‍విడ్త్ ని కల్పించిన మన వెబ్‍సైట్లలో
అడ్వర్‍టైజ్‍మెంట్లని గుప్పిస్తుంటాయి. దీని వల్ల మన సైట్‍ని విజిట్ చేయాలనుకునే
యూజర్లు వెనుకాడుతుంటారు. అయితే వికియా అందిస్తున్న
Open Serving సర్వీస్ ద్వారా మనమ్ వెబ్‍సైట్‍ని క్రియేట్ చేసుకున్నప్పుడు
మన సైట్‍లో ఎలాంటి అడ్వర్‍టైజ్‍మెంట్లు ప్రదర్శింపబడవు. నిజంగా ఇది పెద్ద విశేషమే.
YouTube సంస్థకి, Openservingకీ ఉన్న సంబంధాల దృష్ట్యా ఇది సాధ్యపడుతుంది
అని అంటున్నారు.. www.openserving.com సైట్ ద్వారా మీ సైట్‍ని
హోస్ట్ చేయండి.
శనివారం 1 సెప్టెంబర్ 2007
డిస్పోజబుల్ మెయిల్ ఐడి కావాలా...
స్నేహితులు, సన్నిహితుల నుండి మెయిల్ మెసేజ్‌లు అందుకోవడానికి, పంపుకోవడానికి క్రియేట్ చేసుకున్న మన ప్రధానమైన మెయిల్ ఐడిని కొన్ని వెబ్‌సైట్లు, ఫోరమ్‌ల వంటి వాటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వచ్చినపుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని వెల్లడించవలసి వస్తోంది. ఇంకేముంది... మన మెయిల్ అడ్రస్ తెలిసిందే తడవుగా ఆయా వెబ్‌సైట్లు స్పాం మెసేజ్‌లతో మన inboxని నింపేస్తుంటాయి. ఈ బాధలన్నీ లేకుండా వాడిపారేసే ఓ డిస్పోజబుల్ మెయిల్ ఐడి ఉంటే బాగుణ్ణు అనుకునేవారు www.2prong.com అనే వెబ్‌సైటులోకి వెళ్ళండి. సైట్ ఓపెన్ అయిన వెంటనే ఓ ఇ-మెయిల్ అడ్రస్ మీ విండోస్ clipboardలోకి కాపీ చేయబడుతుంది. ఇక వివిధ ఫోరమ్‌స్‌లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఆ మెయిల్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తయ్యే ప్రాసెస్‌లో భాగంగా ఆయా ఫోరమ్‌లు activation linkలను పంపిస్తే ఆ లింకులు సైతం ఈ సైట్‌లో లభిస్తాయి ఈ సైట్ ద్వారా మనం క్రియేట్ చేసుకునే అడ్రస్‌లు ban చెయ్యబడకుండా ఉండడం కోసం ప్రతీ 48 గంటలకోసారి ఈ సైట్ తన డొమైన్ నేమ్‌ని మార్చుకుంటుంది సుమా!
అన్ని మీడీయా ఫార్మేట్లని సపోర్ట్ చేసే ప్లేయర్...

ఆడియో సిడిలు మొదలుకుని, విసిడిలు MP3, WMA, Real Audio,
Real Video, AVI, MPEG, MOV, QT, MIDI, AIFF వంటి
ప్రముఖ ఆడియో, వీడియో ఫార్మేట్లకు చెందిన అన్ని రకాల ఫైళ్ళనీ ప్లే చేయగల
శక్తివంతమైన మీడియా ప్లేయింగ్ మౄదులాంత్రము (Software)
CDH Media Wizard. కేవలం ఆయా ఫైళ్ళని ప్లే చెయ్యడమే కాకుండా,
WAV to MP3, MP3 to WAV ఆడియో సిడిలను WAV లేదా నేరుగా
MP3 ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చెయ్యగలుగుతుంది.
సోమవారం 13 ఆగస్టు 2007
భారతీయ ఐటి నిపుణులకు ఓ కమ్యూనిటీ

ఐ.టి నిపుణుల పరంగా మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలోని సాఫ్ట్‌వేర్ డెవలపర్లు,సాంకేతిక నిపుణులు, కాలేజీ విద్యార్థుల కోసం www.techtribe.com పేరిట ఓ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ప్రారంభించబడింది. సాధారణ వ్యక్తుల కోసం ఉద్ధేశించబడి Orkut వంటి ఇతర ఆన్‌లైన్ కమ్యూనిటీలు అనేకం ఉన్నాయిగాని ఈ Tech Tribe మాత్రం ఖచ్చితంగా టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇందులో మీ పేరు, హాబీలు, ఫోటో వంటి సాధారణ వివరాలతో పాటు వృత్తి పరంగా మీరు సాధించిన విజయాలు, మీరు అభివృద్ధిపరిచిన సాఫ్ట్‌వేర్ల వివరాలు, మీరు పనిచేసిన ప్రాజెక్టు వివరాలు, కన్సల్ట్ చేసిన కంపెనీలు వంటి అనేక వివరాలను మీ ప్రొఫైల్‌తో పాటు ఈ కమ్యూనిటీలో పోస్ట్ చేయవచ్చు. అలాగే మీరు పనిచేస్తున్న కంపెనీలో ఏవైనా అంశాలు మీకు నచ్చకపోతే ఇక్కడ తెలియజేస్తే అవి మీ కంపెని పరిశీలనకు తీసుకువెళ్ళబడి పరిష్కరించబడతాయి.
శనివారం 11 ఆగస్టు 2007
రేపిడ్‌షేర్‌కి గుడ్‌బై చెప్పండి

ఇంటర్‌నెట్‌పై ఉచితంగా ఫైళ్ళని స్టోర్ చేసుకోగలిగే సర్వీస్‌ని అందిస్తున్న Rapidshare తనకున్న పాపులారిటీని అడ్డుపెట్టుకుని ఫ్రీ యూజర్లని Download limitలు, ఇతర నియమాల పేరిట ఎంత విసిగిస్తుందో తెలిసిందే. దీని తలనొప్పులు తొలగిపోవాలంటే http://upload.divshare.com/ అనే ప్రత్యామ్నాయపు ఫైల్ హోస్టింగ్ వెబ్‌సైట్‌ని ఎంచుకోండి. ఈ సైట్ కి ఒక్కొక్కటి 200MB వరకు సైజ్ గల ఎన్ని అటాచ్‌మెంట్లనైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి పరిమిటి ఉండదు. Rapishareలో కేవలం 100MB అటాచ్‌మెంట్ మాత్రమే వీలుపడతాయని మీకు తెలిసిందే కదా! ఒకసారి మీరు అప్‌లోడ్ చేసుకున్న ఫైళ్ళని కొన్నాళ్ళపాటు ఎవరూ డౌన్‌లోడ్ చేసుకోకపోతే Rapidshare డిలీట్ చేసేస్తుంది. అయితే ఈ Divshare సైట్ మన ఫైళ్ళని శాశ్వతంగా తన వద్దే పెట్టుకుంటుంది. ఈ వెబ్‌సైట్ యొక్క ఇంటర్‌ఫేస్ కూడా చాలా సింపుల్‌గా వాడేలా ఉంటుంది.
ఆదివారం 15 జూలై 2007
ఆన్ లైన్ లోనే డాక్యుమెంట్లు రూపొందించుకోండి!
DOC పైళ్లని రూపొందించడానికి MS-Word , ఎక్సెల్ స్ర్పెడ్ షీట్ల రూపకల్పనకు MS-Excel సాప్ట్ వేర్ మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేయబడి ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే! అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు.. మీకు నెట్ కనెక్షన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే నేరుగా www.ajax13.com/en అనే వెబ్ సైట్ కి వెళ్లండి. ఆ సైట్లో Word, Excel, Sketch, Tunes, Presents వంటి ప్రోగ్రాములు, ajaxOS అనే ఆన్ లైన్ ఆపరేటింగ్ సిస్టం లభిస్తాయి. ajaxWrite అనే ఆప్షన్ ని ఎంచుకోవడం ద్వారా నేరుగా మీ కంప్యూటర్లోని ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరల్/ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లోనే MS-Word మాదిరిగా విండో ఓపెన్ అవుతుంది. అందులో మనం వర్డ్ డాక్యుమెంట్లని ఎలా డిజైన్ చేస్తామో అదే మాదిరిగా డాక్యుమెంట్లని రూపొందించుకుని File>Save As ఆప్షన్ ద్వారా ఆయా డాక్యుమెంట్లని మన కంప్యూటర్లో సేవ్ చేసుకోవచ్చు. IE7 లో ఈ ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ అవడం లేదు ఒక్కోసారి! పైర్ ఫాక్స్ లో ప్రయత్నించండి. Google Docs&Spreadsheets అనే ఆన్ లైన్ ప్రోగ్రాం ని కూడా ప్రయత్నించవచ్చు.
No comments:
Post a Comment