Monday, June 25, 2012

knowledge essay

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్
Sachintendulkar.jpg
Flag of India.svg India
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ లెగ్‌బ్రేక్/ఆఫ్‌బ్రేక్/మీడియం
కెరీర్ గణాంకాలు

Tests ODIs
మ్యాచ్‌లు 188 464
పరుగులు 15470 18426
బ్యాటింగ్ సగటు 55.44 44.64
100లు/50లు 51/65 49/96
అత్యుత్తమ స్కోరు 248* 200*

ఓవర్లు 643 1315
వికెట్లు 45 154
బౌలింగ్ సగటు 54.33 43.32
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 2
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 3/10 5/32
క్యాచ్ లు/స్టంపింగులు 113 140
As of ఆగస్ట్ 23, 2011
Source: [2]
ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar) (Hindi: सचिन रमेश तेंदुलकर). క్రికెట్ క్రీడకు భారతదేశం లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరే కారణం. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. 37 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ జట్టు విజయాలకై శాయశక్తుల ప్రయత్నిస్తూ వెన్నెముకలా నిలబడ్డాడు. 2002 లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా కు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ మరియు వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది.[1] . 2003 లో మళ్ళి తిరగరాసి వన్డే క్రికెట్ లో వివియన్ రిచర్డ్స్ కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కన్పిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం.టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో అక్టోబర్ 17, 2008 న వెస్ట్‌ఇండీస్ కు చెందిన బ్రియాన్ లారా ను అధికమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ [2] [3] అని పిలువబడే సచిన్ 1989 లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చినాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్..[4][5][6] ఫిబ్రవరి 24, 2010 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించి కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే డిసెంబర్ 19, 2010 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకోని మైలురాయిని అధిరోహించాడు. 2012, మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.

No comments:

Post a Comment