అన్ని లింకుల్లోని ఇమేజ్ లను తెచ్చే ప్రోగ్రాం

ఇంటర్నెట్ పై అనేక వెబ్ సైట్లలో భారీమోట్టంలో పిక్చర్ గ్యాలరీలు పొందుపరచబడి ఉంటాయి. ఒక్కో గ్యాలరీని ఎక్స్ ప్లోర్ చేస్తూ ఫోటొలను సేకరించడానికి ఇబ్బందిపడేవారు Picaloader అనే సాఫ్ట్ వేర్ ఉపయోగించి వెబ్ సైట్లలోని
ఫోటోలను ఆటోమేటిక్‌గా పొందవచ్చు. ఈ సాఫ్ట్ వేర్‌లో ఒక వెబ్ సైట్ అడ్రస్ ఇస్తే ఆ సైట్‌లోనూ , ఆ సైట్‌కి లింక్ చేయబడి ఉన్న ఇతర సైట్లలోనూ ఉన్న ఇమేజ్‌లన్నీ డౌన్ లోడ్ చేయబడతాయి.
గురువారం 20 మార్చి 2008
ఇమేజ్‍ల క్వాలిటీని తిరిగి రప్పించే ప్రోగ్రామ్

TIFF,BMP వంటి హైక్వాలిటీ ఇమేజ్ ఫార్మేట్లకు చెందిన ఇమేజ్‌లను
ఫైల్ సీజ్‌ని తగ్గించుకోవడానికి JPEG ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేస్తుంటాం.
JPEG లోకి మార్చబడేటప్పుడు ఫైల్ సైజ్ తగ్గడానికి కొంత ఇమేజ్ క్వాలిటీ
కూడా తగ్గించబడుతుంది. అలా ఇమేజ్ క్వాలిటీ కోల్పోయిన JPEG
ఇమేజ్‌లను తీసుకుని తిరిగి వాటిని సాధ్యమైనంత పూర్తి క్వాలిటీలోకి రప్పించే
ప్రోగ్రామే.. "Unjpeg". ఈ ప్రోగ్రాం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తుంది.
బుధవారం 19 మార్చి 2008
టాస్క్ బార్ నుండే విండో ప్రివ్యు

Windows Vista ఆపరేటింగ్ సిస్టమ్‍లో పలు అప్లికేషన్లని ఓపెన్ చేసినప్పుడు టాస్క్ బార్‍పై ఆయా అప్లికేషన్ల పేర్లపై మౌస్ పాయింటర్‍ని ఉంచితే ఆ అప్లికేషన్ యొక్క విండో ప్రివ్యూ చూపించబడుతుంది కదా! అదే విధమైన సదుపాయాన్ని Win XPలో పొందాలంటే Visual Task Tips అనే కేవలం 90KB మాత్రమే పరిమాణం గల ప్రోగ్రామ్‍ని మీ కంఫ్యూటర్లో ఇన్‍స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత టాస్క్ బార్‍పై ఏ అప్లికేషన్ యొక్క మీద అయినా మౌస్‍ని ఉంచితే దాని ప్రివ్యూ వస్తుంది.
No comments:
Post a Comment