Thursday, June 21, 2012

to know

శుభాకాంక్షలనేవి ఆనవాయితాగా చెప్పేవి కాకూడదు




డియర్ స్టూడెంట్స్,
v  శుభాకాంక్షలనేవి ఆనవాయితాగా చెప్పేవి కాకూడదు. నిండైన మనసుతో … మీ భావి జీవనం స్వర్గ తుల్యం కావాలని మనసా ఆకాంక్షిస్తూ,ఆశీర్వదిస్తూ  5 మంచి మాటలతో ఈ నూతన సంవత్సరాన నా  శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియ జేస్తున్నాను

v  మోయలేని భారాన్ని నవమాసాలు మోసి,అలవిమాలిన బాధను భరించి మనకు జన్మనిచ్చిన ఆ తల్లి మనసును ఎప్పుడూ కష్టపెట్టకండి.(కష్టపడి చదవడం ద్వారానే అది నీకు సాధ్యం)
v  తన రక్తాన్ని రంగరించి, కండల్ని కరగించి నిరంతరం శ్రమించి తన బిడ్డలు మానవులలో మాన్యులై ,అసామాన్యులై వెలుగొందాలన్న పిచ్చిప్రేమతో మీకోసం ఎన్నెన్నో వేదనలను భరించే ఆ తండ్రి మనసును గాయపర్చకండి.  (ఆకాశమే హద్దుగా వున్న నేటి అవకాశాలను అందిపుచ్చుకొని మీకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ద్వారానే ( JOB తెచ్చుకోవడం ద్వారా) ఇది సాధ్యం.
v  మీపట్ల వాత్సల్యాన్ని అణువణువునా నింపుకొని మీకు విధ్యాబుద్దులు నేర్పే మీ ఉపాధ్యాయులను, సర్వదా మీ మంచికోరే మీ ఆప్తులను,నేస్తాలను, మీరు జన్మించిన ఈ జన్మభూమిని ఏనాటికి మరువకండి.
v  ఎవరినుండి మీరు ఎంత చిన్న మేలు అందుకున్నా వారికి కృతజ్ఞతలు తెలియ జేయండి. మీకారణంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా క్షమాపణలు చెప్పడం మీ జీవన గమనంలో అలవాటుగా మార్చుకోండి.
v  ప్రతి చిన్న బాధకూ, అతి చిన్న అపజయానికి గుండెలు పిండిచేసే బాధకు గురికాకుండా “టేకిట్ ఈజీ పాలసీ” ని అలవర్చుకొని నవ్వుతూ,నవ్విస్తూ జీవిత నందన వనంలోని ప్రతి అడుగులో నవ్వులు పండిస్తూ ముందుకు సాగి పొండి. సదా మీ క్షేమాన్ని అభివృద్దిని ఆకాంక్షిస్తూ, మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు  తెలియజేస్తున్నాను.

No comments:

Post a Comment