సీక్రెట్‌గా టేబుల్ వద్ద మాటలు వినాలా?
మన్మధుడు సినిమాలో టేబుల్ క్రింద ఓ పరికరం అమర్చి అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారన్నది నాగార్జున వింటుంటాడు కదా. ఇప్పుడు చెప్పుకోబోయే టెక్నిక్‌ని ఫాలో అయి దాదాపు అదే మాదిరి ఫలితాన్ని మీరూ పొందవచ్చు.ముందు మీ ఫోన్లో కాల్ వచ్చిన కొన్ని సెకండ్లకు ఫోన్ ఆటోమేటిక్‌గా ఆన్సర్ చేయబడేలా Auto Answer సదుపాయాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే రింగ్ వాల్యూమ్‌ని mute చేయండి. మీ ఇయర్ ఫోన్‌ని మీ ఫోన్‌కి గుచ్చితే దానంతట అదే headset ప్రొఫైల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ ఫోన్‌ని ఏ టేబుల్ వద్ద మాటలు వినాలనుకున్నారో ఆ టేబుల్ క్రింద కనిపించకుండా అమర్చండి. ఇప్పుడు బయటకు వచ్చి వేరే ఫోన్ నుండి మీ ఫోన్‌కి కాల్ చేయండి. కొద్ది క్షణాలు రింగ్ అయిన తర్వాత (రింగ్ సౌండ్ బయటకు రాదు) టేబుల్ క్రింద ఫోన్ ఆన్ అయి.. అక్కడ మాట్లాడుకునే మాటలు మీకు వినిపిస్తుంటాయి. సరదాగా ప్రయత్నించి చూడండి.
శుక్రవారం 26 అక్టోబర్ 2007
మీ పేరు టాటూగా మార్చుకోవచ్చు…

ప్రేయసీప్రియులు శరీరంపై పచ్చబొట్లు పొడిపించుకోవడం.. ఆకర్షణీయమైన టాటూలను అంటించుకోవడం చాలాచోట్ల చూస్తూనే ఉన్నాం. ఇదే మాదిరిగా ఏ అందమైన అమ్మాయి తన వంటిపై మీ పేరు టాటూగా ధరిస్తే చూడాలని ఉందా.. సహజంగా తీరే అవకాశం లేని మీ కోరిక www.crustydemons.co.uk/UK/tattoo_parlour/ అనే వెబ్సైట్ ద్వారా తీరడం ఖాయం. ఈ సైట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఓ అందమైన మోడల్ దేహంలోని నాలుగు భాగాలు ఓ వైపు, ఓ ఖాళీ బాక్స్ మరోవైపు కన్పిస్తాయి. ఏదో ఒక భాగాన్ని ఎంచుకుని ఖాళీబాక్స్ లో మీ పేరు టైప్ చేసి Apply బటన్ క్లిక్ చేస్తే కొద్ది క్షణాల్లో ఆ పిల్లదేహంపై మీ పేరుతో కూడిన టాటూ ప్రత్యక్షమవుతుంది. ఆ వీడియో క్లిప్‌ని మీ స్నేహితులకు పంపించుకోవచ్చు కూడా. అది చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఈర్ష్యపడతారు.
శుక్రవారం 21 సెప్టెంబర్ 2007
MP3 ఫైల్ని GIF పిక్చర్లో దాచిపెట్టడం

మైక్రోఫోన్ ద్వారా మీ మాటలని MP3 ఫార్మేట్లో రికార్డ్ చేసి ఆ MP3 ఫైల్ని ఏదైనా GIF ఇమేజ్‌లో గోప్యంగా దాచిపెట్టి మీ స్నేహితులకు పంపించుకోవచ్చు. వారు ఆ ఫైల్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చెస్తే కేవలం ఫోటో కన్పిస్తుంది తప్ప ఆడియో వినిపించబడదు. అదెలాగో చూద్దాం. మన వద్ద picture.gif మరియు audio.mp3 అని రెండు ఫైళ్ళు ఉన్నాయనుకుందాం. Start>Run బాక్స్ లో CMD అని టైప్ చేసి కమాండ్ ప్రామ్ట్ లోకి వెళ్ళి…copy picture.gif /b + audio.mp3 /b combined.gif అనే కమాండ్ని టైప్ చేయండి ఆ రెండు ఫైళ్ళ పాత్లని సరిగ్గా స్పెసిఫై చేయాలి సుమా! దీనితో audio.mp3 అనే ఫైల్ picture.gif అనే ఫైల్లో దాచివేయబడి కొత్తగా combined.gif అనే ఫైల్ రూపొందించబడుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని ఎవరికైనా పంపిస్తే కేవలం picture.gif ఫైల్లో ఉండే ఫోటోని చూడగలుగుతారు తప్ప audio.mp3 అనే ఫైల్లోని ఆడియో మాత్రం వారికి విన్పించబడదు. ఆడియో వినిపించాలంటే ఓ చిట్కా ఉంది. WinAmp ప్రోగ్రామ్‌లో ఆ combined.gif ఫైల్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది.
సోమవారం 3 సెప్టెంబర్ 2007
మీరూ క్షణాల్లో స్లిమ్‌గా అవ్వొచ్చు....??

"వారం రోజుల్లో 10 కేజీల బరువు తగ్గండి" అంటూ వివిధ వెయిట్ రిడక్షన్ , స్లిమ్మింగ్ సంస్థలు ఊరించే ప్రకటనల్లో ఎవరో ఒక వ్యక్తి ఫోటోలని "ట్రీట్మెంట్కి ముందు", "ట్రీట్మెంట్కి తర్వాత" అంటూ ప్రచురించడం.. వాటిని చూసి చాలామంది తామూ బరువు తగ్గాలని ఆశపడడం సహజమే. అయా వ్యక్తుల ఫోటోలని స్కాన్ చేసి Adobe Photoshop మృదులాంత్రములో (Software) Filter>Liquify అనే డైలాగ్ బాక్స్‌లోని Pucker Toolని ఉపయోగించి లావుగా ఉన్నవారి ఫోటోలని చాలా స్లిమ్‌గా అయినట్లు భ్రమ కలిగిస్తుంటారు. అయితే ఇలా ఫోటోషాప్ వంటి ఫోటో ఎడిటింగ్ టూల్స్‌ని ఉపయోగించవలసిన అవసరం లేకుండానే ప్రస్తుతం తాజాగా విడుదల అవుతున్న HP కంపెనీకి చెందిన డిజిటల్ కెమెరాల్లో Slimming Effect అనే సరిక్రొత్త ఫిల్టర్ పొందు పరచబడుతోంది. ఈ ఫిల్టర్‌ని ఎంచుకుని ఎవరినైనా ఫోటో తీస్తున్నప్పుడు ఒరిజినల్ ఫోటో ఒక ప్రక్కా, సన్నగా చేయబడిన ఫోటో మరో ప్రక్క LCD ప్రివ్యూ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. ఒకవేళ మరింత స్లిమ్‌గా ఫోటోని మార్చాలంటే స్లిమ్మింగ్ లెవల్ని పెంచుకోవచ్చు కూడా!
శనివారం 11 ఆగస్టు 2007
ఆటపట్టించే మెసేజ్‌లు ఇలా సృష్టించొచ్చు..

డెస్క్టాప్పై ఒక ఫైల్ని ఉంచి, ఎవరైనా దానిని క్లిక్ చేసిన వెంటనే పగలబడి నవ్వించే జోక్ కాని, హార్ట్‌బీట్ పెంచే వార్నింగ్ మెసేజ్ కాని చూపించబడేటట్లు ఏర్పాటు చేసుకోవచ్చని మీకు తెలుసా?? Notepad ద్వారా కావలసిన మెసేజ్‌ని టైప్ చేసి .vbs ఫైల్‌గా క్లిక్ చేసిన వెంటనే You have just deleted C:\Windows. Your disk will be formatted when you shutdown అనే వార్నింగ్‌తో హడలగొట్టాలంటే సింపుల్‌గా Notepad ఓపెన్ చేసి Response+MsgBox("you just deleted C:\Windows\"+vbcrlf+"your disk will be formatted when you shutdown",vbokonly,"Danger!") అనే వాక్యాన్ని టైప్ చేసి దాని ఎదో ఒక పేరుతో డెస్క్టాప్పై .vbs ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేయండి.ఇక్కడ రెండు లైన్లని +vbcrlf+ అనే పదం కలుపుతుంది.చివరగా vbokonly అనే పదం తర్వాత కోటేషన్ మార్కుల మధ్య వార్నింగ్ మెసేజ్ టైటిల్‌గా ఏం ఉండాలనుకుంటున్నామో దాన్ని టైప్ చేయవలసి ఉంటుంది. ప్రాక్టికల్‌గా చేసి చూడండి. ఈ టెక్నిక్ ఎంత సరదాగా ఉంటుందో! Windows Scripting Host ఇన్స్టాల్ చేయబడి ఉంటేనే ఇది సాధ్యం సుమా! ఇది సరదాకోసం రాసింది మాత్రమే.. అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ కోసం ఇలా కూడా ప్రయత్నించొచ్చు అని.
No comments:
Post a Comment