Friday, June 22, 2012

ఎన్నో విషయాలు

దొంగిలించిన ఫోన్‌ని లాక్ చేసే ప్రోగ్రామ్

phone-lock
Series 60 3వ తరం ఫోన్లు ఉపయోగించే ఫోన్ యూజర్లకు Secure Me అనే ప్రోగ్రామ్  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫోన్‌ని ఎవరైనా దొంగిలించినప్పుడు వారు ఫోన్‌ని  ఉపయోగించకుండానికి వీల్లేకుండా ఫోన్ స్క్రీన్‌ని, కీబోర్డ్ ని లాక్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్. అలాగే దురదృష్టవశాత్తు మీ ఫోన్ దొంగిలించబడినట్లయితే అప్పటికే ఈ ప్రోగ్రామ్ ఏక్టివేట్ చెయ్యబడి లేనట్లయితే మీ ఫోన్ నంబర్‌కి ఓ SMS మెసేజ్ వెంటనే వేరే ఫోన్ నుండి పంపించడం ద్వారా ఆ ఫోన్ ఆటోమేటిక్‌గా లాక్ చెయ్యబడేలా జాగ్రత్త తీసుకోవచ్చు. అదే విధంగా వేరే ఫోన్ నుండి దొంగిలించబడిన ఫోన్‌లోని కాంటాక్ట్ లను, మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలను hide చేయడానికి కానీ, డిలీట్ చేయ్యడానికి కానీ ఈ ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుంది. దొంగతనం చేసిన వారు కొత్తగా ఏ సిమ్ కార్డ్ ని మీ ఫోన్‌లో insert చేసినా  ఆ SIM నెంబర్, ఇతర వివరాలు మీరు SecureMe సాఫ్ట్ వేర్‌లో కాన్ఫిగర్ చేసిన ఫోన్‌కి పంపించబడతాయి.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

No comments:

Post a Comment