Tuesday, June 26, 2012

computer vinthalu - viseshaalu

USB ఫ్రిజ్ ఎంత ముచ్చటగా ఉందో కదా!

SNAG-0004SNAG-0005
మండువేసవి కాలం ముంగిట ఉంది.. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు వస్తుంటాయి. ఓ కోక్ బాటిల్ పిసికి అందుబాటులో chiilled గా ఉంటే ఎలా ఉంటుంది? USB ఫ్రిజ్ మీ కోరికని తీరుస్తుంది. ముచ్చటగా ఓ కోక్ టిన్ పట్టే సైజ్ లో ఉండే ఈ ఫ్రిజ్ ని మీ పిసి యొక్క USB పోర్ట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేకతలు:
                 
       కేవలం 5 నిముషాల్లో 8 డిగ్రీల సెంటిగ్రేడ్ కి ఉష్ణోగ్రత పడిపోతుంది.
       ఎలాంటి ప్రత్యేకమైన డివైజ్ డ్రైవర్లూ అవసరం లేదు.
        ఆపరేటింగ్ సిస్టమ్ తో సంబంధం లేకుండా అన్ని సిస్టమ్ లపై పనిచేస్తుంది. 
        365 గ్రాముల బరువు ఉంటుంది.
        ఇక ధర అంటారా.. కేవలం 1350 రూపాయలు సుమారుగా.

గదిలో పరిమళాలు వెదజల్లే USB పరికరం

sridhar
రూమ్ రిఫ్రెషనర్లకు బదులుగా నేరుగా కంప్యూటర్ నుండే పరిమళాలను వెదజల్లే AromaUSB అనే USB పరికరం ఒకటి ప్రస్తుతం మార్కెట్లో విడుదలైంది. ఇందులో పెర్ ఫ్యూమ్ నింపబడి ఉంటుంది. మనం ఈ పరికరాన్ని మన కంప్యూటర్ యొక్క USB పోర్టుకి కనెక్ట్ చేసిన తక్షణం అది ఉత్తేజభరితమైన పరిమళాన్ని వెదజల్లడం ప్రారంభిస్తుంది. వేర్వేరు ఫ్లేవర్లు, రంగుల్లో లభిస్తున్న ఈ పరికరం ధర రూ. 8,500 వరకూ ఉంది. లోపల పెర్ ఫ్యూమ్ ఖాళీ అయితే కొన్ని మోడళ్లలో మళ్లీ నింపుకోవచ్చు. http://www.aromausb.com/?action=product_productpage అనే పేజీలో ఆర్డర్ చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు జరిపి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

పాత కంప్యూటర్లు ఇలా ఉండేవి...

నాలుగు ప్రాసెసింగ్ కోర్ లతో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్లని ప్రస్తుతం మనం వినియోగించబోతున్న తరుణంలో అసలు 1970వ ప్రాంతం నుండి ఇప్పటివరకూ విడుదల చేయబడిన వివిధ కంప్యూటర్ల రూపాలను పరిశీలిస్తే కొన్ని కాలిక్యులేటర్లుగానూ, కొన్ని మైక్రోవేవ్ ఓవెన్లు గానూ వేర్వేరు రూపాల్లో నవ్వు తెప్పించడం ఖాయం. కేవలం 37 ఏళ్లలో మనిషి సాంకేతికంగా ఎంత ఎదిగాడో (సామాజికంగా దిగజారాడు అనుకోండి) అర్ధమవుతుంది.


గూగుల్ ఎర్త్….GOOGLE EARTH





’తాతా కంప్యూటర్లో మన ఇల్లు, పురులు, సూర్యలంకలు సముద్రపు ఒడ్డు కనిపిస్తున్నాయే’! అంటూ ఓ మనవడు చెబుతుంటే ఆ తాత మొహంలో సంభ్రమం కొట్టొచ్చినట్లు కనిపించింది. Google Earth, Wikipedia ల పుణ్యమా అని ప్రపంచంలోని ఏ మారుమూల ప్రదేశం గురించైనా క్షణాల్లో ఉపగ్రహ చిత్రాల ద్వాఅరా తెలుసుకోవడం సాధ్యపడుతోంది.

ఎక్కడ లభిస్తుంది, ఎంత సైజ్ ఉంటుంది?

Google Earth అనేది ఓ ఉచిత మృదులాంత్రము (Software). 11 MB సైజుగల ఈ ప్రోగ్రామ్‍ని http://earth.google.com అనే సైట్ నుండి పొందవచ్చు. ఫ్రీవర్షన్‍ని డౌన్‍లోడ్ చేసుకునేటప్పుడు ఓ రిజిస్ట్రేషన్ ఫారంని నింఫి యూజర్‍నేమ్, లైసెన్స్ కీలను పొందాలి. Google Earth ని నెట్‍కి కనెక్ట్ చేసే సమయంలో వీటిని తెలియజేస్తేనే లాగిన్ అవుతుంది.

ఎలా ఎక్స్ ప్లోర్ చేయాలి?

Google Earth ప్రోగ్రామ్‍ని రన్ చేసిన వెంటనే ఓ globe గుండ్రంగా తిరుగుతూ మన ముందుకు వస్తుంది. ఆ గ్లోబ్‍లో ఏ ప్రదేశం వద్ద అయినా మౌస్‍ని ప్రెస్ చేసి పట్టుకుని మీకు కావల్సిన దేశం వచ్చేటంతవరకూ కుడి, ఎడమ వైపులకు మౌస్‍ని డ్రాగ్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు మీకు కావలసిన దేశం వచ్చిన తర్వాత Mapsకి క్రింది భాగంలో కన్పించే కంట్రోళ్ళని ఉపయోగించి ఆ దేశంలోని ఇతర నగరాలు, పట్టణాలని వెతుకుతూ వెళ్ళాలి. ఉదా.కు New Delhi, Mumbai, Hyderabad వంటి నగరాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా నగరాన్ని సెంటర్ పొజిషన్‍లోకి తెచ్చుకుని.. ఆ నగరాన్ని జూమ్ చేసుకుంటూ వెళితే ఆ నగరంలోని వివిధ ప్రాంతాల పేర్లు కన్పిస్తుంటాయి. హైదరాబాదుని జూమ్ చేసుకుంటూ వెళితే హుస్సేన్‍సాగర్, అమీర్‍పేట్, ఎల్.బి. స్టేడియం, వంటి వివిధ ప్రదేశాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా ప్రదేశాన్ని ఎంచుకుని జూమ్ చేసుకుంటూ వెళితే ఆ ప్రదేశం పరిసర ప్రాంతాలు, భవనాలు, రోడ్లు ఉపగ్రహచిత్రం రూపంలో చూపించబడతాయి. మన రాష్ట్రంలోని చిన్న చిన్న పట్టణాల రూపురేఖలని సైతం Google Earth ప్రోగ్రామ్ ద్వారాఎక్స్ ప్లోర్ చేసుకోవచ్చు.




చిటికెలో కావలసిన ప్రదేశాన్ని చూడాలా?

Globe బొమ్మని జూమ్ చేస్తూ కావలసిన ప్రదేశానికి చేరుకోవడం కష్టంగా ఉందా … అయితే Google Earth ప్రోగ్రామ్‍లోని Fly to అనే బాక్సులో మీరు ఏ నగరాన్ని చూడాలనుకుంటున్నారో దాని పేరుని టైప్ చేయండి. ప్రముఖ ప్రాంతాలని సందర్శించడానికి ఇది సులభంగా ఉంటుంది. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని సైతం Google Earth ద్వారా పొందవచ్చు. ఏదైనా ప్రముఖ ప్రదేశానికి బ్రౌజ్ చేసేటప్పుడు అక్కడికి దగ్గరలో హైవేలు, రెస్టారెంట్లు, లాడ్జిలు, బ్యాంకులు, రిటైల్‍షాపులు, ఫార్మసీలు, వంటి ఎలాంటీ వనరులైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అవకాశముంది. దీనికి గాను Google Earth ప్రోగ్రాములో Layers అనే ప్రదేశం వద్ద కావలసిన అంశాలని ఎంచుకుంటే సరిపోతుంది. వివిధ ప్రదేశాలని బ్రౌజ్ చేసేటప్పుడు పలురకాల సింబల్స్ రూపంలో ఇవి చూపించబడతాయి.


ధర్డ్ పార్టీ ప్లగ్‍ఇన్‍లు సైతం లభిస్తున్నాయి…


Google Earth ప్రోగ్రాములో ఉన్న సదుపాయాలు సరిపోవడం లేదా… అయితే www.googleearthhacks.com అనే వెబ్‍సైట్‍లో అదనపు మ్యాపులు, ఫోటోలు లభించడంతో పాటు ఈ ప్రోగ్రామ్‍ని ఉపయోగిస్తున్న ఇతర యూజర్ల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలుసుకోవడానికి Google News స్టోరీలు, Earth చిత్రాలు చూసి చూసి విసిగిపోయి కొద్ది భిన్నంగా వేరే గ్రహం చిత్రాలు చూడాలనుకుంటే Jupiter గ్రహం యొక్క చిత్రాలు చూపించే ప్లగ్‍ఇన్‍లు వంటివి ఎన్నో ఈ సైట్‍లో డౌన్‍లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా లభిస్తున్నాయి.ది

Ctrl+Alt+Del ఎవరు కనుగొన్నారో తెలుసా?


కంప్యూటర్ హ్యాంగ్ అయినప్పుడు అందరూ సహజంగా ఉపయోగించే చిట్టచివరి ప్రయత్నం కీబోర్డ్ నుండి Ctrl+Alt+Del కీలను ప్రెస్ చేసి కంప్యూటర్ ని రీస్టార్ట్ చేయడం! ప్రతీ కంప్యూటర్ వినియోగదారుడికీ తెలిసిన ఈ సింపుల్ కీబోర్డ్ షార్ట్ కట్ ని ఎవరు కనుగొన్నారో తెలుసా? 1980వ సంవత్సరంలో "డేవిడ్ బ్రాడ్లే" అనే ఐబియం ఉద్యోగి కంప్యూటర్ ప్రతిస్పందించడం మానేసినప్పుడూ, ఇక ఎలాంటి కమాండ్లను స్వీకరించకుండా నిలిచిపోయినప్పుడు సులువుగా సిస్టం ని రీస్టార్ట్ చేయడానికి మార్గం ఒకటి కనుగొనాలన్న ఉద్దేశంతో ఒక చిన్న సోర్స్ కోడ్ ని రాశాడు. ఈ కోడ్ రాయడానికి అతనికి పట్టిన సమయం కేవలం ఒక నిముషం 23 సెకండ్లు మాత్రమే! అంత తక్కువ టైము పడితేనేం.. ఇన్నేళ్లు గడిచినా ఆ మూడు అక్షరాల తారక మంత్రానికి తిరుగే లేకుండా పోయింది. బ్రాడ్లే ఇంకా అనేక అంశాలను కనుగొన్నప్పటికీ Ctrl+Alt+Del మాత్రం అతనికి బాగా పేరు తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ ఆ షార్ట్ కట్ ని తన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉపయోగించడం మొదలుపెట్టాడో అప్పటి నుండీ అది ఎంతో ప్రాచుర్యం చెందింది.

No comments:

Post a Comment