Monday, June 25, 2012

పేజింగ్ ఫైల్‍ని కూడా డీఫ్రాగ్ చేసుకోవచ్చు…


మనం భారీ మొత్తంలో అప్లికేషన్ ప్రోగ్రాములను ఉపయోగిస్తున్నప్పుడు అవన్నీ ఫిజికల్ మెమరీ (RAM) లో పట్టకపోయినట్లయితే విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్ డిస్క్ మీద కొంత ఖాళీ ప్రదేశాన్ని తాత్కాలికంగా RAM మాదిరిగా ఉపయోగించుకుంటుంది. అలా మెమరీ మాదిరిగా ఉపయోగించబడే హార్డ్ డిస్క్ ప్రదేశాన్ని Page File అంటారని మీకు తెలిసే ఉంటుంది.కంప్యూటర్ యొక్క పనితీరు మెరుగుపరుచుకోవాలంటే ఎప్పటికప్పుడు హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేయడం ఉత్తమమని తెలిసిందే కదా! అయితే సాధారణ పద్ధతుల ద్వారా హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేసేటప్పుడు కేవలం హార్డ్ డిస్క్‌లోని ఫైళ్ళు, ఫోల్డర్లు, బూట్ సెక్టార్ వంటివి మాత్రమే ప్రభావితం చేయబడతాయి. అసలు డీఫ్రాగ్ చేయకపోవడం కన్నా ఇలా విండోస్ లోని సాధారణ Defrag ప్రోగ్రామ్ ద్వారా హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేయడం ఉత్తమమే అనుకోండి. కానీ NortonUtilities, O&O Defragmenter వంటి కొన్ని శక్తివంతమైన థర్డ్ పార్టీ డీఫ్రాగ్మెంటేషన్ ప్రోగ్రాములను ఉపయోగించి సిస్టమ్‌ని డీఫ్రాగ్ చేసుకోవడం అన్నింటి కన్నా ఉత్తమం.దీని వల్ల కేవలం హార్డ్ డిస్క్‌లోని సాధారణ భాగాలేకాకుండా ఆపరేటింగ్ సిస్టమ్‌చే page file గా ఉపయోగించబడుతున్న భాగం కూడా డీఫ్రాగ్ చేయబడుతుంది.

DivX ఫార్మేట్ అత్యుత్తమైనది


భారీ పరిమాణం గల వీడియో ఫైళ్ళని సైతం సాధ్యమైనంత వరకూ నాణ్యత లోపించకుండా తక్కువ పరిమాణంలోకి కంప్రెస్ చెయ్యడానికి DivX అనే వీడియో కోడెక్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. AVI, MPEG, WMV వంటి అన్ని రకాల ఫైల్ ఫార్మేట్లకు చెందిన ఫైళ్ళని ఈ DivX ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో ఫైళ్ళని DivX ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేయ్యడానికి అనేక సాఫ్ట్‌వేర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నా DivX Converter 6.5 వెర్షన్ అన్నింటికన్నా మెరుగైన ఫలితాలను అందిస్తోంది. MPG, VOB, TS, SVCD ఫైళ్ళని DivX ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ కన్వర్టర్ సాఫ్ట్‌వేర్‌కి అదనంగా MPEG-2/DVD ప్లగ్ ఇన్ కూడా అవసరం అవుతుంది. వేర్వేరు వీడియో ఫైళ్ళని ఒకే DivX ఫైల్‌గా మెర్జ్ చేయడానికి కూడా ఇది పనికొస్తుంది.

పిసి నుండే ఫోన్‍ని నియంత్రించడానికి..


Nokia సంస్థ ఇటీవల Nokia PC Phone అనే ఓ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది.Symbian S60 శ్రేణికి చెందిన Nokia ఫోన్ మీవద్ద ఉన్నట్లయితే దాన్ని USB డేటా కేబుల్ ద్వారా గానీ, బ్లూటూత్ ద్వారా గానీ పిసికి కనెక్ట్ చేసి ఉన్నప్పుడు.. Internet Explorer, FireFox వంటి బ్రౌజర్ ద్వారా ఆ ఫోన్‌ని నియంత్రించుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ ప్రోగ్రామ్‌ని FireFox 2.x లేదా IE 7.x బ్రౌజర్ల యొక్క బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌గా పరిగణించవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫోన్‌ని మీ పిసికి కనెక్ట్ చేసిన వెంటనే మీ ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఈ సాఫ్ట్‌వేర్ పిసిలోకి స్వీకరించడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే మీ ఫోన్‌లో ఇప్పటివరకు స్టోర్ చెయ్యబడి ఉన్న SMSలు, Call list లో వచ్చిన ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ వివరాలు సైతం పిసిలోకి స్వీకరించబడతాయి. అలాగే SMS మేసేజ్‌లను పంపించదలుచుకున్నప్పుడు ఫోన్ యొక్క చిన్న కీ ప్యాడ్ ద్వారా ఇబ్బందులు పడే బదులు, నేరుగా పిసి యొక్క కీబోర్డ్ నుండే టైప్ చేసి మెసేజ్‌లు పంపించుకోవచ్చు. అలాగే నేరుగా మీ పిసినుండే ఫోన్ కాల్స్‌ని చేసుకోవచ్చు. ఫోన్ కాంటాక్ట్ లిస్టులొ కొత్త మెంబర్లని జతచేయాలంటే నేరుగా పిసి నుండే సులభంగా జత చేయవచ్చు. మీ ఫోన్‌కి వచ్చిన కాల్స్‌ని, పిసి నుండే లిఫ్ట్ చేయవచ్చు. కట్ చేయనూవచ్చు.

No comments:

Post a Comment