RAM కొనబోతున్నట్లయితే...

* కొత్త సిస్టమ్‌కి మెమరీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంత మొత్తంలో అయితే RAM అమర్చుకోదలుచుకున్నారో అంత మొత్తానికి ఒకే RAM మాడ్యూల్‌ని మాత్రమే తీసుకోండి. రెండు మాడ్యుళ్ళు ఉన్నప్పుడు అనేక కారణాల వల్ల ఒక మాడ్యూల్ ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటే వాడండి.
* మాడ్యూళ్ళకి రెండు వైపులా ప్లాస్టిక్ కేసింగ్ ఉన్న RAMని ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోకండి. ఈ తరహా మాడ్యుళ్ళు ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి.ఓపెన్‌గా ఉన్న మాడ్యుళ్ళనే కొనుగోలు చేయండి.
* SDRM అయితే 133MHz బస్‌స్పీడ్ ఉన్న మాడ్యుళ్ళని, DDR అయితే 400 MHz బస్‌స్పీడ్ ఉన్న మాడ్యూళ్ళనే ఎంచుకోవడం వల్ల సిస్టమ్ పెర్‌ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. ఒక వేళ మీ మదర్ బోర్డ్ సపోర్ట్ చెయ్యకపోతేనే తక్కువ బస్‌స్పీడ్‌ని ఎంచుకోండి.
* ఆల్రెడీ మీ సిస్టమ్‌లో పాత RAM మాడ్యూల్ ఉన్నట్లైతే దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కొత్త రామ్ కొంటున్నట్లయితే పాత దానితో కొత్త మాడ్యూల్‌ని జత చేయకండి.పాత రామ్‌ని స్టాండ్‌బైగా ప్రక్కన పెట్తుకుని కేవలం కొత్తదాన్ని మాత్రమే వాడండి.
స్పీకర్లని కొనుగోలు చేయబోతున్నట్లయితే..

పవర్ రేటింగ్ : మార్కెట్లో లభిస్తున్న అన్ని స్పీకర్లూ పవర్ రేటింగ్‌ని PMPO ప్రమాణంలో పేర్కొంటున్నారు. అయితే PMPO అర్ధం లేని స్పెసిఫికేషన్! దీనికి బదులు స్పీకర్ సిస్టమ్ యొక్క RMS పవర్‌ని పరిగణనలోకి తీసుకోండి. సరౌండ్ సౌండ్ స్పీకర్ల విషయంలో కనీసం 40 Watts RMS పవర్ ఉన్న స్పీకర్లని ఎంచుకోవడం మంచిది. నిరంతరాయంగా పవర్‌ని హ్యాండిల్ చెయ్యగల సమర్ధత స్పీకర్‌లో ఎంత ఉందో తెలుసుకోవడానికి RMS మాత్రమే సరైన ప్రమాణం.
ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్: మీరు కొనే స్పీకర్ యొక్క ఫ్రీక్వెన్సీ 16 KHz కంటే ఎక్కువ లభించనపుడు క్లాసిక్ మ్యూజిక్ వినేటప్పుడు high treble లభించదు. అలాగే 50 KHZ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీని మీ స్పీకర్ సపోర్ట్ చెయ్యకపోతే డ్రమ్ సౌండ్లు, సినిమాల్లో భారీ పేలుళ్ళ శబ్దాలను ఎఫెక్టివ్‌గా వినడానికి వీలుపడదు. ఈ నేపధ్యంలో మీ స్పీకర్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్‌ని సపోర్ట్ చేసేదై ఉండాలి.
ఆడియో ఇన్‌పుట్: 2.1 స్టీరియో స్పీకర్ సిస్టమ్‌ని ఎంచుకుంటే కేవలం అనలాగ్ లెఫ్ట్, రైట్ చానెళ్ళు మాత్రమే లభిస్తాయి. అదే 4 చానెల్ సరౌండ్‌సౌండ్ సిస్టమ్ విషయంలో స్పీకర్ సిస్టమ్‌కి మొత్తం నాలుగు అనలాగ్ ఆడియో ఇన్‌పుట్‌లు ఉండేలా చూసుకోవాలి.అదే 5.1 స్పీకర్స్ విషయంలో మొత్తం ఆరు సపరేట్ RCA ఇన్‌పుట్‌లు స్పీకర్‌కి లభించేలా జాగ్రత్త వహించాలి.
No comments:
Post a Comment