వ్యక్తుల కదలికలను రికార్డ్ చేసే ప్రోగ్రామ్

పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనూ, ఆఫీసుల్లోనూ వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టవలసి వచ్చినప్పుడు కెమెరాలను అమర్చుతుంటారు. ఇలాంటి కెమెరాల నుండి లభించిన వీడియోని 24 గంటలూ రికార్డ్ చేసే ప్రోగ్రామ్ Xtra Surveillance. ఇది మొత్తం 16 కెమెరాలను, 8 సెన్సార్లను సపోర్ట్ చేస్తుంది. రిమోట్ సర్వర్‌కి FTP ద్వారా ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయడం, ఆటోమేటిక్‌గా మెయిల్, SMSల ద్వరా అలారమ్ నోటీఫికేషన్లకి చేరవేయడం.. వంటి పవర్‌ఫుల్ సదుపాయాలెన్నో ఈ ప్రోగ్రామ్‌లో లభిస్తున్నాయి. వీడియో స్టోరేజ్‌కి ఎంత డిస్క్ స్పేస్ కేటాయించాలన్నది కూడా డిఫైన్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం గుర్తుంచుకోవడానికి

ఫోన్ నెంబర్లు, అడ్రస్, అపాయింట్‌మెంట్లు, బిల్లుల గడువుతేదీలు ఇలా వివిధ సందర్భాల్లో పలు అంశాలను గుర్తుంచుకోవడానికి పేపర్‌పై నోట్ చేసుకుంటుంటారు. Automatic Robot అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సింపుల్‌గా ముఖ్యమైన సమాచారాన్ని ఆ ప్రోగ్రాంలో టైప్ చేసి save అనే బటన్ క్లిక్ చేస్తే అది మొత్తం డేటా బేస్‌లో స్టోర్ అవుతుంది. తర్వతా ఎప్పుడైనా ఆ సమాచారం అవసరమైతే సింపుల్‌గా ఆ డేటాలోని ఏదో ఒక పదాన్ని కీవర్డ్‌గా టైప్ చేసి, search బటన్ క్లిక్ చేస్తే ఆ సమాచారం తిరిగి స్క్రీన్‌పై చూపించబడుతుంది. ఇది చాల ఉపయోగకరమైన ప్రోగ్రామ్.
ఉచితంగా పోడ్‍కేస్ట్ అందిస్తున్న సర్వీసులు

ఫ్రీ ఫైల్ హోస్టింగ్, ఇమేజ్ హోస్టింగ్, వెబ్ హోస్టింగ్, వీడియో సర్వీసులు ఎలాగైతే ఇంటర్నెట్‍ని ముంచెత్తుతున్నాయో ఈ మధ్య మీ స్వంత Podcastలను ఏ మాత్రం ఖర్చు లేకుండా ఉచితంగా హోస్ట్ చెయ్యడానికి కూడా కొన్ని వెబ్‍సైట్లు ముందుకు వస్తున్నాయి. వాటిలో www.blip.TV అనే వెబ్‍సైట్ ఒకటి. దీనికి MP3 ఫైళ్లని అప్‍లోడ్ చేసుకోవచ్చు. చక్కని ఇంటర్‍ఫేస్ కలిగిన ఈ వెబ్‍సైట్ RSS feeds ని కూడా అందిస్తుంది. ఈ సైట్‍ని విజిట్ చేసిన వారు ఉచితంగా మీరు అప్‍లోడ్ చేసిన MP3 ఫైళ్ళని డౌన్‍లోడ్ చేసుకోగలుగుతారు. అలాగే www.divshare.com అనే వెబ్‍సైట్‍ని ఎంచుకోవచ్చు. ఈ వెబ్‍సైట్‍లోకి మీరు అప్‍లోడ్ చేసుకున్న MP3 ఫైళ్ళని వెబ్‍పేజిల్లోకి ఎంబెడ్ చేసుకుని మీ RSS ఫీల్‍లను విజిట్ చేసే యూజర్లు నేరుగా ఆ వెబ్‍పేజీలోనే ప్లే అవగలిగే Flash MP3 Player ద్వారా, మీరు అప్‍లోడ్ చేసిన పాటలను వినగలిగే సదుపాయాన్ని ఈ వెబ్‍సైట్ కల్పిస్తోంది అన్నమాట. అంటే ఈ సైట్‍కి అప్‍లోడ్ చేసిన పాటలు అక్కడే వినవచ్చు తప్ప డౌన్‍లోడ్ చేసుకోవడానికి వీలుపడదు. ఇకపోతే www.ourmedia.org అనే వెబ్‍సైట్ అపరిమితమైన స్టోరేజ్ స్పేస్‍ని, బ్యాండ్‍విడ్త్ ని అందిస్తోంది. మీ స్వంత పోడ్‍కాస్ట్ సృష్టించుకోవడానికి ఈ వెబ్‍సైట్‍ని ఎంచుకోవచ్చు.
సోమవారం 4 ఫిబ్రవరి 2008
నిర్దిష్ట సమయానికి క్లీన్ చేసే సాఫ్ట్ వేర్లు.

సాధారణంగా అనునిత్యం Windows>Temp ఫోల్డర్‍లోనూ, టెంపరరీ ఇంటర్నెట్
ఫైల్స్ ఫోల్డర్‍లోనూ, ఇతర ఫోల్డర్లలోనూ tmp,gid,bak వంటి ఎక్స్ టెన్షన్ నేమ్‍లతో
వృధా ఫైళ్లు క్రియేట్ అవుతుంటాయి. వాటిని ఆటోమేటిక్‍గా క్లీన్ చేయ్యడానికి ఆల్రేడీ
పలు రకాల సాఫ్ట్ వేర్లు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్లని రన్ చెయ్యవలసిన పని
లేకుండా మనం నిర్దేశించిన సమయానికి లేదా విండోస్ బూట్ అయిన ప్రతీసారీ వేస్ట్
ఫైళ్ళని గుర్తించి తొలగించే విధంగా "షెడ్యూలర్"ని కలిగిన ప్రోగ్రాములు చాలా అరుదుగా
ఉన్నాయి. అలాంటి వాటిలొ "Trash it" ఒకటి.
3D ఎఫెక్టులతో సెర్చింగ్ చేసుకోండి.

Google, Yahoo వంటి సెర్చ్ ఇంజిన్లలో ఏదైనా కీవర్డ్‌ని టైప్ చేసి వెదికినప్పుడు పేజీల కొద్ది లింకులు ప్రత్యక్షమవుతాయి కదా! వాటిలొ దేనిని ఓపెన్ చేయాలని మనం తలగోక్కోవలసి వస్తుంది. ఇక ఆ బాధ లేదు. 3D Web Search టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ టూల్ ద్వారా Google, Yahoo, Ebay, Flickr వంటి సెర్చ్ ఇంజిన్లలో మీరు ఏ కీవర్డ్ కోసం సెర్చ్ చేసినా అన్ని సెర్చ్ రిజల్ట్స్ యొక్క టెక్స్ట్ లింకులు కాకుండా వాటి పేజీల ప్రివ్యూలు ఆకర్షణీయంగా కనిపించే పద్ధతిలో అమర్చబడి స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
మీ వెబ్‍సైట్ నెమ్మదిగా లోడ్ అవుతుందా?

మీ వెబ్‍సైట్ ఎంత వేగంగా లోడ్ అయితే సందర్శకులు అంత సంతోషిస్తారు. ఈవాళ్టి రోజుల్లో ఎంత గొప్ప వెబ్‌సైట్ కోసమైనా ఐదు, పది సెకండ్లకు మించి వేచి చూసే ఓపిక ఎవరికీ ఉండడం లేదు.ఈ నేపధ్యంలో మీ వెబ్‌సైట్ బాగా నెమ్మదిగా ఓపెనవుతోందంటే దానికి గల కారణాలను అన్వేషించి సరిచేసుకోవడం ఒక్కటే పరిష్కారం. ఆకర్షణ కోసం మనం వెబ్‌పేజీల్లో పొందుపరిచే CSS, Iframes, Flash, JavaScript, ఫోటోలు వంటివి లోడ్ అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.వాటికితోడు మనం Google Adsense ప్రకటనల్ని మన సైట్‌లో పొందుపరుచుకున్నట్లయితే ఆ ప్రకటనలు మన సైట్‌కి వచ్చి చేరడానికి కూడా కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. అలాగే Youtube,Flash వంటి వీడియో లింకులు వంటివి సైట్ నెమ్మదిగా లోడ్ అవడానికి దారితీసే అంశాలే. అలాగే Imageshack, Flickr వంటి వెబ్‌సైట్లలొ హోస్ట్ చేయబడి మన వెబ్‌సైట్‌లో అక్కడి నుండి డిస్‌ప్లే చేయబడవలసిన ఫోటోలూ సైట్ ఓపెనింగ్ నెమ్మదించడానికి కారణమవుతాయి. ఈ నేపథ్యంలో Pingdom అనే టూల్‍ని ఉపయోగించడం ద్వారా మీ సైట్ నెమ్మదించడానికి ఏయే అంశాలు కారణం అవుతున్నాయన్నది వివరంగా ఒక గ్రాఫ్ రూపంలో తెలుసుకుని వాటిని సరిచేసుకోవచ్చు.
శనివారం 12 జనవరి 2008
రోజువారీ కార్యకలాపాలు రికార్డ్ చేసేలా

కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత మనం రకరకాల ప్రోగ్రాములను రన్ చేస్తుంటాం, పలు వెబ్ సైట్లని వి జిట్ చేస్తుంటాం, డాక్యుమెంట్లని టైప్ చేస్తుంటాం, ఇలా మనం సిస్టమ్ ఆన్ చేసినప్పటి నుండి తిరిగి కట్టేసేటంతవరకు మనము చేసే పనులన్నీ రికార్డ్ చేయబడి ఒక వీడియో రూపంలో మార్చబడితే ఎలా ఉంటుంది? snaplogger అనే ప్రోగ్రాం ఈ పనిని నిజం చేసి పెడుతుంది. ఇది మనం పిసిని ఆన్ చేసిన క్షణం నుండి నిరంతరాయంగా మొత్తం కంప్యూటర్ స్క్రీన్ లేదా మనం ఎంచుకున్న విండోని పలు ఫోటోలుగా కేప్చర్ చెస్తుంటుంది. కొన్ని సెకండ్లకు ఓ ఫోటో చొప్పున మీకు తెలియకుండానే రికార్డ్ చేయబడుతుంది. ఈ ఫోటోలన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయ్యే వీడియో మాదిరిగా కన్వర్ట్ చేస్తుంది.
No comments:
Post a Comment