Monday, June 25, 2012

about pc

పాత వెర్షన్ సాఫ్ట్ వేర్లు దొరికే ప్రదేశం ఇదిగోండి



2000వ సంవత్సరంలో టివి ట్యూనర్ కార్డ్ కొన్నప్పుడు అందరూ పిసిలో టివి వస్తుందంటే చాలా ఆశ్చర్యంగా చూసేవారు. అప్పట్లో టివిలో ప్రసారం అయ్యే ప్రోగ్రాములను ఎలాగైనా రికార్డ్ చేసుకోవాలని మహా కోరికగా ఉండేది. కార్డ్ తోపాటు ఇచ్చిన సాఫ్ట్ వేర్ లో ఆ వెసులుబాటు ఉన్నా భారీ సైజ్ గల AVI ఫైళ్లుగా సేవ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉండడంతో ఎలాగైనా తక్కువ సైజ్ తీసుకునే MPEG ఫార్మేట్ లోకి రికార్డ్ చేసుకునే మార్గం దొరకకపోతుందా అని అన్వేషించడం ప్రారంభించాను. ఆ అన్వేషణలో WinVCR అనే సాఫ్ట్ వేర్ నన్నెంతో ఆకర్షించింది. ఇప్పుడు ఆ సాఫ్ట్ వేర్ తయారీ కంపెనీ దుకాణం మూసేసుకున్నా ఇప్పటికీ ఆ సాఫ్ట్ వేర్ పేరు తలుచుకుంటే ఎంతో హాపీ అనిపిస్తుంది. ఇదంతా ఎందకు చెప్పుకుంటూ వస్తున్నానంటే... సంవత్సరాల తరబడి పిసిలను వాడిన అనుభవం ఉన్నవారు ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సాఫ్ట్ వేర్, ఏదో ఒక వెర్షన్ పై మోజు పెంచుకుంటారు. అలా మీరూ ఏదైనా పాత సాఫ్ట్ వేర్ ని లైక్ చేసినట్లయితే http://www.old-versions.net/ అనే వెబ్ సైట్లోకి వెళ్లి మీరు అప్పట్లో మెచ్చిన సాఫ్ట్ వేర్ ని వెదికి పట్టుకుని తిరిగి తనివితీరా మీ సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. కేవలం పాత వెర్షన్ సాఫ్ట్ వేర్ల కోసం ఉద్దేశించబడిన చక్కని సైట్ ఇది.

ఆదివారం 16 డిసెంబర్ 2007

లాండ్ లైన్ నెంబర్లని తెలుసుకోవాలంటే


మీకు సుబ్బారావు అని ఓ మిత్రుడు ఉన్నాడనుకోండి.. అతడు ఏ జమ్ములపాలెం వంటి గ్రామంలోనో నివశిస్తున్నాడనుకుందాం. అతని ఫోన్ నెంబర్ మాత్రం మీవద్ద లేదు. అలాంటప్పుడు ఓసారి BSNL ఆన్ లైన్ టెలిఫోన్ డైరెక్టరీ ద్వారా వెదికితే అతనికి లాండ్ లైన్ కనెక్షన్ ఉంటే చాలా సులభంగా ఫోన్ నెంబర్ వెదికి పట్టుకోవచ్చు. ఒక వ్యక్తికి సంబంధించి మన వద్ద పేర్లు/అడ్రస్ లేదా టెలిఫోన్ నెంబర్ లలో ఏ సమాచారం ఉన్నా అవతలి వారి ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలుకల్పించే విధంగా BSNL ఆన్ లైన్ టెలిఫోన్ డైరెక్టరీ ని నిర్వహిస్తోంది. టెలిఫోన్ నెంబర్ తెలిస్తే పేరు, అడ్రస్ లను తెలుసుకోవచ్చు, అదే పేరు తెలిస్తే కొద్దిపాటి ప్రయత్నంతో మీకు కావలసిన వ్యక్తి యొక్క టెలిఫోన్ నెంబర్ తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయబడుతున్న ఈ డైరెక్టరీలో అన్ని జిల్లాలకు సంబంధించిన ఆప్షన్లు లభిస్తున్నాయి. http://www.ap.bsnl.co.in/enquiry/enquiryhome.asp అనే లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరూ BSNL ఆన్ లైన్ టెలిఫోన్ డైరెక్టరీని సందర్శించండి.

మంగళవారం 20 నవంబర్ 2007

ఏ సైజ్ ఫైళ్లు అయినా నేరుగా మీ స్నేహితులకు పంపుకోవడం


ఇంటర్నెట్లో ఫైళ్లని మీ స్నేహితులతో షేర్ చేసుకోవడానికి రేపిడ్ షేర్, మెగా అప్ లోడ్, సెండ్ఇట్ వంటి అనేక సర్వీసులు ఉన్నాయి. అయితే ఫైల్ ని పూర్తిగా అప్ లోడ్ చేసిన తర్వాత మాత్రమే మన స్నేహితులు మనం పంపించే లింకు ఆధారంగా ఆ ఫైల్ని డౌన్ లోడ్ చేసుకోగలుగుతారు. అదీ కాక ప్రతీ ఫైల్ హోస్టింగ్ సర్వీస్ కి ఫైల్ సైజ్ విషయంలో గరిష్ట పరిమితి ఉంటోంది. చాలా తక్కువ సర్వీసులు మాత్రమే పరిమితి లేకుండా ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న ఫైళ్లని పంపుకోవడానికి కొంతమంది యాహూ మెసెంజర్లోని Send File వంటి ఆప్షన్లని వాడుతుంటారు. అయితే Gtalk వంటి ప్రోగ్రాముల్లో ఈ Send File సదుపాయం ద్వారా కొన్ని ఫైల్ టైప్ లకు చెందిన ఫైళ్లని మాత్రమే పంపుకోవచ్చు. ఇలా ప్రస్తుతం ఉన్న అన్ని మార్గాల కన్నా నన్ను ఈ మధ్య http://www.pipebytes.com/ అనే సర్వీస్ ఒకటి బాగా ఆకట్టుకుంది. ఇందులో ఉండే Send File అనే బటన్ ని క్లిక్ చేసి మన కంప్యూటర్లో ఉండే ఫైల్ ని ఎంచుకుంటే వెంటనే ఒక లింకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ ని ఆన్ లైన్ లో ఉన్న మన స్నేహితునికి ఇస్తే.. ఇక్కడ మన కంప్యూటర్ నుండి ఒక పక్క ఆ ఫైలు అప్ లోడ్ చేయబడుతూనే మరో పక్క అతని కంప్యూటర్ లో మన అప్ లోడ్ చేసే ఫైల్ వెంటనే డౌన్ లోడ్ చేయబడుతుంటుంది. ఇతర వెబ్ ఆధారిత ఫైల్ మార్పిడి సేవల కన్నా ఇది రెండు రెట్లు వేగంగా ఉంటోంది. ఒక పక్క ఫైల్ అప్ లోడ్ చేయబడుతుంటే మనకు టైమ్ పాస్ అవడానికి YouTube వీడియోలు మన బ్రౌజర్ లో ప్లే చేయబడుతుంటాయి.

శనివారం 27 అక్టోబర్ 2007

పురాతన వార్తాపత్రికల కథనాలు కావాలా?


హిందూ, వాషింగ్టన్ పోస్ట్ వంటి సుధీర్ఘ నేపధ్యం కలిగిన్ వార్తా పత్రికల్లో గతంలో ప్రచురించబడిన అంశాలను Google సంస్థ http://news.google.com/archivesearch అనే సైట్ ద్వారా అందిస్తోంది. ఈ వెబ్‍సైట్ ద్వారా వెదుక్కుంటూ పోతే చరిత్ర గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. ఉదా. కు.. పాకిస్తాన్ ఒక దేశంగా 1947 లో రూపు దాల్చినప్పటికీ "పాకిస్తాన్" అనే పదం 1900 వ సంవత్సరంలోని వార్తాపత్రికల్లోనే తారసపడింది. అలాగే మనం 2000వ సంవత్సరం తర్వాత మాత్రమే Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‍ని ఉపయోగిస్తున్నాము కదా… మరి ఈ Windows XP అనే పదం మొట్టమొదటిసారి ఎప్పుడు వార్తల్లోకి ఎక్కిందో తెలుసా.. 1985 లో…! ఇలా చెప్పుకుంటూ పోతే ఈ న్యూస్ ఆర్చివ్స్ లోని వివిధ పాత వార్తా పత్రికల కథనాలను అధ్యయనం చేసుకుంటూ పోతే మనకు తెలియని చరిత్రలో మరుగునపడిపోయిన ఎన్నో వాస్తవాలను తెలుసుకోవచ్చు. Google సెర్చ్ఇంజిన్ లో మాదిరిగానే ఏ కీవర్డ్ నైనా ఆర్కివ్స్ లో వెదికి చదువుకోవచ్చు.

బుధవారం 24 అక్టోబర్ 2007

వేర్వేరు బ్రౌజర్లలో మీ వెబ్ పేజీ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?




మీరు ఎంతో కష్టపడి రూపొందించుకునే వెబ్ పేజీలు విండోస్, Mac, Linux వంటి వేర్వేరు ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే Internet Explorer 5, 5.5, 6, 7, Firefox 1.5, 2.0, Opera, Safari వంటి పలు రకాల వెబ్ బ్రౌజర్లలో ఎలా కనిపిస్తాయో ప్రివ్యూ చూసుకోగలిగితే బాగుంటుంది కదా! ఒకవేళ ఏవైనా ముఖ్యమైన బ్రౌజర్లలో స్ర్కీన్ రిజల్యూషన్లు మార్చినప్పుడు, కలర్ డెప్త్ పెంచినప్పుడు నాణ్యతలో ఏదైనా తేడా వస్తే సరిచేసుకోవచ్చు. అయితే మీ వెబ్ సైట్ ని ఇలా వేర్వేరు బ్రౌజర్లతో తనిఖీ చేసుకోవాలంటే ప్రత్యేకంగా ఆయా బ్రౌజర్లు అన్నింటినీ మీ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవలసిన పనిలేదు. సింపుల్ గా http://browsershots.org/ అనే వెబ్ సైట్ కి వెళ్లి Enter your web address here అనే ప్రదేశం వద్ద మీ వెబ్ సైట్ అడ్రస్ ని టైప్ చేసి అది ఏయే బ్రౌజర్లలో తనిఖీ చేయబడాలో క్రింద ఎంచుకుని Submit బటన్ క్లిక్ చేయండి. వెంటనే వేరొక వెబ్ పేజీ వస్తుంది. అడ్రస్ బార్ నుండి ఆ అడ్రస్ ని కాపీ చేసుకుని కొద్దిసేపటి తర్వాత (30 నిముషాల లోపలే రావాలి సుమా) ఆ అడ్రస్ ని ఓపెన్ చేసి చూస్తే వేర్వేరు బ్రౌజర్ల లో మీ వెబ్ సైట్ ఎలా కనిపిస్తుందో స్ర్కీన్ షాట్లు చూపించబడతాయి.

సోమవారం 22 అక్టోబర్ 2007

పిల్లల కోసం ప్రత్యేకంగా సెర్చ్ ఇంజిన్

కావలసిన సమాచారం కోసం వెదకడానికి Google వంటి సెర్చ్ ఇంజిన్‌ని వాడుతుంటాము. అయితే కంటెంట్ ఫిల్టరింగ్ సదుపాయాలు ఉన్నప్పటికీ పిల్లలు అడల్ట్ సమాచారాన్ని వెదకకుండా నిరోధించడంలో ఈ సెర్చ్ ఇంజిన్‌లు విఫలం అవుతున్నాయి.ఈ నేపధ్యంలో ప్రత్యేకంగా పిల్లల కోసమే ఉద్ధేశించబడిన www.zoo.com అనే సెర్చ్ ఇంజిన్‌ని మీ హోమ్ పేజి్‌గా సెట్ చేసుకోండి. పిల్లలను ఆకట్టుకునే జంతువుల బొమ్మలతో కూడిన ఈ సెర్చ్ ఇంజిన్‌లో మీ పిల్లలు సెర్చ్ చేసే సమాచారం పూర్తిగా విజ్ఞానానికి , వినోదానికి సంబంధించినదై ఉంటుంది. ఉదా. కు ఎవరైన పిల్లలు breast cancer అని కీవర్డ్ టైప్ చేస్తే దాని గురించి సమస్త సమాచారం లింక్‌ల రూపంలో లభిస్తుంది. అదే breast అని టైప్ చేస్తే ఎలాంటి రిజల్టూ చూపించబడదు.

ఆదివారం 21 అక్టోబర్ 2007

వాయిస్ మెయిలింగ్ సాఫ్ట్‌వేర్




ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయి ఉండగా మైక్రోఫోన్‌లో వాయిస్ మెయిల్స్ పంపించుకోవడానికీ, సాధారణ టెక్స్ట్ మెయిల్స్ పంపించడానికి ఉపకరించే సాఫ్ట్‌వేర్ Talk Sender. వాస్తవానికి ఇది ప్రత్యేకమైన ఇ-మెయిల్ క్లయింట్‌లా పనిచేసేదైనప్పటికీ ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న ఇ-మెయిల్ క్లయింట్‌తో సైతం పనిచెయ్యగలుగుతుంది. దీన్ని ఉపయోగించి మెయిల్స్‌ని ఏ మెయిల్ సర్వర్‌కైనా పంపించవచ్చు. రిసీవ్ చేసుకోవచ్చు. రిసీవ్ చేసుకున్న మెయిల్ మెసేజ్‌లను మీకోసం చదివి వినిపిస్తుంది.

డీటెయిల్డ్ మెమరీ రిపోర్ట్ మేనేజ్‌మెంట్

మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చెయ్యబడి ఉన్న ఫిజికల్ RAM మొదలుకుని, విండోస్ వర్చువల్ మెమరీ, వీడియో మెమరీల వినియోగం ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు విశ్లేషించి చూపే అద్భుతమైన సాఫ్ట్‌వేర్ టూల్ MemoryKit. ప్రస్తుతం మీరు రన్ చేస్తున్న అప్లికేషన్ ప్రోగ్రాముల్లో ఏది ఎంతెంత ఫిజికల్, వర్చువల్ మెమరీని వినియోగించుకుంటోంది, మొత్తం వీడియో మెమరీలో ఎంతభాగం వినియోగంలో ఉన్నదీ తెలియజేయడంతోపాటు మెమరీ లీకేజీపై ఒక కన్నేసి ఉంచి టైం గడిచేకొద్దీ మెమరీ లీక్ కారణంగా సిస్టమ్ స్లో అవకుండా లీకేజ్‌ని నిరోధిస్తుంది ఈ సాఫ్ట్‌వేర్. మెమరీపై ఓవర్‌లోడ్ పడినప్పుడు కూడా దారిలో పెడుతుంది ఇది.

మంగళవారం 9 అక్టోబర్ 2007

మైక్రోసాఫ్ట్ నుండి ’సోప్ బాక్స్’




ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ యూజర్లు తమ వద్ద ఉన్న వీడియో ఫైళ్ళని ఇతరులతో పంచుకోవడానికి వీలు కల్పిస్తూ YouTube, Google Video వంటి సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ స్వయంగా MSN Soapbox పేరిట ఓ వీడియో అప్‍లోడ్ సర్వీస్ నడుపుతోంది. దీనిని http://video.msn.com/ అనే వెబ్‍సైట్ నుండి యాక్సెస్ చేయవచ్చు. YouTube మాదిరిగానే Soapboxలో కూడా ఏ వీడియో ఫార్మేట్‍లో ఉన్న వీడియోలనైనా సర్వర్‍కి అప్‍లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అప్‍లోడ్ చేసిన వీడియోలకు టాగ్‍లను తగిలించి , ఆ టాగ్‍ల ఆధారంగా ఇతర నెట్ యూజర్లు సులభంగా మీ వీడియోలు గుర్తించగలిగేలా ఏర్పాటు చేసుకోవచ్చు. వీడియోని అప్‍లోడ్ చేసే సమయంలోనే అదే స్క్రీన్‍పై వేరొకరు పోస్ట్ చేసిన వీడియోలు వెదికిపట్టుకుని అప్‍లోడ్ జరుగుతున్నపుడే మరోవైపు మనకు నచ్చిన వీడియోలు ప్లే చేసుకునే అవకాశం ఒకటి ఇందులో మనకు లభిస్తుంది.

No comments:

Post a Comment