Friday, June 22, 2012

ఎన్నో విషయాలు

సెల్ ఫోన్ లో తెలుగు సైట్లు కన్పించేస్తున్నాయి..

గతంలో Airtel సంస్థ తెలుగు SMS సర్వీస్ అందించేది. ఇప్పుడూ Indisms అనే .jar (Java) midlet సెల్ ఫోన్ల కోసం అందుబాటులో ఉంది. SMS మాట అలా ఉంచితే సెల్ ఫోన్ అంతర్గత ఇంటర్నెట్ బ్రౌజర్ లో  తెలుగు యూనీకోడ్ సైట్లు ఓపెన్ చేస్తే ఖాళీ డబ్బాలు కన్పిస్తుంటాయి. ఇటీవల మన బ్లాగ్మిత్రులు ఒకరు తమ ఫోన్ లో firmware అప్ డేట్ చేసినప్పటి నుండి తెలుగు కన్పిస్తోందని ఓ పోస్ట్ రాశారు. అప్పట్లో నావద్ద SE P900 (Symbian UIQ 2.1 సిరీస్ ఆపరేటింగ్ సిస్టమ్) ఉండేది. దానిపై ఏడాదిన్నర క్రితం నుండే పలు దశల్లో ప్రయోగాలు చేసి విఫలం అయ్యాను. ఆ ఫోన్ యూనీకోడ్ ని సపోర్ట్ చెయ్యదేమోనని సందేహం ఉండి ఆ మోడల్ డాక్యుమెంటేషన్ కూడా దొరికిన చోటల్లా చూశాను. ప్చ్ యూనీకోడ్ సపోర్ట్ చేసే ఫోనే అయినా నావద్ద P900 ఉన్నప్పుడు తెలుగు పొందలేకపోయాను.
ఇదిలా ఉండగా ఓ 10 రోజుల క్రితం P990i (UIQ3 OS) తీసుకున్నాను. తీసుకోగానే వెంటనే net ద్వారా గంటకు పైగా స్పెండ్ చేసి ఓపికగా firmware అప్ డేట్ చేశాను. ఇక ఆశగా కూడలి, జల్లెడలను ఓపెన్ చేస్తే మళ్లీ బాక్సులే వెక్కిరించాయి. కొద్దిగా ఆలోచిస్తే.. తెలుగు యూనీకోడ్ సైట్లు మన కంప్యూటర్లో చూపించబడాలంటే గౌతమి, పోతన వంటి యూనీకోడ్ ఫాంట్లు మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ చెయ్యబడి ఉండాలి కదా. సో ఆయా ఫాంట్లని ఫోన్ యొక్క fonts ఫోల్డర్ లో కాపీ చేస్తే ఫలితముంటుదేమోనన్న ఆలోచనతో పిసిలోని windows>fonts ఫోల్డర్ నుండి gautami.ttf ఫాంట్ ని కాపీ చేసి ఫోన్ లో వేశాను. అంతే ఫోన్ రీస్టార్ట్ చేశాక నా ఫోన్ లోని Opera 8.5 Symbian బ్రౌజర్ లో కూడలిని ఓపెన్ చేస్తే పై చిత్రంలోని విధంగా పాక్షికంగా తెలుసు కన్పించడం ప్రారంభించింది. ఎటొచ్చీ ఫాంట్ రెండరింగ్ పరంగా బ్రౌజర్ సంబంధిత సమస్యలు ఉన్నట్లున్నాయి.. అక్షరాలు మాత్రం తలకట్టులు అవి విడిపోయి కన్పిస్తున్నాయి. మొత్తానికి ఫోన్ లో తెలుగు సైట్లు చూడవచ్చు అన్నది అర్థమైంది. గతంలో నేను వాడిన P900లోనూ fonts జతచేసుకునే సదుపాయం ఉండేది. ఎప్పుడూ ఈ ఐడియా రాక ఈ దిశగా ఫాంట్ కాపీయింగ్ ప్రయత్నించలేదు.
ఒకవేళ మీరూ ఇలాంటి ప్రయోగం చెయ్యదలుచుకుంటే ముందు మీ ఫోన్ లో external ఫాంట్లని (ఇన్ బిల్డ్ ఉన్నవి కాకుండా) ఇన్ స్టాల్ చెయ్యడానికి వీలవుతుందో లేదో నిర్థారించుకోండి. వీలైతే మీ ఫోన్ మెమరీలో కానీ, మెమరీ కార్డ్ లో కానీ ఏ ప్రదేశంలో fonts స్టోర్ చెయ్యబడి ఉన్నాయో తెలుసుకుని ఆ ఫోల్డర్ లోకి data cable/bluetooth ద్వారా మీ కంప్యూటర్లో windows>fonts ఫోల్డర్ లో ఉండే gautami.ttf అనే ఫాంట్ ఫైల్ ని ట్రాన్స్ ఫర్ చేసుకోండి. కొన్ని ఫోన్ మోడళ్లలో మెమరీ కార్డ్ లో resources అనే ఫోల్డర్ లో fonts అనే సబ్ ఫోల్డర్ ని క్రియేట్ చేసి అందులోకి ఫాంట్ ని ట్రాన్స్ ఫర్ చేసి ఫోన్ ని రీస్టార్ట్ చేసినా సరిపోతుంది. వారం రోజుల నుండి ఈ అంశం పోస్ట్ చేద్దామని మేగజైన్ ప్రిపరేషన్ లో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. వీలైన వారు ప్రయత్నించగలరు

No comments:

Post a Comment