Monday, June 25, 2012

saradaaga super

మెమరీని తరచు క్లీన్ చేయడానికి

మీ కంప్యూటర్లో ఎంత మెమరీ ఉన్నా, ఎంత శక్తివంతమైన కంప్యుటర్ అయినా ఒకేసారి పలు అప్లికేషన్ ప్రోగ్రాములను సుదీర్ఘ కాలం పాటు ఓపెన్ చేసి పెట్టడం వల్ల సమయం గడిచేకొద్దీ పనితీరు నెమ్మదిస్తుంది. అలాంటప్పుడు కంప్యుటర్ ని రీస్టార్ట్ చేస్తేనే తిరిగి ఊపండుకుంటుంది. ఇలా స్లో అయినప్పుడు రీస్టార్ట్ చేసే అవసరం లేకుండా ఒ చిట్కా పాటించవచ్చు. డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకుని Type the location of the item బాక్స్ లో క్రింది కమాండ్ ఉన్నదున్నట్లు టైప్ చేయండి.
%windir%system.32\rundll32.exe advapi32.dll,ProcessIdleTasks ఇప్పుడు Next అని ప్రెస్ చేసి ఆ షార్ట్ కట్ కి Memory Cleaning లేదా మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ఇకపై సిస్టం స్లో అయిందని భావించినప్పుడల్లా ఈ షార్ట్ కట్ ని ఉపయోగించండి. మెమరీలో మొండిగా కూర్చున్న టాస్క్ లు , త్రేడ్ లు క్లోజ్ చేయబడి మెమరీ ఫ్రీ చేయబడుతుంది.

బుధవారం 9 ఎప్రిల్ 2008

కొన్ని వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా బ్లాక్ చేయడం



మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండి ఇంటర్నెట్ ద్వారా వారు Orkutలో స్క్రాప్‍లు చేయడానికో , ఐడిల్ బ్రెయిన్‍లో వాల్ పేపర్లు వెదకడానికో టైమ్ వేస్ట్ చేస్తున్నారనుకోండి. ఆయా సైట్లు మీ కంఫ్యూటర్‍లో ఓపెన్ కాకుండా నిరోధించవచ్చు. దీనికి ఎలాటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ అవసరం లేదు. మీ హార్డ్ డిస్క్ లో C:\Windows\System32\drivers\etc అనే ఫోల్డర్ లోకి వెళ్ళి HOSTS అనే ఫైల్‍ని మౌస్‍తో రైట్ క్లిక్ చేసి Open అనే ఆప్షన్ ఎంచుకుని Notepad తో ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ ఫైల్‍లో 127.0.0.1 local host అనే లైన్ క్రింద.. కొత్తగా 127.0.0.2 అనే అడ్రస్‍ని టైప్ చేసి దాని ఎదురుగా పై చిత్రంలోని విధంగా ఏ సైట్ అయితే ఓపెన్ కాకుండా నిరోధించాలనుకున్నారో దాని అడ్రస్‍ని టైప్ చేయండి. అలాగే ఒకదాని తర్వాత ఒకటి అలా వేర్వేరు సైట్ల అడ్రస్‍లను టైప్ చేసి ఆ ఫైల్‍ని సేవ్ చేయండి. దీంతో ఇకపై ఆయా వెబ్ సైట్లు ఓపెన్ అవకుండా బ్లాకవుతాయి.

మంగళవారం 8 ఎప్రిల్ 2008

విండోస్ సెటప్ తో పాటే అన్ని ప్రొగ్రాములూ ...


వైరస్ ఇన్ ఫెక్ట్ అయినప్పుడు మనం అందరం వేరే మార్గం లేకపోతే హార్డ్ డిస్క్ ని ఫార్మేట్ చేసి విండోస్‍ని తాజగా ఇన్ స్టాల్ చేస్తుంటాం. విండోస్ ఇన్‍స్టలేషన్ పూర్తయి, మనకు కావలసిన ఫోటోషాప్, ఎం.ఎస్. ఆఫీస్ వంటి అన్ని సాఫ్ట్ వేర్లు, ప్రింటర్, లాన్ కార్డ్ వంటి డివైజ్ డ్రైవర్లు అన్నీ వెదికిపట్టుకుని ఇన్‍స్టాల్ చేసుకునేసరికి తలప్రాణం తోకకు వస్తుంది. ఈ ఇబ్బందిని Windows Reload అనే సాఫ్ట్ వేర్ సాయంతొ చిటికెలో అధిగమించవచ్చు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‍తోపాటు మీకు రెగ్యూలర్‍గా అవసరపడే ఇతర సాఫ్ట్ వేర్లని , డివైజ్ డ్రైవర్లని ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత ఈ సాఫ్ట్ వేర్ సాయంతో ఆయా అంశాలన్నీ ఒకే డిస్క్ లో రైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపై విండోస్‍ని ఎప్పుడు ఫ్రెష్‍గా ఇన్‍స్టాల్ చేయవలసి వచ్చినా ఆ డిస్క్ ఒకదాన్ని వాడితే విండోస్‍తో పాటు ఆటోమేటిక్‍గా ఇతర సాఫ్ట్ వేర్లూ ఇన్‍స్టాల్ అవుతాయి. గంటల తరబడి అన్నీ వెదికి పట్టుకుని ఇన్‍స్టాల్ చేసుకునే శ్రమ తప్పుతుంది.

గురువారం 27 మార్చి 2008

Lime Wire ఉపయోగించడం చాలా ఈజీ..


సాంగ్స్, ఫోటోలు, వీడియోలు.. వంటి ఏ కంటెంట్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయి ఉన్న ఇతరుల సిస్టమ్‌లో ఉన్న వారి సిస్టమ్ నుండి నేరుగా మన సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవడానికి LimeWire వంటి Peer-to-Peer ప్రోగ్రాములు అవకాశం కల్పిస్తాయి. దీన్ని డౌన్ లోడ్ చేసుకున్న వెంటనే మన సిస్టమ్‌లో ఒక ఫోల్డర్‌ని ఇతరులు యాక్సెస్ చెయ్యడానికి అనువుగా స్పెసిఫై చేయాలి. ఇక మనకు కావలసిన Typeని ఎంచుకుని Keyword టైప్ చేసి Search అనే బటన్ క్లిక్ చేసి కుడిచేతి వైపు వెదకబడిన తర్వాత లభించే ఫైళ్ళపై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి Download అనే ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. అయితే ఇలాంటి సాఫ్ట్ వేర్ల వల్ల అవతలి వ్యక్తుల సిస్టమ్‌లలో ఉన్న ఫైళ్ళతో పాటు వైరస్‌లు కూడా వచ్చేస్తాయి జాగ్రత్త.

శనివారం 22 మార్చి 2008

సమయం గురించి అన్ని కోణాలలో వివరాలు


ప్రస్తుతం న్యూజెర్సీలో సమయం ఎంత అయిన్దన్నది తెలుసుకోవాలనుకున్తున్నారు, లేదా ఎ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ అయినా చూదాలనుకున్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు ? నెట్ లో కుస్తీపడతారు కదూ. ఆయితే టైం కి సంబంధించిన ప్రతీ పనికి వేర్వేరు వెబ్ సైట్లని వెదికి పట్టుకోవలసిన పని లేకుండా నేరుగా టైం తెలుసుకోవచ్చు. ఇందులో టైం జోన్ క్యాలిక్యు లెటర్ , మీటింగ్ ప్లానర్, సూర్యోదయ, సూర్యాస్తమయ వివరాలు ... ఇలా అన్నీ ఒకే చోట లభిస్తాయి. చాలా చక్కని వెబ్ సైట్ ఇది.

గురువారం 20 మార్చి 2008

వేర్వేరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెర్షన్లు వాడాలా ??


మీరు IE 5.5,IE6, IE7 వంటి వేర్వేరు ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ వెర్షన్లలో ఏదో ఒకదానిని మాత్రమే ఒకేసారి ఉపయోగించడానికి వీలుపడుతుంది. ఒకవేళ ఒకే వెబ్‌సైట్‌ని IE3,4.01, 5.01,5.5, 6.0వంటి వేర్వేరు వెర్షన్లలో ఏ విధంగా కనిపిస్తుందో తనిఖీ చేయాలంటే Multiple IE Installer అనే ప్రోగ్రామ్‌ని ఇన్‌స్టాల్ చేయండి. Vista ఆపరేటింగ్ సిస్టం మినహాయించి ఇతర అన్ని వెర్షన్లలో ఇది బాగా పని చేస్తుంది. ఏ వెర్షన్ కావాలో ముందే ఎంపిక చేసుకోవచ్చు.

శనివారం 15 మార్చి 2008

ఎ కలర్ పేరేమిటో మీకు తెలుసా ?



చాలా మంది ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, ఆకుపచ్చ, నలుపు, మేజెంటా వంటి రంగులు మాత్రమే చెప్పగలుగుతారు. మనం తరచుగా చూస్తూ కూడా వాటి పేర్లు తెలియని అనేక రంగుల పేర్లు తెలుసుకోదలుచుకుంటే name-that color -అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి డ్రాప్ డౌన్ లిస్టు లో కన్పించే వేర్వేరు వర్ణాలను తనివితీరా వీక్షించి వాటి పేర్లు తెలుసుకోవచ్చు. అలాగే ఏవైనా వర్ణాల యొక్క RGB విలువలను ఇచ్చినా వాటి పేరు లభిస్తుంది. చిరాగ్ మెహతా అనే భారతీయుడు రూపొందించాడు ఈ సదుపాయాన్ని.

గురువారం 6 మార్చి 2008

ఎ వెబ్ సైట్లో ఎ టెక్నాలజీ వాడబడింది


వెబ్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి, లేదా తమకు తాము స్వంతంగా వెబ్ సైట్లని రూపొందించుకోదలుచుకున్న వారికినెట్‍లో వివిధ ఆకర్షణీయమైన వెబ్ సైట్లని చూసినప్పుడు అవి ఏ వెబ్ టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడ్డాయన్న ఆసక్తి కలగడం సహజం. మీకు తారసపడే ఏ వెబ్‍సైట్ అయినా ఏయే టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడిందో తెలుసుకోవాలనుకుంటే builtwith అనే వెబ్ సైట్‍ని ఓపెన్ చేసి అక్కడి అడ్రస్ బార్‍లో మీరు ఏ సైట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని అడ్రస్‍ని టైప్ చేసి Lookup అనే బటన్‍ని క్లిక్ చేస్తే కొద్ది క్షణాల్లో వివరాలు ప్రత్యక్షమవుతాయి.

No comments:

Post a Comment