Friday, June 22, 2012

ఎన్నో విషయాలు

వేర్వేరు వీడియో ఫైళ్లని ఒకటిగా చేయడానికి

easy-video-joiner
మన కంప్యూటర్లో ఉన్న వేర్వేరు వీడియో ఫైళ్లని ఒకదానికొకటి కలిసి ఒకే వీడియో క్లిప్/మూవీగా క్రియేట్ చేయ్యదలుచుకున్నట్లయితే  Easy Video Joiner అనే ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. దీని సాయంతో AVL, MPEG, Real Media(RM), WMV, ASF వంటి ప్రముఖ వీడియో ఫార్మేట్లలో ఉన్న వీడియో ఫైళ్లని ఒకదానికొకటి కలిపి ఓ పెద్ద ఫైల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు.
డౌన్ లోడ్ లింక్ :
http://www.afterdawn.com/software/video_software/video_players/easy_video_joiner.cfm

SMS మేసేజ్ లకు ఫైర్ వాల్ గా పనిచేసే ప్రోగ్రామ్

sms
మీ ఫోన్‌కి సెల్ ఫోన్ ఆపరేటర్ నుండి తరచూ చిరాకుపెట్టే ఆఫర్ మెసేజ్‌లు వస్తున్నాయా?, వీటికితోడు mGinger వంటి సైట్ల నుండి ఇబ్బడిముబ్బడిగా మెసేజ్‌లు వస్తున్నాయా? సాధారణంగా  ఆపరేటర్ నుండి వచ్చే మెసేజ్‌లను అడ్డుకోవడానికి Dont Call అనే నేషనల్ డేటా బేస్‌లో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ ఫోన్‌లోనే ఒక సాఫ్ట్ వేర్ రూపంలో ఇలాంటి మెసేజ్‌లను అడ్డుకోవాలంటే SMS Firewall & Gaurd అనే సాఫ్ట్ వేర్‌ని మీ ఫోన్‌లో ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు పంపించే మెసేజ్‌లను పాస్ వర్డ్  ప్రొటెక్ట్ చేసి ఇతరుల కంటపడకుండా పంపించగలిగేలా కూడా ఈ ప్రోగ్రాంలో సదుపాయం పొందుపరచబడి ఉంది.
డౌన్ లోడ్ లింక్ :
http://my-symbian.com/uiq3/software/applications.php?fldAuto=214&faq=9

పెన్ డ్రైవ్ వైరస్‌లను ఇలానూ ఎదుర్కొనవచ్చు.

pen-drive
మనం స్నేహితుల కంప్యూటర్ల నుండి పెన్‌డ్రైవ్‌ల ద్వారా డేటాని కాపీ చేసుకు వచ్చేటప్పుడు పెన్ డ్రైవ్‌ని మన USB పోర్ట్‌కి  కనెక్ట్ చేసిన వెంటనే Autorun చేయబడేలా మన సిస్టం కాన్ఫిగర్ చేయబడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే  అధిక శాతం వైరస్‌లు autorun అవడం ద్వారా వ్యాపించే విధంగా కోడ్ రాయబడి ఉంటాయి. ఇలా పెన్ డ్రైవ్‌ని కనెక్ట్ చేసిన వెంటనే అది autorun అవకుండా నిలిపివేయగలిగితే అందులో ఉన్న వైరస్ దానంతట అది మన సిస్టమ్‌లోకి ప్రవేశించకుండా రక్షించుకోవచ్చు కదా..  అందుకోసం ఒక చిన్న చిట్కా. పెన్ డ్రైవ్‌ని USB పోర్ట్‌కి కనెక్ట్ చేసిన వెంటనే కొద్ది క్షణాలపాటు కీబోర్డ్‌పై ఉండే Shift కీని ప్రెస్ చేసి ఉంచండి. దాంతో autorun నిలిపివేయబడుతుంది. ఆ తర్వాత మీ కంప్యూటర్లో ఉండే ఏంటివైరస్ సాఫ్ట్ వేర్‌తో వైరస్ స్కాన్ చేసి శుభ్రంగా ఉన్న ఫైళ్లని మాత్రమే కాపీ చేసుకుని మీ పెన్ డ్రైవ్‌ని ఫార్మేట్ చేస్తే దాని నుండి వైరస్ తొలగిపోతుంది.

Discలు, సిడిరామ్ డ్రైవ్‌ల విషయంలో జాగ్రత్తలు

cdscratchlg
సిడిరామ్/డివిడి డ్రైవ్‌లను ఇష్టమొచ్చినట్లు వాడుతూ “మొన్నే కొన్నాం సర్.. అప్పుడే డేటా కూడా రీడ్ కావట్లేదు ” అంటూ ఫిర్యాదు చేస్తుంటారు చాలామంది. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి తలనొప్పులు తప్పవు. గీతలు పడిన సిడి/డివిడి లను డ్రైవ్‌లో పెట్టి రీడ్ చెయ్యడానికి ప్రయత్నించడం వల్ల , డ్రైవ్ లోపల, సిడిపై కనిపించకుండా మురికి చేరినా… అలాంటి డిస్క్‌లను ఎక్కువ రీడ్ చెయ్యడం వల్ల ఏకంగా lens పాడయ్యే అవకాశముంది.
చాలాపరిమిత మొత్తంలో డిస్క్‌పై ఉన్న గీతలు, వేలిముద్రలు డ్రైవ్ యొక్క పనితీరుపై ఏమంత ఎక్కువ ప్రభావాన్ని చూపించలేవు. కారణం డేటాని రీడ్ చేసే సమయంలో మనకు కనిపించే పై పొర లోపలకి లేజర్ ప్రసరింపజేయబడి డేటా రీడ్ చెయ్యబడుతుంది. అయితే పై చిత్రంలోని విధంగా సిడిపై ఎక్కువ గీతలు పడి, బాగా మురికి పట్టి  ఉన్నట్లయితే డిస్క్ రీడ్ చెయ్యడానికి కష్టమవుతుంది. ఇదే తరహా డిస్క్‌లను మళ్లీ మళ్లీ డ్రైవ్‌లో పెట్టి రీడ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్లయితే పూర్తిగా lens పాడయ్యే ప్రమాదం ఉంది.
బాగా మురికిపట్టి ఉండి ఆ  సిడిలోని ఫైళ్ల్లు మాత్రం చాలా ముఖ్యమైనవి అనుకుంటే అలాంటి సిడిని డ్రైవ్‌లో పెట్టడానికి ముందు సిడి క్రింది భాగాన్ని మెత్తని గుడ్డతో మధ్యలో రంధ్రం నుండి ప్రారంభించి అంచుల వరకూ ముగిసేలా ఒక్కోసారి కొద్ది భాగం చొప్పున మెల్లగా తుడవాలి. ఎట్టి పరిస్థితుల్లో సిడిని గుండ్రంగా క్లీన్ చేయవద్దు. ఇప్పుడు చెప్పిన పద్ధతిలోనే మధ్య రంధ్రం నుండు చివరి అంచుల వరకు క్లీన్ చేయాలి. అలాగే క్లీన్ చేసే సమయంలో ఎక్కువ వత్తిడి పెట్టవద్దు.గీతలు పడనీయొద్దు.

No comments:

Post a Comment