Game సిడి/డివిడిలు పాడవకుండా
భారీ
స్థాయి గ్రాఫిక్స్ తో కూడిన గేమ్స్ ఆడేవారు ఆయా గేమ్ సిడి, డివిడిలను
పలుమార్లు డ్రైవ్ లో పెట్టి తీస్తుండడం వల్ల, గేమ్ ఆడే సమయంలో సిడి నుండి
డేటా స్ట్రీమ్ అవుతుండడం వల్ల ఆయా సిడి/డివిడిల జీవితకాలం తగ్గిపోయే
ప్రమాదం ఉంది . అలాగే అలా గంటల తరబడి సిడి నుండి డేటా రీడ్ చెయ్యబడుతూ ఉండడం వల్ల డ్రైవ్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో Game Jackal Pro అనే ప్రోగ్రామ్ లో లభించే Image mode మనం డ్రైవ్ లో ఇన్ సర్ట్ చేసిన గేమ్ ని ఒక image
రూపంలో హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసి ప్రతీసారీ ఆ సిడి/డివిడి ఇన్ సర్ట్
చెయ్యవలసిన అవసరం లేకుండా ఆ గేమ్ ని నేరుగా హార్డ్ డిస్క్ నుండి ప్లే
చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. అదీగాక ఇందులో ప్రతీ గేమ్ ని మన
ఇష్టాఇష్టాలను బట్టి profiles క్రియేట్ చేసుకోవచ్చు. ఒక గేమ్ లోని కొన్ని సదుపాయాలను మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా ఈ profiles
లో సెట్టింగులు చేసుకోవచ్చు. గంటల తరబడి గేమ్స్ పై గడిపే పిల్లలున్న
ఇళ్లలో పిల్లలకు కొన్ని సదుపాయాల వరకూ పరిమితం చేసేలా ఈ సెట్టింగ్
ఉపయోగపడుతుంది
డౌన్ లోడ్ లింక్ :http://www.slysoft.com/en/gamejackal.html
No comments:
Post a Comment