వేరే ప్రదేశంలో పిసిని మోనిటర్ చేయడానికి

వేరే ప్రదేశంలో ఉన్న కంప్యూటర్లో కీబోర్డ్ ద్వారా టైప్ చేసే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేసి ఇ-మెయిల్ అడ్రస్ ద్వారా మనకు తెలిపే సాఫ్ట్ వేరే Data Doctor Advanced Keylogger. ఈ ప్రోగ్రామ్ రిమోట్ కంఫ్యూటర్‍ప్జై ఇన్‍స్టాల్ అయిన తర్వాత ఆ సిస్టమ్‍లో దాగి ఉండి, ఆ పిసిపై పని చేస్తున్న యూజర్ టైప్ చేసే ప్రతి కీని, పాస్ వర్డ్ లను, చాటింగ్ సంభాషణలను, ఓపెన్ చేసే వెబ్ పేజీల వివరాలను రికార్డ్ చేసి మనకు పంపిస్తుంటుంది. వేరే ప్రదేశంలో ఉన్న కంప్యూటర్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఇది పనికొస్తుంది.
హార్డ్ డిస్క్ లోని సమాచారం తిరిగి రాకుండా
మీ కంప్యూటర్‌ని ఇతరులకు అమ్మేటప్పుడు మీ హార్డ్ డిస్క్ లోని సమాచారం కేవలం ఫార్మేట్ చేసినంత మాత్రాన సరిపోదు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ డేటా రికవరీ సాఫ్ట్ వేర్‌ని ఉపయోగించినా ఇతరులు ఆ డేటాని తిరిగి పొందడానికి వీలుపడుతుంది. ఈ నేపధ్యంలో మీ హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైళ్ళు, ఫోల్డర్లు, డ్రైవ్‌లను తిరిగి రికవర్ చేయడానికి వీల్లేకుండా చెరిపివేయడానికి Stellar Wipe అనే ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. హార్డ్ డిస్క్ లో ఇంతకుముందు డిలీట్ చేసిన డేటాని ఏయే సమయాల్లో wipe చెయ్యడానికి పూనుకోవాలో కూడా ఇందులో షెడ్యూల్ చేసుకోవచ్చు.
ఏ DLL ఫైల్ ఏ ప్రోగ్రాముకి సంబంధించిందీ ?

వివిధ అప్లికేషన్ ప్రోగ్రాములు, డివైజ్ డ్రైవర్లు వందలకొద్ది DLL ఫైళ్ళని మన సిస్టమ్‍లోకి కాపీ చేస్తుంటాయి. DLL file missing అంటు ఎప్పుడైనా ఎర్రర్ మెసేజ్ కనిపించిందంటే ఆ DLL ఫైల్ ఏ ప్రోగ్రామ్‍కి సంబంధించిందో అర్ధం కాక సతమతమవుతుంటాం. ఈ నేపధ్యంలో DLL Informant అనే ప్రోగ్రామ్‍ని మన సిస్టమ్‍లో ఇన్‍స్టాల్ చేసుకుని రన్ చేస్తే హార్డ్ డిస్క్ లో ఉన్న అన్ని DLL ఫైళ్లని, వాటి ఆధారంగా పనిచేసే ప్రోగ్రాముల్ని గుర్తించి సమగ్ర సమాచారం అందిస్తుంది. రిజిస్టి పాత్‍లతో సహా ఇది వివరాలు తెలియజేస్తుంది.
No comments:
Post a Comment