అన్ని రకాల కాలిక్యులేషన్స్ చేయాలంటే
ఒక అంగుళానికి ఎన్ని మిల్లిమీటర్లు, ఎన్ని సెంటిమీటర్లు, ఒక మైలుకి ఎన్ని సెంటిమీటర్లు, అంగుళాలు ఉంటాయి వంటి ధర్మసందేహాలు వస్తే మీ వద్ద ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే వెంటనే worldwide metric అనే వెబ్ పేజిని ఓపెన్ చేయండి. ఇందులో నిడివి, బరువు, వత్తిడి, పరిమాణం, ఉష్ణోగ్రత వంటి వేర్వేరు అంశాలను వేర్వేరు ప్రమాణాల్లో కొలిచే సదుపాయం లభిస్తోంది. ఏదైనా బాక్శ్ లో మీకు కావలసిన విలువని టైప్ చేసి Calculate అనే బటన్‍ని ప్రెస్ చేసారంటే, వెంటనే ఇతర ప్రమాణాల్లో అది ఎంత విలువ అవుతుందో కనిపిస్తుంది.
ఆదివారం 24 ఫిబ్రవరి 2008
గూగుల్లో సురక్షితంగా సెర్చ్ చేయడానికి
గుగుల్ సెర్చ్ ఇంజిన్‍లో మీరు ఏ పదం వెదికినా మీకు తెలియకుండానే మీ IP అడ్రస్, ఏ పదం కోసం వెదికారు, సమయం తదితర వివరాలు గూగుల్ యొక్క డేటాబేస్‍లో భద్రపరచబడతాయి. దీనివల్ల మీ ప్రవసీకి ఇబ్బంది కలగవచ్చు. మీ వివరాలు రికార్డ్ చేయబడకుండా నిరోధించడానికి googlonymous ద్వారా వెదకండి. గూగుల్ లోనే మీ వివరాలేమీ రికార్డ్ అవకుండా ఇది సెర్చ్ చేసి పెడుతుంది.
శుక్రవారం 22 ఫిబ్రవరి 2008
Dual Core కి Core2Duo కి తేడా ఏమిటి??

చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. రెండు సిపియులతో కూడిన ఏ ప్రాసెసర్‍నైనా Dual Core శ్రేణికి చెందినదిగా చెప్పుకోవచ్చు. అంటే Dual Core అనేది ప్రాసెసర్ మోడల్ కాదు. ప్రాసెసర్ ప్యాకేజింగ్ టెక్నాలజీ అన్నమాట. Pentium D, Core Duo, Core2Duo, Athlon X2 వంటి వివిధ రకాల ప్రాసెసర్లు ఈ డ్యూయల్ కోర్ టెక్నాలజీని అనుసరించి రూపొందించబడుతున్నాయి. వీటిలో Core Duo అనేది మొదటి తరం ప్రాసెసర్ కాగా Core2Duo అనేది దానికన్నా అడ్వాన్స్ డ్‍గా ఉండే రెండవ తరం ప్రాసెసర్. Core Duoలో 2MB Cache మెమరీ ఉంటే Core2Duoలో 4 MB ఉంటుంది. అంతే తప్ప DualCoreకి Core2Duoకి ముడిపెట్టి గందరగోళపడవలసిన అవసరం లేదు. డ్యూయల్ కోర్‍కి చెందినదే Core2Duo మోడల్.
బుధవారం 20 ఫిబ్రవరి 2008
మ్యూజిక్‍కి కంటెంట్ ప్రొటెక్షన్ వద్దనుకుంటే…

WInXP తో పాటు పొందుపరచబడిన విండోస్ మీడియా ప్లేయర్‍లో మ్యూజిక్ సిడిలను కాపీ చేసుకునే సదుపాయం కూడా అందించబడింది. అయితే ఎవరు బడితే వారు ఆ సిడిలోని మ్యూజిక్‍ని కాపీ చేయడానికి వీల్లేకుండా ’లైసెన్సింగ్’సదుపాయం సైతం అందించబడింది. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు మీడియాప్లేయర్ Tools మెనూలో ఉండే Copy Music అనే విభాగంలో Copy Settings క్రింద Protect Content అనే బటన్‍ని డిసేబుల్ చేస్తే సరిపోతుంది.
Read - only ఫైళ్ళుగా మారితే సేవ్ చేయడం…
హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైళ్ళని ఎప్పుడైనా నిరభ్యంతరంగా వివిధ అప్లికేషన్
ప్రోగ్రాముల ద్వారా ఓపెన్ చేసుకుని ఎడిట్/సేవ్ చేసుకోవచ్చు. అయితే హార్డ్
డిస్క్ స్పేస్ ని ఆదా చేసుకునే ఉద్దేశ్యంతో డిస్క్ లోని ఫైళ్లని సిడి రైటర్
ద్వారా సిడిల్లోకి రికార్డ్ చేసినప్పుడు ఆ ఫైళ్లని తిరిగి సిడి నుండి
సిస్టమ్ లోకి కాపీ చేసుకుని ఎడిట్ చేసి సేవ్ చెయ్యడానికి
ప్రయత్నించినప్పుడు cannot save అని ఎర్రర్ చూపించబడుతుంది. దీనికి కారణం.
CD_ROM డిస్క్ అనేది రీడ్ ఓన్లీ మెమరీ మాత్రమే. దానినుండి కాపీ చేశాం
కనుకే ఆ ఫైళ్ళని సేవ్ చెయ్యలేము. ఈ నేపధ్యంలో సిడి నుండి హార్డ్ డిస్క్
లోకి కాపీ చేసుకున్న వెంటనే ఫైల్‍పై రైట్‍క్లిక్ చేసి Propertiesలో
Read-only ఆప్షన్‍ని డిసేబుల్ చేసుకున్న తర్వాతే ఆ ఫైల్‍ని ఎడిట్ చేయండి.
మంగళవారం 12 ఫిబ్రవరి 2008
Hibernation అవసరం లేదనుకుంటే..
ప్రస్తుతం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ స్థితిలొ ఉందో ( ఏయే ప్రోగ్రాములు, సర్వీసులు రన్ అవుతున్నాయన్నది) ఆ స్థితిలోకి తీసుకురావడానికి ఉపయోగపడే Hibernation అనే సదుపాయం పెద్దగా ఉపయోగించనివారు దాన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్‍లో C డ్రైవ్‍లో hiberfil.sys అనే హిడెన్ ఫైల్ గనుక ఉన్నట్లయితే మీ సిస్టమ్‍లో Hibernation ఎనేబుల్ చేసి ఉన్నట్లు భావించాలి. దీన్ని డిసేబుల్ చెయ్యడానికి Control Panel>Performance and Maintainance ఆప్షన్‍ని ఎంచుకుని అందులో Power Options> Hibernate అనే విభాగంలోకి వెళ్ళి Enable hibernation అనే ఆప్శన్ వద్ద ఉన్న టిక్ తీసేయాలి. సహజంగా మన సిస్టమ్‍లో ఎంత RAM ఉందో అంత స్థలాన్ని hibernate ఆక్రమించుకుంటుంది.
సోమవారం 4 ఫిబ్రవరి 2008
ప్రాసెసర్ ఎంత మేరకు వేడెక్కవచ్చు?

కంప్యూటర్‍ని ఆన్ చేసిన వెంటనే Delకీని ప్రెస్ చేసి BIOS లోకి వెళితే అందులో
ప్రస్తుతం ప్రాసెసర్ ఎంత ఉష్ణోగ్రతలో పనిచేస్తోందీ వివరాలు కనిపిస్తుంటాయి.
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ప్రాసెసర్లు గరిష్టంగా 75 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ
నిక్షేపంగా పనిచెయ్యగలవు. ప్రాసెసర్ Core లోని Thermal Diode
ఆధారంగా ప్రస్తుతమ్ ఉన్న టెంపరేచర్‍ని BIOS తెలియజేస్తుంటుంది. ఇతర
బెంచ్ మార్కింగ్ సాఫ్ట్ వేర్లు ప్రాసెసర్‍లోని వేరే ప్రదేశం వద్ద టెంపరేచర్ వివరాలకూ,
ధర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ల వివరాలకూ వృత్యాసం ఉంటుంది. ఏదేమైనా 75 డిగ్రీల
సెంటిగ్రేడ్ దాటినట్లయితే ప్రాసెసర్ కూలింగ్‍పై దృష్టి సారించవలసి ఉంటుంది.
No comments:
Post a Comment