Monday, June 25, 2012

చిట్కాలు పీసి

చిట్కాలు

ప్రస్తుతం లభిస్తోన్న అన్ని గ్రాఫిక్స్ కార్డులలోకి Nvidia GeForce 7950 GX2 అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.

నెట్‍వర్క్ లోని ఇంటర్నెల్ పిసిలకు ప్రైవేట్ అడ్రస్‍ని ఇవ్వడం ద్వారా ఫైర్‍వాల్ మాదిరిగా రక్షించే సర్వీసే.. Network Address Translation

Printer Spooler అనే ఫోల్డర్ కరప్ట్ అయితే మనమ్ ప్రింట్ చేసే డాక్యుమెంట్లు Junk Characters తో వస్తాయి.

www.rapidshare.de అనే ఉచిత ఫైల్ హోస్టింగ్ వెబ్‍సైట్ ఎప్పటికప్పుడు టైమర్, వర్డ్ వెరిఫికేషన్ సిస్టమ్‍లను మారుస్తుంది.

.NET ఆధారంగా డెవలప్ చేయబడిన అప్లికేషన్లు మన సిస్టమ్‍లో రన్ అవాలంటే .NET Framework సిస్టమ్‍లో ఉండి తీరాలి.

CMOS బ్యాటరీ లేకపోతే మామూలు కన్నా విండోస్ బూటింగ్ స్లో అవుతుంది. BIOS OS కి ట్రాన్స్ ఫర్ అయ్యే సమయం ఎక్కువవుతుంది.

DDR2 రామ్ స్లాట్ ఉన్న మదర్‍బోర్డ్ లలో 1GB సామర్ధ్యం కలిగిన మెమరీ మాడ్యూల్‍ని వాడడం ద్వారా పెర్‍ఫార్మెన్స్ బాగుంటుంది.

Thunderbird మన మెయిళ్ళని సర్వర్‍లో ఒక్క కాపీ కూడా మిగల్చకుండా అన్నీ మన సిస్టమ్‍లోకి ఆఫ్‍లైన్‍లోకి డౌన్‍లోడ్ చేస్తుంది

Dual Core Processor ప్రొసెసర్‍ని అమర్చుకోదలుచుకున్న వారు E6400 మోడళ్ళని నిరభ్యంతరకరంగా ఎంపిక చేసుకోవచ్చు.

మన నెట్‍వర్క్ లోని సెక్యూరిటీ లోపాలను గుర్తించడానికి www.xfocus.org సైట్‍లో లభించే X-Scan అనే ప్రోగ్రామ్ పనికొస్తుంది.

Visual Route అనే మృదులాంత్రం (software) ఉపయోగించి నెట్ ద్వారా మన సిస్టమ్‍కి ఎవరెవరు కనెక్ట్ అయ్యారన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు.

ఎలాంటి స్క్రీన్‍సేవర్‍ని ఉపయోగించకుండా LCD మోనిటర్‍ని నిరంతరం ఆన్ చేసి ఖాళీగా ఉంచితే 50% వరకూ బ్రైట్‍నెస్ తగ్గుతుంది.

అంతర్జాలం(Internet) పై ఏదైనా వెబ్‍సైట్‍ని చూడదలుచుకుంటే www.altavista.com అనే ఆన్లైన్ ట్రాన్స్ల్ లేషన్ సర్వీసు సాయం తీసుకోండి.

శనివారం 4 ఆగస్టు 2007

చిట్కాలు - 3

1. నెట్‌కి కనెక్ట్ అయినప్పుడల్లా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చెయ్యబడే విధంగా ఏంటి్‌వైరస్ ప్రోగ్రాములను కాన్ఫిగర్ చేయడం మంచిది. అధికశాతం ఏంటీ వైరస్ లు డీఫాల్ట్ గా అలాగే కాన్ ఫిగర్ చేయబడి ఉంటున్నాయి అనుకోండి.

2. ఏ కారణం వల్లయినా సిడిరామ్ డ్రైవ్ డోర్ బయటకు రానట్లయితే దానిపై ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ హోల్‌లో పిన్‌తో గుచ్చండి.

3.Desktop.scf అనే ఫైల్ డిలీట్ చెయ్యబడినప్పుడు Quick Launch Barపై Show Desktop ఆప్షన్ సైతం మాయమవుతుంది.

4.BIOSలో Internal Cache లేదా CPU L1, L2 Cacheల పేరిట కనిపించే ఆప్షన్లని తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవడం మంచిది.

5. నాసిరకం స్పీకర్లను ఉపయోగించడం వలన వాటిని మోనిటర్ ప్రక్కన అమర్చినపుడు స్క్రీన్ డిస్‌ప్లేలో అవాంతరాలు ఏర్పడుతుంటాయి.

సోమవారం 23 జూలై 2007

చిట్కాలు - 2



1. NVROM cleared by jumper అనే మెసేజ్ బూటింగ్ సమయంలో కనిపిస్తుంటే CMOS జంపర్ సరిగ్గా పెట్టలేదని అర్ధమన్నమాట.

2. PPT to SCR అనే సాప్ట్ వేర్ని ఉపయోగించి పవర్ పాయింట్ ప్రెజంటేషన్లను స్క్రీన్‌సేవర్లుగా మార్చుకోవచ్చు.

3. మానిటర్ రవాణాలో కదిలినప్పుడు,కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే "Out-of-Sync" అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది.

4. USB డివైజ్‌లను కొన్నప్పుడు మొదట డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేస్తూ డివైజ్‌ని కనెక్ట్ చెయ్యమని అడిగినప్పుడు మాత్రమే కనెక్ట్ చేయండి.

5. కంప్యూటర్ ద్వారా బార్‌కోడ్‌లను రీడ్ చెయడానికి తప్పనిసరిగా Barcode Reader అనే హార్డ్‌వేర్ పరికరం మన వద్ద ఉండాలి.

6. లేజర్‌జెట్ ప్రింటర్ కలిగి ఉన్నవారు ప్రింటర్‌ని UPSకి కాకుండా నేరుగా పవర్‌బోర్డుకి కనెక్ట్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు తప్పుతాయి.

7. ఫోటో్‌షాప్‌లో Clipping Path అనే టెక్నిక్‌ని అనుసరించి ఇమేజ్‌ల్లోని అదనపు భాగం ట్రాన్స్పరెంటుగా కనిపించేలా చేయవచ్చు.

బుధవారం 18 జూలై 2007

చిట్కాలు -1


1. ఇంటర్‌నెట్‌లో ఉండే వివిధ ఆన్‌లైన్ టివి చానెళ్ళని విండోస్ మీడియా ప్లేయర్,
రియల్ ప్లేయర్ల ద్వారా ఆక్సెస్ చేసుకోవచ్చు.

2. ఒకటి కంటే ఎక్కువ డయలప్ కనెక్షన్లు ఉన్నప్పుడు అన్నింటిలోనూ Save
Password ఆప్షన్ టిక్ చేయబడితేనే ఆ ఆప్షన్ పని చేస్తుంది.
లేదంటే మళ్లీ మళ్లీ పాస్ వర్డ్ టైప్ చేయవలసి వస్తుంది.

3. Dos Command ప్రాప్ట్‌లో Windows డైరెక్టరీలో ఉండగా scanreg/
backup అనే కమాండ్‌ని ఉపయోగించి విండోస్ రిజిస్ట్రీని బ్యాకప్ తీయవచ్చు.

4. ఆప్టికల్ మౌస్‌లలో క్రింది భాగంలో ఉండే సెన్సార్ టేబుల్, మౌస్ పాడ్ వంటి వాటి
ఉపరితలాన్ని గుర్తించడం ద్వారా మౌస్ మూమెంట్‌ని నిర్ణయించుకుంటుంది.

5. పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉన్న RAR ఫైళ్ళని Advanced RAR
Password Recovery సాప్ట్ వేర్ తో రికవర్ చేసుకోవచ్చు.

6. www.aponline.gov.in వెబ్‌సైట్‌లో సర్వర్ బాండ్‌విడ్త్ తక్కువగా
ఉండడంవల్ల 10వ తరగతి, ఇంటర్ వంటి పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది.

7. ఫోటోషాప్‌లోకి ఇతర సిస్టమ్‌ల నుండి ఫొటోలను కాపీ చేసుకువచ్చినపుడు
"కలర్ ప్రొఫైల్" సైతం అలాగే ఉంచడం మంచిది.

8. screensaverకి పాస్‌వర్డ్‌ని సెట్ చేసి మర్చిపోయినట్టైతే విండోస్ రిజిస్త్ట్రీ
ద్వారా పాస్‌వర్డ్‌ని తొలగించే అవకాశం ఉంటుంది.

9. External TV Tunercardని ఉపయోగించి టివి ప్రోగ్రాముల్ని రికార్డ్
చేసుకోవడానికి వీలుపడదు. ఇంటర్నల్ కార్డ్ ఉండవలసిందే!

10. డిజిటల్ కెమెరాల్లో "డిజిటల్ జూమ్" వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఎక్కువ ఆప్టికల్ జూమ్ ఉన్న కెమెరాలనే ఎంపిక చేసుకోండి.

No comments:

Post a Comment