ఉచితంగా లభించే సిడి రైటింగ్ సాఫ్ట్ వేర్
సిడిలను డివిడిలను రైట్ చేయ్యడానికి మనమందరం ఉపయోగించే Nero Expressవంటి సాఫ్ట్ వేల్లు ఆయా CD/DVD రైటర్లతో పాటు OEM వెర్షన్‍గా ఉచితంగా అందించబడుతున్నాయి. కానీ విడిగా అయితే అవి ఉచితమైనవి కావని మీకు తెలిసే ఉంటుంది. ఈ నేపధ్యంలో ఒకవేళ మీరు పూర్తిగా ఉచితంగా లభించే సిడి/డివిడి రైటింగ్ సాఫ్ట్ వేర్ కోసం వెదుకుతున్నట్లయితే Burn Aware Free Edition
వాడుకోవచ్చు. దీని ద్వారా CD/DVD లతో పాటు Blu-Ray ( BD-R/BD-RE ) డిస్కులను సైతం (మీ వద్ద ఆ రైటర్ ఉన్నట్లయితే ) రైట్ చేసుకోవచ్చు. డిస్క్ ఇమేజ్‍లను క్రియేట్ చెసుకోవడం, డిస్క్ టు డిస్క్ కాపీయింగ్ వంటి అన్ని సదుపాయాలు అందిస్తుందిది.
సిస్టమ్ వనరులను ప్రాసెస్‍లు హరిస్తున్నాయా?
మీ కంప్యూటర్‍లో ఏవి బడితే అవి భారీ సంఖ్యలొ ప్రాసెస్‍లు రన్ అవుతూ మీ సిస్టమ్ పనితీరుని నెమ్మదింపజేయడంతో పాటు సిస్టమ్ క్రాష్ అవడానికి దారి తీస్తున్నాయా ? అయితే మీరు Process Lasso
అనే చిన్న సాఫ్ట్ వేర్ మీ కంప్యూటర్లో ఇన్‍స్టాల్ చేసుకోండి. ఈ సాఫ్ట్ వేర్ సిస్టమ్ ట్రేలో రన్ అవుతున్న ప్రతీ ప్రాసెస్‍ని నిశ్శబ్దంగా మోనిటర్ చేస్తూ ఏదైనా ప్రాసెస్ 35% కన్నా ఎక్కువ CPU cycle ని హరిస్తుంటే దాన్ని kill చేస్తుంది. అలాగే రన్ అవుతున్న అన్ని ప్రాసెస్‍ల వివరాలూ నమోదు చేస్తుంది.
ఉచిత సిడి/డివిడి/బ్లూ - రే రైటింగ్ సాఫ్ట్ వేర్
డిస్పోజబుల్ చాట్ రూమ్ తయారుచేసుకోండి…
వేర్వేరు దేశాల్లొ, వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్న మీ స్నేహితులంతా ఒకేచోట ముచ్చటించుకోవాలనుకుంటున్నారా? అయితే కొద్దిసేపు మీకంటు ఓ చాట్ రూమ్
సృష్టించుకోవచ్చు కదా! ఆ వెబ్‍సైట్‍లో create a chat room (chat room name) అని కన్పించే బాక్స్ లో మీరు ఆ చాట్ రూమ్‍కి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరుని ఇవ్వండి. వెంటనే ఆ క్రిందనే మీరు పేర్కొన్న పేరుతో ఓ తాత్కాలిక చాట్‍రూమ్ ప్రారంభించబడి దాని లింక్ ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు మీరు ఆ లింక్‍ని ఓపెన్ చేస్తే ఓ చాట్ విండో వచ్చేస్తుంది. ఇక మీరు చేయవలసినదల్లా , Gmail, Yahoo Messenger వంటి
వాటిలో ప్రస్తుతం ఆన్‍లైన్‍లో మీకు అందుబాటులో ఉన్న మీ స్నేహితులందరికీ ఆ
చాట్‍రూమ్ లింక్‍ని పంపించి వెంటనే వచ్చేయమని ఆహ్వానించడమే ! అందరూ వచ్చిన తర్వాత తీరిగ్గా ముచ్చటించుకోవచ్చు.
నెట్ ద్వారా టివి చానెళ్ళని ఉచితంగా చూడొచ్చు…
ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతున్న అనేక ఉచిత టెలివిజన్ చానెళ్ళని మన కంప్యూటర్ స్క్రీన్ మీదే వీక్షించడానికి “JLC Internet TV
Archive for May, 2008 అడోబ్ రీడర్ 8 సిపియుని ఎక్కువగా వాడుకుంటుంది
PDF ఫైళ్ళని ఓపెన్ చేయడానికి ఉద్దేశించబడిన Adobe Reader8 వెర్షన్‌తో ఓ ఇబ్బంది ఉంది.వాస్తవానికి Adobe Reader 7 వరకూ అప్‌డేట్లు అవసరం లేకపోతే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యే సదుపాయాన్ని డిసేబుల్ చేసుకునే అవకాశముంది. అయితే Adobe Reader 8 లో మనం కోరకుండానే adobeupdater.exe అనే అప్‌డేట్ ప్రోగ్రామ్ మనం ఇంటర్‌నెట్‌కి కనెక్ట్ అయినప్పుడు Adobe సైట్‌కి వెళ్ళి తాజా అప్‌డేట్లని డౌన్‌లోడ్ చేస్తుంటుంది. అది సక్రమంగా పనిచేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ adobeupdater.exe ప్రోగ్రామ్ 98% సిపియుని వినియోగించుకుంటూ సిస్టమ్‌ని పూర్తిగా స్లో చేస్తుంది. సో.. ఇలాంటి ఇబ్బందిని మీరు అధిగమించాలంటే Foxit Reader
సంగీతం సృష్టించడానికో సాఫ్ట్ వేర్

చవులూరించే సంగీతాన్నీ సృష్టించాలనుకుంటే Ableton Live
అనే సాఫ్ట్ వేర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. వేర్వేరు పరికరాల ఆధారంగా
మ్యూజిక్ ని కంపోజ్ చేయడానికి, రికార్డ్, రీమిక్స్ చేయడానికి ఈ సాఫ్ట్ వేర్
వీలు కలిపిస్తుంది.32-bit/192kHz వరకు మల్టీ ట్రాక్ రికార్డింగ్ ని
సపోర్ట్ చేయడం తో పాటు టైం స్త్రేచ్చింగ్, రాప్పింగ్ చేయవచ్చు. అనేక
స్పెషల్ ఫిల్టర్లను అవసరాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు.
No comments:
Post a Comment