Monday, June 25, 2012

new technology

చేతిరాతను కేప్చర్ చేసే డిజిటల్ పెన్



Logitech సంస్ఠ ఇటీవల Logitech io2 Digital Pen పేరుతో ఓ ఉత్పత్తిని విడుదల చేసింది. ఇది అచ్చం బాల్ పాయింట్ పెన్ మాదిరిగా ఉంటుంది. బాల్ పాయింట్ పెన్లో మాదిరిగానే ఇందులో ఇంక్ కూడా పొందుపరచబడి ఉంటుంది. అయితే మామూలు పెన్ కీ దీనికీ ఉన్న వ్యత్యాసం.. ఈ పెన్ తో మనం పేపర్ పై రాసే సమాచారం మొత్తం ఆ పెన్ లోనే అంతర్గతంగా అమర్చబడి ఉన్న మెమరీలోకి కాపీ చేయబడుతుంది. ఆ తర్వాత ఆ పెన్ ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసుకుని అందులోని సమాచారాన్ని ట్రాన్స్ ఫర్ చేసుకుని Microsoft Word వంటి ప్ర్లోగ్రాముల్లో ఎడిట్ చేసుకోవచ్చు. మన చేతిరాతని విశ్లేషించి దానిని హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపంలోకి మార్చే ఈ పెన్ తో పాటు అందించబడే సిడిలో ఇస్తున్నారు. సో.. మీరు విధ్యార్థులు,జర్నలిస్ట్లులు, ఇతర ప్రొఫెషనల్స్ అయితే మీరు పేపర్ పై రాసిన మేటర్ని తిరిగి టైప్ చేయవలసిన అవసరం లేకుండా ఈ పెన్ సాయంతో నేరుగా డిజిటల్ రూపంలోకి మార్చుకోవచ్చన్నమాట.

బుధవారం 11 జూలై 2007

డివైజ్ డ్రైవర్లు లేవా.. ఆందోళన చెందకండి

మీరొక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ ని కొన్నారు. అయితే డ్రైవర్ల సిడి మాత్రం మిస్ అయింది. మరి అలాంటప్పుడు మదర్ బోర్డ్, సౌండ్, డిస్ ప్లే, లాన్ కార్డ్ డ్రైవర్లు ఎలా ఇన్ స్టాల్ చేస్తారు.. కష్టం కదూ? కొంతమంది కొత్తగా కొన్న కంప్యూటర్ యొక్క డ్రైవర్ల సిడిని కూడా కొద్దికాలానికే పారేసుకుంటారు. అలాంటివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇంటర్నెట్ పై www.pcdrivers.com అనే వెబ్ సైట్లో అన్ని రకాల పాత, కొత్త హార్డ్ వేర్ పరికరాల డివైజ్ డ్రైవర్లు ఒకేచోట లభిస్తున్నాయి. మీరు చేయవలసిందల్లా మీ హార్డ్ వేర్ పరికరం యొక్క మోడల్ని ఎంచుకుని దాని డ్రైవర్ని డౌన్ లోడ్ చేసుకోవడమే. 40 వేలకు పైగా డివైజ్ డ్రైవర్లు ఉన్నాయిక్కడ!


మంగళవారం 10 జూలై 2007

ఎంబెడ్డెడ్ సిస్టమ్స్...అన్నింటా టెక్నాలజీనే!!!




కుండీలో తడి ఆరిపోయిన వెంటనే బకెట్ నుండి నీళ్ళు చిలకరించే టెక్నాలజీ వస్తే ఎంతో మంది గృహిణులు మొక్కలకు నీళ్ళు ఉండవేమోనని బాధపడుతూ ఊళ్ళు వెళ్ళవలసిన బాధ తప్పుతుంది కదూ! కుండీలో తేమ స్థాయిని గుర్తించి నీటిని విడుదల చేసేందుకు ఆదేశాలు ఇవ్వగలిగేలా కొంత ప్రోగ్రామింగ్ కోడ్‌ని, దాన్ని ఓ చిప్‌పై భద్రపరచి పనిచేయిస్తే అదేం పెద్ద అసాధ్యం కాదు. అదే కాదు. ఒకప్పుడు ఊహకు కూడా అందని ఎన్నో పనులు నేడు embedded systems పుణ్యమా అని సులభంగా నెరవేరుతున్నాయి. కూలింగ్ లెవల్ తగినంత లభించగానే ఫ్రిజ్‌లు ఆటోమాటిక్‌గా ఆఫ్ అయిపోతున్నాయంటే అందులోని ప్రోగ్రామింగ్ చిప్‌కే క్రెడిట్ దక్కుతుంది. ఈ రోజు మనం ఉపయోగించే అనేక పరికరాల్లో పరోక్షంగా ఒక నిర్దిష్టమైన పనిని నెరవేర్చి పెట్టే చిప్‌లు అనేకం అంతర్గతంగా పొందుపరచబడి ఉంటున్నాయి. ఆ చిప్‌లు లేనిదే ఆ పరికరాలు ఉట్టి బొమ్మలే.





ఎంబెడ్డెడ్ సిస్టమ్ లక్షణాలు ఏమిటంటే..

మనం కంప్యూటర్‌లో పాటలు వినవచ్చు.ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ డిజైన్ చేసుకోవచ్చు. అంటే అనేక పనుల్ని ఒకే పరికరంలో పూర్తి చేసుకుంటున్నామన్న మాట. దీనికి పూర్తి భిన్నంగా పని చేసేవే ఎంబెడ్డెడ్ సిస్టమ్. Embedded సిస్టమ్ అనేది ఏదీ ప్రత్యేకంగా విడిగా కనిపించదు. రోబోట్లు, ఆటబొమ్మలు, రిమోట్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసిలు వంటి గృహోపకరణాల్లో మనకు తెలియకుండానే కొంత ప్రోగ్రామింగ్ కోడ్‌తో కూడిన చిప్ అమర్చబడి ఉంటుంది. అదే embedded system ఒక వస్తువు లోపల అంతర్లీనంగా నిక్షిప్తం (embedd) చేయబడి ఉంటుంది కాబట్టే ఇలాంటి వాటిని ఎంబెడ్డెడ్ సిస్టమ్ అంటారు. మనం ఎదైనా వస్తువుని కొనడానికి షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు సేల్స్‌బోయ్ "మీకు తెలుసా... కొంత టెంపరేచర్‌కి చేరగానే ఈ రైస్ కుక్కర్ ఆటోమాటిక్‌గా పవర్ ఆఫ్ అయిపోతుంది" అంటూ మనల్ని ఆశ్చర్యపరచడానికి ప్రయత్నిస్తుంటాడు. అదంతా ఆయా డివైజ్‌లలోని ఎంబెడ్డెడ్ సిస్టమ్ ల పుణ్యమే.



పూలకుండీ ఉదాహరణనే తీసుకుందాం. కుండీలో తేమ స్థాయిని తెలుసుకుని తేమ తక్కువగా ఉంటే వెంటనే నీరు విడుదలకు ఆదేశాలు చేయబడేలా ప్రోగామర్లు కాన్త ప్రోగ్రామింగ్ కోడ్ని రాస్తారు. ఆ Firmware అని పిలుస్తారు. ఆ ఫర్మ్ వేర్‍ని Flash Memory Chip లపై Chip W Rites అనే పరికరాల సాయంతో రికార్డ్ చేస్తారు. ఎంబెడ్డెడ్ సిస్టమ్‍లు అమర్చబడిన డివైజ్‍లు తమ స్టేటస్‍ని తెలియజేయడానికి LED లు, చిన్న పరిమాణం గల LCD డిస్‍ప్లేలు (ఖరీదైన ప్రింటర్లపై కనిపించే మాదిరిగా), సింపుల్ మెనూలను కలిగి ఉంటాయి. అదే ఖరీదైన ఉపకరణాల విషయంలో ఖర్చు పెద్ద సమస్య కాదు గాబట్టి ఉత్పత్తిదారులు ఆకర్షణీయమైన మెనూలు, ఆప్షన్లు, స్క్రీన్ ని తాకగానే ప్రతిస్పందించే టచ్ స్క్రీన్లు మొదలైన అధునాతన సదుపాయాలను పొందుపరుస్తారు. మనకు డిజిటల్ కెమెరాల్లో, డిజిటల్ వీడియో కామ్‍కాడర్లలో, PDA కోవకు చెందిన SE P910i, Nokia 6600 వంటి ఫోన్లలో మనకు కన్పించే మెనూలు, ఆప్షన్లకు సంబంధించిన పూర్తి ప్రోగ్రామింగ్ కోడ్ చిప్‍లపై రాయబడి ఆయా పరికరాల్లో అంతర్గతంగా అమర్చబడుతున్నదే. ఎంబెడ్డెడ్ ప్రాసెసర్లని ప్రధానంగా మైక్రో ప్రోసెసర్లు, మైక్రో కంట్రోలర్లు అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. మైక్రోకంట్రోలర్ల కోవకు చెందిన చిప్‍లపై అదనంగా పరికరాలు అమర్చబడి ఒరిజినల్ పరికరం సైజ్ తగ్గడానికి వీలు కల్పించబడుతుంది. ARM, MIPS, Cold fire వంటి అనేక రకాల సిపియు ఆర్కిటెక్చర్ వీటి కోసం వాడబడతాయి.

No comments:

Post a Comment