Monday, June 25, 2012

పీసీ సాఫ్ట్వేర్స్ (softwares)

MP 3 పాటలన్నింటి జాబితాను పొందడానికి


మీ హార్డ్ డిస్క్ లో వేర్వేరు సినిమాలకు సంబంధించి వందలకొద్దీ MP3 పాటలు ఉన్నాయనుకోండి. వాటన్నింటి పేర్లతో జాబితా కావాలంటే ప్రతీ సాంగ్ టైటిల్ ని కష్టపడి మళ్ళీ టైప్ చేసుకునే అవసరం లేకుండా MP3 ListMaker అనే సాఫ్ట్ వేర్ ని ఉపయోగించండి. ఇది మనం ఎంచుకున్న డ్రైవ్ ని తనిఖీ చేసి వెదికి పట్టుకున్న MP3 ఫైళ్ళని టెక్స్ట్ ఫైలుగా, లేదంటే వెబ్ పేజీగా రూపొందిస్తుంది. ఒకవేళ ఆ వెబ్ పేజీలో రిజినల్ ఫైలు లొకేషన్ కి లింకులు సైతం పొందుపరచ బడాలన్నా వీలవుతుంది. లేదా వెదికి పట్టుకున్న ఫైళ్ళతో Play List నీ క్రియేట్ చేసుకోవచ్చు.

Acrobat లేకుండా PDFలను ఎడిట్ చేయాలా?




PDF ఫైళ్ళని ఓపెన్ చేసి చదవడానికైతే Acrobat Reader సరిపోతుంది. కానీ, ఆయా PDF ఫైళ్ళలొ ఏవైనా మార్పులు చేయాలంటే మాత్రం Adobe Acrobat Professional అనే సాఫ్ట్ వేర్ మన దగ్గర ఉండవలసి ఉంటూంది. దానికి ప్రత్యామ్నాయంగా PDFill PDF అనే సాఫ్ట్ వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దీని సాయంతో వేర్వేరు PDF ఫైళ్ళని ఒకే ఫైల్‌గా జత చేసుకోవచ్చు. PDF ఫైళ్లలోని పేజీల యొక్క వరుస క్రమాన్ని మార్చుకోవచ్చు. PDF ఫైళ్ళలోని పేజీలను రోటేట్, క్రాప్ చేసుకోవచ్చు. ప్రతీ పేజీకి మనకు నచ్చిన విధంగా Header మరియు Footer సమాచారాన్ని జత చేసుకోవచ్చు. అలాగే PDF ఫైళ్లలోని పేజీలను JPEG, BMP వంటి ఇమేజ్ ఫైల్ ఫార్మేట్లలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. నాలుగైదు పేజీలుగా ఉన్న డాక్యుమెంట్‌లోని సమాచారం మొత్తాన్ని ఒకే పేజీలో ఇమిడిపోయేలా reformat చేయవచ్చు. అలాగే PDF ఫైళ్ళకు వాటర్ మార్క్‌లను జత చేయవచ్చు. పలు ఆప్షన్లున్నాయి.

DVD డిస్క్ లను బ్యాకప్ తీసుకోవడం ఎలా ?


సాధారణంగా వీడియో సిడిల్లోని వీడియో ఫైళ్ళని బ్యాకప్ తీసుకోవాలంటె సింపుల్‍గా MPEGAV అనే ఫోల్డర్‍లో గాని, లేదా సిడిలోని రూట్ ఫోల్డర్‍లోనే ఉండే .DAT ఎక్స్ టెన్షన్ నేమ్ కలిగిన ఫైల్‍ని హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకుంటే సరిపోతుంది. లేదా సిడి రైటర్ ఉన్నట్లయితే Nero వంటి సిడిరైటింగ్ సాఫ్ట్ వేర్‍ని ఉపయోగించి ఓ ఖాళీ సిడిలోకి ఒరిజినల్ సిడిలోని వీడియో ఫైళ్ళని కాపీ చేసుకోవచ్చు. ఇదే విధంగా VCD ల్లో DAT ఫైల్‍లో వీడియో డేటా ఉన్నట్లే DVD డిస్క్ లలో VOB అనే ఎక్శ్ టెన్షన్ నేమ్ కలిగిన ఫైల్‍లో డిజిటల్ ఫార్మేట్‍లో ఉన్న వీడియో డేటా స్టోర్ చేయబడి ఉంటుంది. అయితే DAT ఫైల్ మాదిరిగా ఈ ఒక్క ఫైల్‌ని హార్ద్ డిస్క్ లోకి కాపీ చేసుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదు. DVD ల్లోని కంటెంట్ CSS ఎన్‌కోడ్ చేయబడి ఉంటుంది. ఈ కారణం వల్ల కేవలం VOB ఫైల్ వల్ల ఉపయోగం ఉండదు. దీనికి ప్రత్యామ్నాయంగా డివిడీల్లోని డేటాని బ్యాకప్ తీసుకోవడానికి DVD Decypter వంటి థర్డ్ పార్టీ ప్రోగ్రాములను ఆశ్రయించవలసి ఉంటుంది. ఇవి డిస్క్ లను బ్యాకప్ తీస్తాయి.

రోజువారి కార్యకలాపాలు రికార్డ్ చేసుకోవడానికి




వృత్తిపరంగా ఎల్లప్పుడూ బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ తమ్ అరోజువారీ కార్యకలాపాలను ముందుగానే నమోదు చేసి పెట్టుకోవడానికి ఉపయోగఫడే సాఫ్ట్ వేర్ ప్రోగ్రామే My Personal Diary . ఇందులో మన రోజువారి నిర్వర్తించవలసిన కార్యకలాపాలను కొత్త ఎంట్రీలుగా రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే...అవసరం అయినప్పుడు ఈ రోజు/వారం/నెలలో ప్లాన్ చేసుకున్న కార్యక్రమాల వివరాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

No comments:

Post a Comment