బ్రౌజరేదైనా సులువుగా తర్జుమా!

విదేశీ భాషల్లో ఉన్న వెబ్‌సైట్ల సమాచారాన్ని మనకు తెలిసిన భాషలోకి మార్చేందుకు క్రోమ్ బ్రౌజర్‌లో సౌలభ్యం ఉంది. అయితే ఇందుకు మనం ఆ బ్రౌజర్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఏ బ్రౌజర్‌తోనైనా పనిచేసే ట్రాన్స్‌లేషన్ టూల్‌ను మైక్రోసాఫ్ట్‌ల్యాబ్స్ అభివృద్ధి చేసింది. ట్రాన్స్‌లేటర్ బుక్‌మార్క్‌లెట్ అని పిలిచే ఈ టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే అన్ని రకాల బ్రౌజర్లతో సులువుగా తర్జుమా చేసుకోవచ్చు. ఏ భాషలోకి తర్జుమా చేయాలన్నది మెనూ ద్వారా నిర్ణయించుకోవచ్చు. ఆ తరువాత ట్రాన్స్‌లేట్ అన్న ఆప్షన్‌ను క్లిక్ చేస్తే చాలు. సులువైన వాడకం దీని ప్రత్యేకత. ‘ట్రాన్స్‌లేట్ దిస్’, ‘కిండిల్ ఫిష్’, ‘లెన్‌డిట్, ‘రీకిండిల్‌ఇట్’ వంటి టూల్స్ కూడా ఇదే కోవకు చెందినవి.
సోషల్ మీడియా మొత్తం ఒకచోటకు...

ట్విట్టర్, ఫేస్‌బుక్.. గూగుల్ ప్లస్.. ఇలా సోషల్ మీడియో అనేకానేక ఆప్షన్స్ ఉన్నాయి. మనలో చాలామందికి వీటిన్నింటిలో అకౌంట్స్ కూడా ఉంటాయి. అయితే ఒకదాంట్లోని అంశాలు మరోదాంట్లో ఉండవు. ఉదాహరణకు రెండేళ్ల క్రితం మీరు చేసిన ట్వీట్‌ను వెతకాలనుకోండి. అది సాధ్యం కాదు. అందుకే సోషల్ మీడియా వెబ్‌సైట్ అకౌంట్లన్నింటినీ ఒకదగ్గరకు చేర్చేందుకు ‘థింక్‌అప్’ టూల్ పుట్టుకొచ్చింది. ఈ టూల్‌తో మీరు సోషల్ మీడియాలో పొందుపర్చిన ఏ సమాచారాన్ని అయినా ఇట్టే చూడవచ్చు. విశ్లేషించుకోవచ్చు. వాడుకోవచ్చు కూడా. వ్యక్తిగత అవసరాలకు దీని ఉపయోగం తక్కువే కావచ్చుకానీ, సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేసుకునే సంస్థలకు మాత్రం బాగా పనికొస్తుంది.
ఆడియో, వీడియో ఎడిటింగ్ కోసం...

పాటలు, వీడియోలు ఎడిట్ చేసేందుకు ఇంటర్నెట్‌లో చాలా టూల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ రెండింటినీ ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద చేసుకోవాలంటే మాత్రం ‘ఫైల్‌ల్యాబ్’ వంటి అప్లికేషన్‌ను ఉపయోగించాల్సిందే. ఒకసారి డెస్క్‌టాప్‌పై ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.. బ్రౌజర్ సాయంతో ఆడియో, వీడియో ఫైళ్లను చాలా సులువుగా ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. స్పెషల్ ఎఫెక్ట్‌లు చేర్చేందుకు, వీడియో లేయర్లు ఒకదానిపై ఒకటి పేర్చేందుకు కూడా వీలవుతుంది.
No comments:
Post a Comment