
స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి, ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి, ఎమ్‌ఎస్ ఆఫీస్‌లో పవర్ పాయింట్‌ను సెలక్ట్ చేసుకోవడానికి పట్టే కనీస సమయం... 5.6 సెకన్లు! అది కూడా మంచి కాన్ఫిగరేషన్‌తో నడుస్తున్న పీసీ మీద పనిచేస్తూ వేసిన అంచనా. ప్రతి సెకన్ విలువైనదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని పవర్ పాయింట్ ఓపెన్ చేయడానికి ఐదు సెకన్ల సమయం కేటాయించాలా? అంటే దీనికి సమాధానంగా ఎవరికైనా గుర్తొచ్చేదే ‘షార్ట్‌కట్ కీ’ ఇది అందరికీ తెలిసిందే కానీ ఉపయోగించం అంతే, కొందరు తెలిసి, మరి కొందరు తెలీక! అవగాహన లేని వారి కోసం ఒక గైడ్, అవగాహన ఉన్న వారికోసం ఒక సూచన ఇది... సిస్టమ్‌లోని, ఒక నెట్‌వర్క్‌లోని ఏ ఫోల్డర్‌కైనా, ఏ ప్రోగ్రామ్‌నైనా ఒకే క్లిక్ ద్వారా రన్ చేసుకొనే సదుపాయమే షార్ట్‌కట్ కీ.
వివిధ పోల్డర్లకు, ఫైల్స్‌కు సులభంగా డెస్క్‌టాప్ మీద షార్ట్‌కట్స్‌ను ఏర్పాటు చేసుకొంటాం, కంట్రోల్+సీ, కంట్రోల్+వీ వంటి షార్ట్‌కట్స్‌ను చాలా సులభంగా ఉపయోగించేస్తుంటాం. మరి సిస్టమ్‌లోని అప్లికేషన్స్‌కు కీబోర్డ్ షార్ట్‌కట్ పెట్టుకోవడం ఎలా అంటే, పది క్లిక్స్‌తో చేయగల పనిని ఒకే సెకనులో మూడు బటన్స్ నొక్కి ఓపెన్ చేయడం ఎలా అంటే... ఉదాహరణకు ఎమ్‌ఎస్ ఎక్సెల్‌కు షార్ట్‌కట్ కీ పెట్టుకోవాలనుకొంటే స్టార్ట్‌బటన్ నుంచి ఎమ్‌ఎస్ ఆఫీసు సెలెక్ట్ చేసుకొని ఎక్సెల్ మీద మౌస్ ఉంచి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకొంటే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
అందులో షార్ట్‌కట్ ట్యాబ్ వద్ద మనకు నచ్చిన షార్ట్‌కట్ కీ ఇచ్చుకోవచ్చు. ప్రతి షార్ట్‌కట్‌కు కంట్రోల్+ఆల్ట్ తప్పనిసరి, ఎక్సెల్ రన్ చేసుకోవడానికి దాన్ని ప్రారంభం ఇంగ్లీషు అక్షరం ‘ఈ’ ఇచ్చుకోవడం ఉత్తమం. అంటే కంట్రోల్+ఆల్ట్+ఈ అని టైప్ చేసి సేవ్ చేశామనుకోండి, ఇక ఆ షార్ట్‌కట్ నొక్కితే చాలు ఎమ్‌ఎస్ ఎక్సెల్ ఒక సెకెనులో మీ కళ్ల ముందు ప్రత్యక్ష్యం అవుతుంది. ఇలా ప్రతి అప్లికేషన్‌కు ఒక్కో షార్ట్‌కట్ కీ పెట్టుకోవచ్చు. ఆ షార్ ్ట కట్ సులభంగా గుర్తుండేలా పెట్టుకోవడం మీ సృజనాత్మకతే సుమా!
No comments:
Post a Comment