
ఆశ్చర్యంగా ఉంది కదా.. సమస్తం ఒకే చోట అందించేందుకు గూగుల్ చేస్తున్న యత్నాల్లో ఇదో ఫీచర్. మెయిల్ ఓపెన్ చేశాక.. పక్కన కనిపించే చాటింగ్ బాక్స్‌లో ఉన్న ఎవరికైనా మనం ఉచితంగా ఎస్‌ఎంఎస్ పంపుకోవచ్చు. అంటే ఆ బాక్స్‌లో మనం మెసేజ్ పంపాల్సినవారి పేరుపై మౌస్ పాయింటర్‌ను ఉంచితే వచ్చే మెనూలో ‘సెండ్ ఎస్‌ఎంఎస్’ అన్న ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి వారి ఫోన్ నంబర్ ఎంటర్ చేసి.. ఏ దేశమో సెలెక్ట్ చేస్తే చాలు! వారు ఆఫ్‌లైన్‌లో ఉన్నపుడు.. మనం చాటింగ్ బాక్స్‌లో టైప్‌చేసే సందేశం నేరుగా వారి మొబైల్‌కే వెళుతుంది.

ఇంతకాలం సౌదీ అరేబియా, శ్రీలంక, అమెరికా, ఆఫ్రికా తదితర విదేశాల్లో ఉన్నవారికే మనం ఎక్కడి నుంచైనా ఇలా సందేశం పంపే అవకాశం ఉండగా.. ఇటీవలే భారత్‌లోని మొబైళ్లకు కూడా ఆ అవకాశాన్నిచ్చింది గూగుల్. అయితే అన్ని మొబైల్ క్యారియర్లకూ ఇది అందుబాటులో లేదు. అంటే.. మన దేశంలో ఎయిర్‌సెల్, ఐడియా, లూప్ మొబైల్, ఎంటీఎస్, రిలయన్స్, డొకొమో, ఇండికాం, వొడాఫోన్ మొబైల్ వినియోగదారులకు మనం ఉచితంగానే ఎస్‌ఎంఎస్ పంపొచ్చు. అలాగే విదేశాల్లో కూడా కొన్ని సర్వీస్ ప్రొవైడర్లకే అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు.. http://tinyurl.com/c7gcznoలో చూడండి..
No comments:
Post a Comment