వెబ్‌సైట్ జాతకమంతా తెలుసుకోండి!

ప్రపంచ ప్రసిద్ధ సంస్థల నుంచి సామాన్య వ్యక్తుల వరకూ తమకంటూ ఒక ప్రత్యేక వెబ్‌సైట్ లేదా బ్లాగ్ నడుపుతున్న కాలమిది... మరి ఏ వెబ్‌సైట్‌కు ఎక్కువ క్రేజ్ ఉంది, దేన్ని ఎక్కువమంది క్లిక్ చేస్తున్నారు, ప్రసిద్ధ సైట్ల రోజువారి ఆదాయమెంత... అనే ఆసక్తికరమైన విషయాలను వివరిస్తుంది స్టాట్‌మైవెబ్.కామ్ ఇందులో ఒక వెబ్‌సైట్ పేరు టైప్ చేశామంటే చాలు... దాని భూత, వర్తమాన కాలాల వివరాలన్నింటినీ అందజేస్తుంది ఈ వెబ్‌సైటు.

ఒక వెబ్‌సైట్ రోజువారి విజిటర్ల సంఖ్యను తెలుసుకోవడం నుంచి ఆ సైట్ లోడ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది, దాని ఆదాయమెంత, ప్రపంచ వ్యాప్తంగా వెబ్‌సైట్లకు ర్యాంకింగ్‌ను ఇచ్చే ‘అలెక్సా’లో దీని స్థానమెక్కడ... వంటి సమస్త విషయాలను తెలియజేస్తుంది. ఇందులో కొన్ని వేల వెబ్‌సైట్ల గురించి సమాచారం నిక్షిప్తమై ఉంది. పేరుకు తగ్గట్టే ప్రతి విషయాన్నీ గణాంకాల్లో వివరిస్తుంది ఈ వెబ్‌సైట్. ఆసక్తి కొద్దీ, అవసరం కొద్దీ ఒక సైట్ జాతకాన్నంతా తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి...
www.statm-yweb.com
ఇంటెలిజెంటిల్మన్ అనిపించుకోండి!

తలకు నూనె రాసుకొనే సమయం కూడా ఉండదు జెంటిల్మన్లకు మరి ఆమెకు సంబంధించిన ప్రతి విషయం గుర్తుంచుకోవటం మెదడుకు మించిన భారమే! అలాంటి భారాన్ని తగ్గిస్తూ మగాళ్లను ఇంటెలిజెంట్ గా నిరూపించే ప్రయత్నం చేస్తానంటోంది దిడైలీజెంటిల్మన్.కామ్ గర్ల్‌ఫ్రెండ్ లేదా, గర్ల్‌ఫ్రెండ్స్‌కు సంబంధించిన చిన్న చిన్న విషయాలను, వారికి వ్యక్తిగతంగా ప్రాముఖ్యత ఉన్న రోజులను ఈ సైట్‌లోని మన అకౌంట్‌లో రాసుకొంటే చాలు... ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన అలర్ట్స్‌ను మనకు అందజేస్తూ, ఆ రోజును ప్లెజెంట్‌గా మార్చడానికి తన వంతు సహకారాన్ని అందిస్తుంది ఈ వెబ్‌సైట్. ఆమెకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనను, సందర్భాలను మరచిపోయాము అనే నిందను దూరం చేస్తుంది. అంతే కాదు రిలెషన్‌షిప్స్‌ను సెలబ్రేట్‌గా మార్చే ఉద్దేశంతో పనిచేసే ఈ వెబ్‌సైట్ డిజైన్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది... ఆమె భావాలను పసిగట్టి మీ అకౌంట్‌లో రాసుకొంటూ వాటిని సందర్భానికి తగ్గట్టుగా సెలబ్రేట్ చేయండి అని ఆహ్వానిస్తోంది...
www.thedailygentleman.com
విసుగెత్తించే మెయిల్స్ నుంచి ఊరట...

మన పర్సనల్ జీమెయిల్ అకౌంట్ నుంచి పొరపాటునో, కావాలనో అనేక సైట్స్‌కు, అలర్ట్స్‌కు సబ్‌స్రై ్కబ్ అవుతుంటాము... ఒక్కసారి సబ్‌స్రై ్కబ్ అయ్యామంటే, ప్రతి రోజూ పదులసంఖ్యలో మెయిల్స్ వెల్లువల వచ్చిపడుతుంటాయి. వాటన్నింటినీ క్లియర్ చేసుకోవడం, వాటి మధ్యలో మనకు అవసరముండే మెయిల్స్‌ను చెక్ చేసుకోవడం పెద్ద తలనొప్పి విషయంగా తయారవుతుంటుంది. సబ్‌స్క్రైబ్ అయిన విషయాల నుంచి విముక్తి పొందడం కూడా అంత సులభమైన విషయమేమీ కాదు.

ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది... అన్‌సబ్‌స్క్రైబర్.కామ్ బిజీబిజీగా గడుపుతూ, జీమెయిల్‌లో స్పామ్ మెయిల్స్‌ను క్లియర్ చేసుకొనేంత సమయం లేనివాళ్లకు ఏకవాక్య పరిష్కారం ఈ సైట్. ఇందులోకి లాగిన్ అయ్యి, అది ఇచ్చే డెరైక్షన్స్ ద్వారా అనవసరం అనుకొన్న వాటినుంచి ఆటోమేటిక్‌గా అన్‌సబ్‌స్రై ్కబ్ అవ్వొచ్చు. రెండు రోజుల కిందటి సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా క్లియర్ చేసే ఈ సైట్‌ను శాశ్వత అప్లికేషన్‌గా సేవ్ చేసుకోవాలంటే రెండు డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది... www.unsubscribr.com
No comments:
Post a Comment