Friday, July 6, 2012

current affairs



మంచి గంధం చెట్లు పెరిగే అడవులు
1. ప్రపంచ భూభాగంలో భారతదేశం ఆవరించిన విస్తీర్ణత శాతం?
ఎ) 3.2 బి) 2.6
సి) 2.42 డి) 3.26
2. ‘డూన్’లు అంటే?
ఎ) పర్వత శ్రేణుల మధ్య సమతలంగా ఉన్న లోయలు
బి) రెండు పర్వతాల మధ్య సహజంగా ఏర్పడిన దారులు
సి) పర్వత శ్రేణుల్లో జన్మించిన నదీ ప్రవాహ మార్గాలు
డి) పర్వతాలపై నివసించేందుకు అనువుగా ఉండే అందమైన ప్రదేశాలు
3. దక్కన్ పీఠభూములు ఏ శిలలతో ఏర్పడ్డాయి?
ఎ) పురాతన స్పటిక శిలలు
బి) రూపాంతర శిలలు
సి) అగ్ని శిలలు డి) పైవన్నీ
4. కింది వాటిలో తప్పుగా జతపరచింది?
ఐ) పశ్చిమబెంగాల్ - ఉత్కల్‌తీరం
ఐఐ) ఆంధ్రప్రదేశ్ - సర్కార్ తీరం
ఐఐఐ) తమిళనాడు - కోరమాండల్ తీరం
ఐగ) ఒడిశా - కొంకణ్ తీరం
ఎ) ఐఐ బి) ఐఐ, ఐగ సి) ఐ, ఐగ డి) ఐ, ఐఐఐ
5. సింధు నదికి అతిపెద్ద ఉపనది?
ఎ) సట్లెజ్ బి) చీనాబ్ సి) జీలం డి) రావి
6. నైరుతి రుతుపవన కాలం?
ఎ) జూన్-సెప్టెంబర్ బి) జూలై-అక్టోబర్
సి) మే చివరి నుంచి ఆగస్ట్ చివరి వరకు
డి) జూన్ మధ్య నుంచి అక్టోబర్ మొదటి వారం
7. మంచి గంధం చెట్లు ఏ అడవుల్లో పెరుగుతాయి?
ఎ) సతత హరితారణ్యాలు
బి) ఉష్ణ మండల అడవులు
సి) ఆల్‌ఫైన్ అడవులు డి) ఆకురాల్చు అడవులు
8. గులకరాళ్లతో కూడిన ఒండ్రు మృత్తికలను ఏమని పిలుస్తారు?
ఎ) భంగర్ బి) భాభర్ సి) ఖాదర్ డి) టెరాయి
9. భారతదేశ జన విభాజక సంవత్సరంగా గుర్తింపు పొందిన సంవత్సరం?
ఎ) 1991 బి) 2001 సి) 1921 డి) 1911
10. కాలువల ద్వారా నీటి పారుదల సౌకర్యం అధికంగా ఉన్న రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) తమిళనాడు
సి) మహారాష్ర్ట డి) ఉత్తర ప్రదేశ్
11. వరిపంట విస్తీర్ణంలో, ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం?
ఎ) చైనా బి) భారత్
సి) బంగ్లాదేశ్ డి) మలేషియా
12. ‘పరిహేళి’ అంటే?
ఎ) భూమి నుంచి సూర్యుడి వరకు గల దూరం నిశ్చలంగా ఉండే స్థితి
బి) భూమి నుంచి సూర్యుడికి మధ్యగల సగటు దూరం తగ్గే స్థితి
సి) సూర్యుడి నుంచి భూమికి మధ్య సగటు దూరం పెరిగే స్థితి
డి) సూర్యుడి నుంచి భూమి వరకు గల దూరం నిశ్చలంగా ఉండని స్థితి
13. ఉత్తరార్థ గోళంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలు?
ఎ) తూర్పువైపు వాలు కలిగిన ప్రాంతాలు
బి) పశ్చిమవైపు వాలు కలిగిన ప్రాంతాలు
సి) దక్షిణంవైపు వాలు కలిగిన ప్రాంతాలు
డి) ఉత్తరపు వాలు కలిగిన ప్రాంతాలు
14. ఛినూక్, బోరా, మిస్ట్రాల్, శాంటా అనేవి?
ఎ) వ్యాపార పవనాలు బి) పశ్చిమ పవనాలు
సి) కాలాన్నిబట్టి వీచే పవనాలు
డి) స్థానిక పవనాలు
15. భూ ఉపరితలంపై సంభవించే నష్టానికి కారణమవు తున్న భూకంప తరంగాలు?
ఎ) ్కతరంగాలు బి) ఔతరంగాలు
సి) ఖతరంగాలు డి) తరంగాలు
16. వియన్నా సమావేశ కన్వీనర్?
ఎ) నెపోలియన్ బి) ఫెడ్రిక్ విలియమ్
సి) బిస్మార్‌‌క డి) మెటర్నిక్
17. ఇటలీ ఏకీకరణలో ప్రముఖ పాత్ర వహించిన త్రిమూర్తులు?
ఎ) గారిబాల్డి, కవూర్, మజ్జిని
బి) లూయీఫిలిప్, నెపోలియన్, బిస్మార్‌‌క
సి) గారిబాల్డి, బిస్మార్‌‌క, మజ్జిని
డి) కవూర్, నెపోలియన్, ఫెడ్రిక్ విలియమ్స్
18. ‘చరిత్ర అంటే వర్గ పోరాటానికి చెందిన రికార్‌‌డ’ అని అభివర్ణించింది?
ఎ) విన్‌స్టన్ చర్చిల్ బి) మావో-ట్సే-టుంగ్
సి) కార్‌‌లమార్‌‌క్స డి) లూయీబ్లాంక్
19. నెహ్రూ రూపకల్పన చేసిన అలీనోద్యమానికి ప్రేరణనిచ్చిన దేశం?
ఎ) రష్యా బి) ఇంగ్లండ్ సి) జపాన్ డి) అమెరికా
20. మొదటి పానిపట్ యుద్ధంలో విజయం సాధించింది?
ఎ) అక్బర్ బి) హుమయూన్
సి) షాజహాన్ డి) బాబర్
21. ‘భూమిపై స్వర్గమనేది ఉంటే- ఇదే అది, ఇదే అది’ అని ఎక్కడ రాసి ఉంది?
ఎ) దివాన్-ఇ-ఖాస్ బి) తాజ్‌మహల్
సి) ఎర్రకోట డి) ఇబాదత్‌ఖానా
22. శివాజీ గురువు?
ఎ) రాందేవ్ బి) కొండదేవ్ సి) షాజీ డి) పీష్వా
23. భారత దేశంలో మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్?
ఎ) వారెన్ హేస్టింగ్‌‌స బి) కార్‌‌నవాలీస్
సి) విలియంబెంటింక్ డి) పీష్వా
24. మంగల్‌పాండేను ఉరి తీసిన ప్రదేశం?
ఎ) ఢిల్లీ బి) మీరట్
సి) బారక్‌పూర్ డి) కాన్పూర్
25. ‘వేదాంతసారం’ అనే గ్రంథాన్ని రాసినవారు?
ఎ) స్వామి దయానంద సరస్వతి
బి) రాజారామ్మోహన్ రాయ్
సి) దేవేంద్రనాథ్ ఠాగూర్
డి) స్వామి వివేకానంద
26. ‘భారత జాతీయ కాంగ్రెస్’ స్థాపన సమావేశ అధ్యక్షుడు?
ఎ) దాదాభాయ్‌నౌరోజీ బి) హ్యూమ్
సి) ఉమేష్‌చంద్ర బెనర్జీ డి) ఫిరోజ్‌షా మెహతా
27. కిందివాటిలో మాంటేగ్-ఛెమ్స్‌ఫర్‌‌డ సంస్కరణలకు సంబంధించింది?
ఎ) రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం
బి) కేంద్రంలో ఎగువ, దిగువ సభలను ఏర్పర్చడం
సి) కేంద్ర, రాష్ట్రాల శాసనాధికారాల విభజన
డి) బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే శాసనసభ్యుల హక్కులను పెంచడం
28. ‘లాలా లజపతిరాయ్’ ఏ ఉద్యమంలో మరణించారు?
ఎ) శాసనోల్లంఘన బి) సహాయ నిరాకరణ
సి) క్విట్ ఇండియా డి) సైమన్ వ్యతిరేక
29. సింధులోయ నాగరికత విలసిల్లిన కాలం?
ఎ) క్రీ.పూ. 2500-1500 బి) క్రీ.పూ. 2750-1500
సి) క్రీ.పూ. 2300-1750 డి) క్రీ.పూ. 3000-1750
30. హతిగుంఫా శాసనంలో ఏ శాతవాహన రాజు ప్రస్తావన ఉంది?
ఎ) మొదటి శాతకర్ణి బి) రెండో శాతకర్ణి
సి) గౌతమీపుత్ర శాతకర్ణి డి) యజ్ఞశ్రీ శాతకర్ణి
31. ‘నాగర’ అంటే?
ఎ) గ్రామ సభలు బి) నగర సభలు
సి) వర్తక శ్రేణులు డి) వృత్తి సంఘాలు
32. కిందివారిలో అందమైన చేతిరాత గల రాజు?
ఎ) అక్బర్ బి) ఔరంగజేబు
సి) అల్లావుద్దీన్ ఖిల్జీ డి) మహ్మద్‌బిన్ తుగ్లక్
33. వరంగల్‌లోని ‘పద్మాక్షి’ ఆలయ నిర్మాత?
ఎ) రుద్రమదేవి బి) పోలరాజు
సి) ప్రతాపరుద్రుడు డి) గణపతి దేవుడు
34. ‘ఆంధ్రభోజుడు’ బిరుదాంకితుడు?
ఎ) శ్రీకృష్ణ దేవరాయలు
బి) అల్లూరి సీతారామరాజు
సి) శ్రీనాథుడు డి) బమ్మెర పోతన
35. భారత రాష్ర్టపతికి అత్యవసర అధికారాలకు సంబంధించిన అంశాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు.?
ఎ) ఇంగ్లండ్ బి) జపాన్ సి) జర్మనీ డి) అమెరికా
36. భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన ప్రదేశం?
ఎ) బొంబాయి బి) కలకత్తా
సి) అహ్మదాబాద్ డి) న్యూఢిల్లీ
37. 51(ఎ) రాజ్యాంగ అధికరణ వేటి గురించి తెలుపుతుంది?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) ప్రాథమిక విధులు సి) ఆదేశిక సూత్రాలు
డి) కేంద్ర-రాష్ర్ట సంబంధాలు
38. నిర్బంధ ఉచిత విద్యా హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
ఎ) 84 బి) 85 సి) 86 డి) 88
39. రాష్ర్టపతి అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయసు ?
ఎ) 35 సంవత్సరాలు బి) 55 సంవత్సరాలు
సి) 58 సంవత్సరాలు డి) 30 సంవత్సరాలు
40. అతి తక్కువ కాలం ఉపరాష్ర్టపతిగా పనిచేసింది?
ఎ) వెంకట్రామన్ బి) వి.వి.గిరి
సి) పాథక్ డి) హిదయతుల్లా
41. లోక్‌సభకు సమిష్టిగా బాధ్యత వహించేది?
ఎ) పార్లమెంట్ సభ్యులు బి) కేంద్ర మంత్రిమండలి సి) ప్రధానమంత్రి డి) రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతి
42. {పధానమంత్రిగా పి.వి.నరసింహరావు పదవీకాలం?
ఎ) 1990-95 బి) 1991-96
సి) 1992-97 డి) 1990-96
43. రాజ్యసభ కాల పరిమితి?
ఎ) 5 సంవత్సరాలు బి) 6 సంవత్సరాలు
సి) 2 సంవత్సరాలు డి) పైవేవీకావు
44. {పాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత ఎవరిది?
ఎ) పార్లమెంట్ బి) ప్రధానమంత్రి
సి) సుప్రీంకోర్టు డి) రాష్ర్టపతి
45. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమించడమనేది?
ఎ) కార్యనిర్వహణాధికారం
బి) శాసనాధికారం సి) న్యాయాధికారం
డి) వివేచనాధికారం
46. జిల్లా పరిషత్తులో కో-ఆప్టెడ్ సభ్యుల సంఖ్య?
ఎ) 1 బి) 2 సి) 4 డి) 5
47. మండల పరిషత్తు ముఖ్య కార్యనిర్వాహక అధికారి?
ఎ) ఎంపీడీఓ బి) ఎంఆర్‌ఓ
సి) ఎంపీపీ డి) ఎంపీటీసీ
48. సంపాదిత ఆదాయం అంటే?
ఎ) సంపద నుంచి లభించే ఆదాయం
బి) స్థిరాస్తుల నుంచి లభించే ఆదాయం
సి) పని ద్వారా లభించే ఆదాయం
డి) ఇంటి అద్దె ద్వారా లభించే ఆదాయం
49. స్వేచ్ఛా మార్కెట్ ధోరణిని ప్రోత్సహించే ఆర్థికవ్యవస్థ?
ఎ) మిశ్రమ బి) కేంద్రీకృత
సి) పెట్టుబడిదారీ డి) సామ్యవాద
50. దారిద్య్ర రేఖను నిర్ణయించేది?
ఎ) ఆర్థిక సంఘం బి) ఆర్థికమంత్రిత్వ శాఖ
సి) జాతీయాభివృద్ధి మండలి
డి) ప్రణాళిక సంఘం
51. ‘నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం’ అంటే?
ఎ) పెట్టుబడి వ్యయం పెరగడం వల్ల సాధారణ ధరల స్థాయి స్థిరంగా పెరగడం
బి) యజమానులు తమ లాభాలను పెంచుకోవ డానికి సాధారణ ధరలను క్రమంగా పెంచడం
సి) ఉద్యోగుల వేతనాల వల్ల వస్తువుల సాధారణ ధరలు పెరగడం
డి) {పాథమిక, ద్వితీయ రంగాల మధ్య సంబంధాల వల్ల సాధారణ ధరలు స్థిరంగా పెరగడం
52. {పభుత్వ వ్యయానికి దోహదపడే నిధులను సమకూర్చేవి?
ఎ) ప్రభుత్వ ద్రవ్యం బి) పారిశ్రామిక ద్రవ్యం
సి) వ్యవసాయ ద్రవ్యం డి) పైవన్నీ
53. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక?
ఎ) 1 బి) 2
సి) నిరంతర డి) వార్షిక ప్రణాళిక
54. ఉక్కు తయారీకి ఉపయోగించే ఖనిజాలు?
ఎ) ఇనుము, అభ్రకం, బొగ్గు
బి) ఇనుము, మాంగనీసు, సున్నపురాయి
సి) ఇనుము, క్వార్‌‌ట్జ, రాతినార
డి) ఇనుము, కోబాల్ట్, ఖాండలైట్
55. ఆర్థికాభివృద్ధి అంటే?
ఎ) ఆర్థిక వృద్ధి బి) దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి
సి) ఆర్థిక ప్రగతి డి) నిర్మాణాత్మక ఆర్థిక మార్పు
..............
సమాధానాలు
1) సి; 2) ఎ; 3) డి; 4) సి; 5) బి;
6) ఎ; 7) డి; 8) బి; 9) సి; 10) డి;
11) ఎ; 12) బి; 13) సి; 14) డి; 15) బి;
16) డి; 17) ఎ; 18) సి; 19) డి; 20) డి;
21) ఎ; 22) బి; 23) ఎ; 24) సి; 25) బి;
26) సి; 27) ఎ; 28) డి; 29) సి; 30) బి;
31) సి; 32) డి; 33) బి; 34) ఎ; 35) సి;
36) డి; 37) బి; 38) సి; 39) ఎ; 40) బి;
41) బి; 42) బి; 43) డి; 44) సి; 45) ఎ;
46) బి; 47) ఎ; 48) సి; 49) సి; 50) డి;
51) డి; 52) ఎ; 53) ఎ; 54) బి; 55) సి;

No comments:

Post a Comment