మొబైల్ ప్లాన్ వెతికిపెడుతుంది!
దేశంలో
దాదాపు 80 కోట్ల మంది మొబైల్‌ఫోన్ యూజర్లు ఉన్నారు. వీరందరినీ తమవైపు
తిప్పుకునేందుకు టెలికాం కంపెనీలు రకరకాల స్కీమ్‌లతో ప్రచారం చేస్తూంటాయి.
అయితే వీటిల్లో మనకు బాగా ఉపయోగపడేది ఏది? చాలా సందర్భాల్లో ఈ మెరుగైన
ప్లాన్‌ను వెతుక్కోవడంలోనే సమయమంతా వృథా అవుతూంటుంది. ఈ ఇబ్బందిని
తప్పించేందుకు అందుబాటులోకి వచ్చింది... ప్లాన్‌హౌండ్ ఆండ్రాయిడ్
అప్లికేషన్. దేశంలోని అన్ని కంపెనీలు ఆఫర్ చేస్తున్న స్కీమ్‌లలో
కాల్‌రేట్లు ఎంత? రోమింగ్ ఛార్జిలేమిటి? వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని
మన ముందు ఉంచుతుంది ఈ అప్లికేషన్. వాటిల్లో మనకు కావాల్సినదాన్ని ఎంచుకోవడం
సులువే కదా!
మీ ఫోన్... మీ భాష... మీ పత్రికలు! 
ఆండ్రాయిడ్
స్మార్ట్‌ఫోన్ల రంగ ప్రవేశంతో దాదాపు ప్రతి విషయానికీ ఓ అప్లికేషన్
అందుబాటులోకి వచ్చిందంటే అతిశయోక్తి కాదేమో. మీ మాతృభాషలోని వార్తా
పత్రికలూ ఇందుకు మినహాయింపు కాదు. ఆండ్రాయిడ్ మార్కెట్‌లో ఇండియన్
న్యూస్‌పేపర్స్ అని టైప్ చేసి ఇదే పేరుతో కనిపించే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్
చేసుకోండి. దీన్ని రన్ చేసినప్పుడు అనేక వార్తాపత్రికలు మీకు కనిపిస్తాయి.
వాటిల్లో అవసరమైన వాటితో జాబితా సిద్ధం చేసుకోండి... ఎప్పుడు కావాల్సినా
అప్పుడు... ఎక్కడైనా మీకిష్టమైన వార్తాపత్రికలను చదువుకోండి.
- అనిల్ అట్లూరి,
CuttingEdge@AnilAtluri.com
No comments:
Post a Comment