Monday, July 2, 2012

జాతకాలు

జూలైలో జన్మిస్తే సున్నితమైన మనస్తత్వం కలిగివుంటారట!
మంగళవారం, 26 జూన్ 2012( 16:14 IST )
Webdunia
July
FILE
జూలైలో జన్మించిన జాతకులు సున్నితమైన మనస్తత్వం కలిగి సహజంగా ప్రతి విషయంలోను ఆవేశం పొందుతుంటారు. కుటుంబంనందు ప్రీతి, మిత్ర వాత్సల్యం, దైవభక్తి కలిగి మాతృసేవా తత్పరులగుదురు. ప్రకృతి సౌందర్యములందు ప్రీతి కలిగివుంటారు. వీరికి జీవితంలో ఒడిదుడుకులు తప్పవు.

ఉత్తమ వంశములందు జన్మించి విద్యా, వినయ, ధన సంపదలు గల వారయ్యెదరు. వీరిది క్షణిక కోపము. హృదయము చాలా మంచిది. దయ, కారుణ్యము, ప్రేమ, వాత్సల్యము వీరికి సహజ గుణములు. ఒకరు చెప్పినట్లు నడుచుకొనుట వీరికి గిట్టదు. స్వతంత్ర భావములు మెండు. పొగడ్తలకు పొంగిపోదురు. ఇతరుల మనోగత విషయములను తెలిసికొనగల నేర్పరులై సమస్త కార్యములందు కార్యసాధకులు కాగలరు.

వీరికి ఆలోచనలు ఎగుడు దిగుడుగా సాగి అటుపిమ్మట అదృష్ట వంతులు కాగలరు. ధనార్జన యందు, కుటుంబ విషయములందు తీరిక లేనివారై యుండగలరు. కుటుంబ సమస్యల యందు జయము కలుగును. ఏ కార్యమునైనను కష్టపడి నిర్వహింపగలరు. వ్యాపారము నందు అనుకూలత తక్కువ. వీరి మనసులోని ఉద్దేశ్యములను త్వరగా వెల్లడి చేయలేరు. చారిత్రక సంఘటనలు, వీరోచితమైన కథలు, పురాణములంటే వీరికి అభిమానము.

వీరికి సుమారు 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల్లో అదృష్టము కలిసి వస్తుంది. 38 సంవత్సరము నుంచి బాగా అభివృద్ధికరంగా ఉంటుంది. తేలికగా జీర్ణించే పదార్థాలను వాడుతుండాలి. మాంసాహారము ఆరోగ్యానికి అంతగా సరిపడదని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment