Tuesday, July 10, 2012

కూల్ వెబ్‌సైట్స్



కూల్ వెబ్‌సైట్స్
ఇంగ్లీషును సులువుగా నేర్చుకోవచ్చు

మీ పిల్లలు ఇంగ్లీషులో కొంచెం వీకా? ట్యూషన్ పెట్టిస్తున్నారా? దాంతోపాటే ఈ వెబ్‌సైట్‌ను ట్రై చేయండి. వికిపీడియా వంటి సమాచార భాండాగారానికి రూపకల్పన చేసిన లారీ సాంగర్ చేతిలో రూపుదిద్దుకున్న ఇంగ్లీష్ టీచింగ్ వెబ్‌సైట్ ఇది. ఉచ్ఛారణతోపాటు స్పెల్లింగ్‌లను నేర్చుకునేందుకు ఈ వెబ్‌సైట్‌లో ఆడియా, వీడియో ఫైళ్లు కూడా ఉన్నాయి. ఒకసారి రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయిపోతే చాలు... ఆ తరువాత క్విజ్‌ల రూపంలో ఇంగ్లీషును సులువుగా నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి వెబ్‌సైట్‌లో 14 ప్రెజెంటేషన్లు మాత్రమే ఉన్నాయి. త్వరలో మరిన్ని చేర్చనున్నారు.
యూఆర్‌ఎల్: www.read-in-gbear.org
ఇలాంటిదే మరికొన్ని: Alphabetimals, Funnix, MeeGenius, StoryLineOnline, ePubBud, Librophile, AudioOwl and BooksInMyPhone.

గజిబిజికి ఫుల్‌స్టాప్

మీకు ఈ బుక్స్ అంటే చాలా ఇష్టమా? అయితే ఇప్పటికే చాలా పుస్తకాలను డౌన్‌లోడ్ చేసే ఉంటారు. వాటిల్లో ఏది ఎక్కడుందో మీకు తెలుసా? అబ్బే కష్టమంటున్నారా? అయితే అ MyBooks వెబ్‌సైట్ మీ కోసమే. డెస్క్‌టాప్ అప్లికేషన్‌గా లభించే ఈ సాఫ్ట్‌వేర్‌తో మీ పీసీలోని అన్ని ఈ-బుక్స్‌ను చక్కగా సర్దుకోవచ్చు. దాదాపు అన్ని రకాల ఈ-బుక్ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది సాఫ్ట్‌వేర్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనూ పనిచేయగల ఆల్‌మైబుక్స్ ఫుల్ వెర్షన్ కావాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నెలరోజుల ట్రయల్ మాత్రం ఉచితమే.
యూఆర్‌ఎల్: http://www.bolidesoft.com /allmybooks.html


ట్విట్టర్‌తో ఛాటింగ్ ఆనందం...

యాహూ, ఎంఎస్‌ఎన్, జీమెయిల్ వంటి అన్ని రకాల పోర్టళ్లలో ఛాటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి కానీ పొట్టి సందేశాల సర్వీసు ఇచ్చే ట్విట్టర్‌లో మాత్రం సాధ్యం కాదు. అయితే బ్లిథర్ వెబ్‌సైట్‌తో దీన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. ట్విట్టర్ ఫ్రెండ్స్‌తో నేరుగా ఛాటింగ్ చేసేందుకు వీలుకల్పించే ఈ ప్రోగ్రామ్ పూర్తిగా ఉచితమే. గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఏకకాలంలో అనేకమందితో మాట్లాడటమూ సాద్యమే. మీ ట్విట్టర్ అకౌంట్‌లోకి ప్రవేశించేందుకు అనుమతించడం ఆలస్యం... ఛాటింగ్ మొదలుపెట్టవచ్చు.
యూఆర్‌ఎల్: http://-w-ww.blether.co/
ఇలాంటిదే మరికొన్ని: Bonfire, TodaysMeet and Tagch.at.

No comments:

Post a Comment