Friday, July 6, 2012

టైగర్ పిల్లినాయుడు..



టైగర్ పిల్లినాయుడు...
గొప్ప ఈస్ట్‌మన్ కలర్ చిత్రం
డ్యామేజీ ఫిల్మ్ సిటీ నుంచి సోమోజీరావు ఉన్నపళంగా తన ‘ఏనాడు’ పత్రిక ఆఫీసుకు వచ్చాడు. ఆయన కారు దిగి గేటు దగ్గరికి రాగానే-
‘‘డ్రస్ అచ్ఛా హై సాబ్’’ అంటూ సెల్యూట్ కొట్టాడు సెక్యూరిటీ ఆఫీసర్.
‘‘గుడ్ మార్నింగ్ సార్... మీ డ్రస్ ఇవ్వాళ బాగుంది’’ అన్నది రిసెప్షనిస్ట్.
‘‘మీ డ్రస్ అదిరిపోయింది సార్’’ అన్నాడు హౌజ్‌కీపింగ్ కుర్రాడు.
వారి ప్రశంసలను స్వీకరిస్తూనే సమావేశ మందిరానికివచ్చి ముఖ్యమైన రిపోర్టర్లు, సబ్‌ఎడిటర్లను పిలిచి అర్జెంటు మీటింగ్ పెట్టాడు సోమోజీ.
‘‘ఏమిటయ్యా ఇది!’’ అంటూ చేతిలో ఉన్న ఇండియాటుడే మ్యాగజైన్‌ను విసిరికొట్టాడు.
‘‘ఆయన గురించి గొప్పగా రాశారు సార్’’ అన్నాడు ఒక సీనియర్ సబ్ ఎడిటర్ అద్దాలు సరిచేసుకుంటూ.
ఇంతలో జూనియర్ సబ్ ఎడిటర్ ఒకరు సోమోజీ వైపు చూసి ‘‘సార్... అండర్...’’ అనబోయాడు.
సీనియర్ సబ్ ఎడిటర్ జూనియర్ కాలు తొక్కడంతో అతను ఏమీ చెప్పకుండా ఆగిపోయాడు.
‘‘ఏం చేస్తున్నారయ్యా మీరంతా? మనం విమర్శిస్తున్నా సరే అతను హీరో అయిపోతున్నాడు. మరింత ఘాటుగా విమర్శించాలి’’ అన్నాడు సోమోజీ.
‘‘సార్... మన పేపర్లో ప్రతి పేజీలో, ప్రతి వార్తలో అతనే. రోజూ ఎడిట్ పేజీలో అతని మీద పనికిమాలిన సెటైర్లు రాస్తూనే ఉన్నాం. ఇంకేం చేయమంటారు సార్’’ బాధగా అన్నాడు సీనియర్ రిపోర్టర్ రెండు చేతులూ కట్టుకుంటూ.
ఈలోపు జూనియర్ రిపోర్టర్ ఒకరు సోమోజీ వైపు చూస్తూ...
‘‘సార్...అండర్...’’ అనబోయాడు.
సీనియర్ రిపోర్టర్ అతని కాలు తొక్కడంతో ఏమీ చెప్పకుండానే ఆగిపోయాడు.
‘‘నెలనెలా జీతాలు తీసుకుంటున్నారు కదా? హీరోను విలన్ చేయడం చేతకాదా? ఎంతమంది హీరోలను మన పేపర్లలో విలన్‌లను చేయలేదు? ఆంధ్రుల అభిమాన హీరో రామారావునే చంద్రబాబు కోరిక మేరకు మన పేపర్లలో విలన్‌ను చేసేశాం. ఆ కృతజ్ఞతతో నన్ను హీరోగా పెట్టి టైగర్ నాయుడు అనే సినిమా తీస్తాను అని కూడా బాబు చెప్పాడు. పులిలాంటి నన్ను ఆ కుర్రాడు పిల్లిని చేస్తున్నాడు’’ అసహనంగా, కోపంగా అన్నాడు సోమోజీ.
‘‘సార్...అండర్...’’ అనబోయాడు మరో కుర్ర జర్నలిస్ట్.
సోమోజీకి చర్రుమని కోపం వచ్చింది....
‘‘అప్పటి నుంచి చూస్తున్నాను... నేనొకటి మాట్లాడుతుంటే ఈ కుర్రాళ్లు ఒకటి మాట్లాడుతున్నారు... అండర్... అండర్ అంటున్నారు. ఏమిటయ్యా అండర్?’’ అని తన ముందు వినయంగా నిల్చున్న కుర్ర జర్నలిస్ట్‌ను గద్దించాడు సోమోజీ. ఆ కుర్రాడు గజగజ వణుకుతూ-
‘‘సార్... మీరు ప్యాంట్ వేసుకోవడం మరిచారు. అండర్‌వేర్ మీదే ఆఫీసుకు వచ్చారు’’ అన్నాడు.
తనను తాను చూసుకొని కెవ్వుమని అరిచాడు సోమోజీ! అప్పటికప్పుడు పాత న్యూస్‌ప్రింట్‌ను చుట్టుకొని సీట్లో కూర్చున్నాడు.
‘‘ఇంతకూ ప్యాంటేసుకోవడం ఎందుకు మరిచారో?’’ రహస్యంగా అడిగాడు ఓ సబ్‌ఎడిటర్.
‘‘ధ్యాసంతా యువనేత పైనే. ఏం కూసినా, ఎంత రాసినా ఆయనకు పెరుగుతున్న పాపులారిటీ పైనే. ఇక ప్యాంటేం గుర్తుంటుంది’’ గొణిగాడు అతడి కొలీగ్.
‘‘వేసుకోవడం మరిచారో... ఇండియాటుడే చూశాక జారిపోయిందో?’’ మరో సబెడిటర్ సెటైర్.
‘‘ఆఫీసులో ఇంతమంది ఉన్నారు. ఒక్కరు కూడా ఈ వాస్తవాన్ని నాకెందుకు చెప్పలేదు? పైగా డ్రెస్ బాగుంది అంటారా? నిన్నగాక మొన్న కొత్తగా చేరిన ఈ కుర్రాడు చెబితే తప్ప నాకు అసలు విషయం తెలియలేదు. నాన్సెన్స్... ఏమిటిదంతా?’’ అని సీనియర్ల వైపు చూసి కన్నెర్ర చేశాడు సోమోజీ.
‘‘ఈనాడైనా ఏనాడైనా వాస్తవాలు చెప్పనిచ్చారా? ఒకవేళ చెప్పినా మీకు నచ్చి చచ్చిందా? మీకు నచ్చిందే మేము చేయాలని... అలా చేస్తేనే ఉద్యోగం భద్రంగా ఉంటుందని...’’ తాత్వికంగా చెప్పుకుంటూ పోతున్నాడు సీనియర్ రిపోర్టర్.
‘‘అది సరేలేవోయ్... లేటెస్ట్ న్యూస్ ఏంటీ?’’ అడిగాడు సోమోజీ.
‘‘నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. అవి ఇంకా మన రాష్ట్రానికి రాలేదు. ఇదే సార్ లేటెస్ట్ న్యూస్’’ చెప్పాడు సీనియర్ సబ్ ఎడిటర్.
‘‘రాష్ట్రానికి నైరుతి రాకుండా యువనేత భారీ కుట్ర పేరుతో ఫ్రంట్ పేజీలో పెద్ద వార్త రాయండీ..’’ ఆదేశించాడు సోమోజీ.
ఈ దెబ్బతో అక్కడున్న రిపోర్టర్లకు, సబ్‌ఎడిటర్లకు హోల్‌సేల్‌గా మతి చలించింది.
‘‘నీకో దండం... నీ పత్రికకో దండం’’ అంటూ ఎవరి ఊళ్లకు వాళ్లు పారిపోయి పత్తి వ్యాపారం చేసుకుంటూ కాలి మీద కాలేసుకొని పిల్లాపాపలతో సుఖంగా జీవించడం ప్రారంభించారు.

సామాన్య జనాన్ని ఆకట్టుకోగల మేటి నాయకు లలో ఒకరుగా, ప్రసిద్ధ ఎన్.టి.రామారావుతో పోల్చదగిన జననేతగా జగన్ ఎదిగారు.

No comments:

Post a Comment