Friday, July 6, 2012

ఫైర్‌ఫాక్స్‌కు గూగుల్ క్రోమ్ చెక్!

ఫైర్‌ఫాక్స్‌కు గూగుల్ క్రోమ్ చెక్!




ఇంటర్నెట్ బ్రౌజర్ల రంగంలో ఎక్స్‌ప్లోరర్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ రెండోస్థానం కోసం పోటీ అంతకంతకూ తీవ్రతరమవుతోంది. నిన్నమొన్నటి దాకా ఈ స్థానంలో కొనసాగిన మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌కు గూగుల్ క్రోమ్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. వెబ్‌సైట్‌ల విశ్లేషణ చేసే స్టాట్ కౌంటర్ తాజా లెక్కల ప్రకారం క్రోమ్ మార్కెట్ షేర్ ఫైర్‌ఫాక్స్‌ను అధిగమించి 25.69 శాతానికి చేరుకుంది. దాదాపు 40.63 శాతం మార్కెట్ షేర్‌తో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తొలిస్థానంలో కొనసాగుతోంది. మూడేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన గూగుల్ క్రోమ్ అతితక్కువ కాలంలో రెండోస్థానానికి ఎదగడం విశేషమే మరి!

No comments:

Post a Comment