Monday, July 2, 2012

ారోగ్యపు చి్ట్కా

రాత్రిపూట పాలు, భోజనాంతంలో మజ్జిగ తాగితే..!?
బుధవారం, 27 జూన్ 2012( 17:12 IST )
Webdunia
Milk
FILE
రాత్రిపూట తెల్లగా తోమిన చొక్కమైన రాగి చెంబులో నీటిని నింపి రాగిపళ్ళెం మూత బెట్టి ఉషఃకాలంలో తాగినందువల్ల పొట్టజబ్బులు బాగవుతాయని, తలనొప్పి తగ్గిపోతుందని, వాతపిత్తకఫదోషాలు తొలగిపోతాయి.

రాగిచెంబు తరహాలో బంగారుపాత్ర నీరు తాగడం ఉత్తమం. మట్టిపాత్రలో నీటిని తాగడం ఆరోగ్యప్రదం. రాగిపాత్ర సర్వవ్యాధి నివారకమని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు. స్టెయిన్ స్టీల్ అన్నిటికంటె మట్టిపాత్రలో నీటిని తాగడం మంచిది.

ఉషఃకాలములో నీటిని తాగినా, రాత్రిపూట పాలను తాగినా, భోజనాంతంలో మజ్జిగ తాగినా డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరముండదు. అంటే జబ్బులేవీ రావు. వేకువనే నీటిని తాగినా, రాత్రిపూట పాలను తాగినా చూపు బాగుంటుంది. తలవెంట్రుకలు నెరియవు. శరీరం ముడతలు పడదు. ఆయాసం మొదలైన జబ్బులెన్నో బాగవుతాయి. అజీర్ణ వ్యాధులు దూరమవుతాయి

No comments:

Post a Comment