Monday, July 2, 2012

just know it

ఎవరో మీపై అధికారి ఎందుకు అయ్యారు..?
శనివారం, 30 జూన్ 2012( 22:08 IST )
Webdunia
PR
ఎవరో మీపై అధికారి ఎందుకు అయ్యారు..? మీకంటే కొన్ని ఎక్కువ అర్హతలు ఉన్నాయి కనుక. అతనికంటే నేనే నయం అని మీరు అనుకోవచ్చు. కానీ అతడు ఆ స్థానానికి ఎలా చేరాడు? అర్హతో, సమర్థతో, పలుకుబడో, ఏదో ఒకటి అతనిని అక్కడకు చేర్చింది. ఏదో ఒక విషయంలో అతడు అక్కడికి చేరాడు. " ఏం కాదు. అవినీతి వల్లనే అతడు ఆ స్థానానికి చేరాడు". సరే, అవినీతిని ఉపయోగించుకోవడంలో అయినా అతడు మీకన్నా సమర్థుడు అనేకదా. ఉన్న సామాజిక పరిస్థితులలో, ఏదో ఒక రీతిలో అతడు మీకన్నా ఎక్కువ సమర్థుడు. అందువల్లనే అతడు ఆ స్థానానికి చేరుకోగలిగాడు.

అతడు ఆ స్థానానికి చేరాడు కాబట్టి, అతడు ఎక్కువ సమర్థుడు కాబట్టి, అతడు అన్నీ సక్రమంగా చేస్తాడు అని అర్థం కాదు. అలాగే మీరు కూడా అన్నీ సక్రమంగా చేయలేరు. ప్రపంచంలో ఎవ్వరూ, అన్నీ సక్రమంగా చేయలేరు. సాధారణంగా చెప్పాలంటే అతడు మీకంటే ఎక్కువ విషయాలు సక్రమంగా చేసే వ్యక్తి. అతడు ఏ సందర్భాన్ని అయినా మీకంటే బాగా ఆకళింపు చేసుకోగల వ్యక్తి, అందుకే అతడు ఆ స్థానానికి చేరాడు.

చాలా బాగా టైప్ చేయగల ఓ స్టెనోగ్రాఫర్ ఉన్నారనుకోండి. వాళ్ల పై అధికారి కనుక నేనే టైప్ చేస్తానని కూర్చుంటే, ఆయన టైపింగ్ బాగా చేయలేకపోవచ్చు. కానీ ఆయనే అధికారి. అపుడు స్టెనోగ్రాఫర్... " ఈ మనిషి సరిగ్గా టైప్ కూడా చేయలేడు. ఇతను నాకు అధికారి ఏమిటి?" అని అనుకోవచ్చు. మీకంటే బాగా టైప్ చేస్తాడు కాబట్టి అతను మీకు అధికారి అవలేదు. టైపింగ్ గురించి అతనికి ఒక్క ముక్క కూడా తెలియకపోవచ్చు. కానీ మీకు తెలియని ఎన్నో విషయాలు, అతనికి తెలుసు. అందుకే అతను మీకు అధికారి. కొన్ని విషయాలు అసలు ఉంటాయని కూడా మీకు తెలియకపోవచ్చు.

అంటే అతను మీకు అధికారి అవటం అనే విషయం. కొంత సమర్థతతో, కొంత సమగ్ర దృష్టితో కూడి ఉంది. అధికారి అనేవాళ్లకి, అన్ని వేళలా, ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉండక్కర్లేదు. కానీ అన్నిటిపట్ల ఒక సమగ్ర దృష్టి ఉండాలి. మనుషులను కలిపి ఉంచడం, పనులు జరిపించడం ఈ పద్ధతి అతనికి తెలుసు. వ్యక్తిగతంగా మీరు మంచివారే కావచ్చు. కానీ అనేక విషయాలను కలిపి నిర్వర్తించటంలో మీకు సమర్థత లేకపోవచ్చు.

కాబట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా, మీపై అధికారి మీద కినుక పెట్టుకోకండి. మీ ఉద్యోగం మీరు బాగా నిర్వర్తించండి. ఎంత బాగా అంటే... మీరు లేకుండా, మీ అధికారి కానీ, మీ సంస్థ కానీ నడవలేనంత బాగా. వాళ్లు మిమ్మల్ని వదులుకోలేని రీతిలో మీరు రూపొందండి. ఈ వదులుకోలేని అవసరంతోనే మీకు శక్తి వస్తుంది.

" ఇతడొక తెలివి తక్కువవాడు, ఇతని వద్ద నేనెందుకు పనిచేయాలి" అని గింజుకుంటూ మీరు సంపూర్ణంగా పనిచేయరనుకోండి. అపుడు మీరు ఉపేక్షించదగ్గ వారిగా అయిపోతారు. ఏ సమయంలోనయినా సంస్థ మిమ్మల్ని తీసివేయవచ్చు. లేదా మీ అధికారి మిమ్మల్ని తొలగించవచ్చు. అందుకని మీరు ఎలా పనిచేయాలంటే, అతడు మీరు లేకుండా ఉండలేనట్లు. మీ ఉపయోగం ఎంత ఉండాలంటే, మీరు లేకుండా అతడు పని చేయలేనట్లు. ఎదగడానికి ఇదే మార్గం. ఎవరి గురించో ఆరోపిస్తూ ఉంటే, ఎప్పటికీ మీరు ఎదగలేరు.
మీరు మీ ఉద్యోగం ఎంత బాగా చేయాలంటే..?
మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా, మీపై అధికారి మీద కినుక పెట్టుకోకండి. మీ ఉద్యోగం మీరు బాగా నిర్వర్తించండి. ఎంత బాగా అంటే... మీరు లేకుండా, మీ అధికారి కానీ, మీ సంస్థ కానీ నడవలేనంత బాగా.


అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తులు, తమకి ఎవరి మీదనో కినుక ఉండటం వల్ల అలా ఎదగలేదు. తమ అత్యున్నత ప్రతిభ కనబరిచారు కాబట్టి ఎదిగారు. మనం మన అత్యుత్తమ స్థాయిలలోనే పనిచేస్తాం. కానీ నా అత్యత్తమ స్థాయి, మీ అత్యుత్తమ స్థాయి ఒకే కొలతలో ఉండవు. మన శక్తియుక్తులను బట్టే మనం ఎదుగుతాము. మీరు అస్తమానం ఎవరితోనో పోల్చుకుంటూ, ఎవరితోనో సరిచూసుకుంటూ ఉన్నారనుకోండి. మీరు ఎక్కడికి వెళ్లినా, మీపై ఇంకొకరు ఎవరో ఉంటూనే ఉంటారు. మీరు ఇది తెలుసుకుంటే మంచిది. మీరు ఎంత పెద్దవారు అయినా, మీపైన వేరే ఇంకొకరు ఉంటారు. ఇలా ఎప్పటికీ మీకు ఒక కినుక ఉంటూనే ఉంటుంది. అతడు నా అంత మంచివాడేమీ కాదు, ఐనా అంత స్థాయికి ఎదిగిపోయాడు - అని మీరు ఎప్పటికీ తలపోస్తూనే ఉంటారు. ఇలా, ఎక్కడ ఉన్నా, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూనే ఉంటారు.

ఏ సందర్భంలోనైనా, నూటికి నూరు శాతం మీరు చేయగలగింది మీరు చేయండి. అంతే. అపుడు మీ సంస్థకు, మీ పైఅధికారికి, అసలు మొత్తం ఆ సందర్భానికే- మీరు విడదీయలేని అనవసరంగా నిలుస్తారు. ఈ విధంగానే మీరు ఎదుగుతారు. అతనికంటే మీకే ఎక్కువ సమర్థత ఉంటే, సంస్థ అతనిని ఎందుకు అధికారిగా ఉంచుతుంది? ఎలాగైనా మిమ్మల్నే అధికారిగా చేస్తుంది.

No comments:

Post a Comment