Tuesday, July 3, 2012

బ్లాగుల గురించి సందేహాలు

నేను లిప్యంతరీకరణ ఫీచర్‌ను ఎలా ఉపయోగించగలను?
రోమన్ అక్షరాలని రోమన్ కానటువంటి హిందీ, గ్రీకు, రష్యన్ మరియు ఇతర భాషలలో ఉపయోగించే అక్షరాలుగా మార్చడానికి ఒక స్వయంచాలక లిప్యంతరీకరణ ఎంపికను బ్లాగర్‌ అందిస్తుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చెయ్యడానికి సెట్టింగులు | ప్రాథమిక పేజీకి వెళ్ళి, లిప్యంతరీకరణ ఎంపిక కోసం "అవును" ఎంచుకోండి. ఈ సెట్టింగ్ మీ ఖాతాలోని అన్ని బ్లాగులపై ప్రభావం చూపుతుంది.
బ్లాగర్‌ యొక్క పోస్ట్ ఎడిటర్‌ను నేను ఎలా ఉపయోగించాలి?
బ్లాగర్‌ యొక్క పోస్ట్ ఎడిటర్‌లో మూడు మోడ్లు ఉన్నాయి:
  • సృష్టించండి: మీరు ఆకృతీకరణ బటన్లతో టెక్స్ట్‌ను నియంత్రించే ఒక WYSIWYG ("What you see is what you get") విధానం
  • HTMLను సవరించు: మీరు HTML ను మాన్యువల్‌గా సవరించగల ప్రత్యేక మోడ్.
  • పరిదృశ్యం: పోస్ట్ శీర్షిక, లింక్‌లు మరియు చిత్రాలతో సహా పోస్ట్ యొక్క పూర్తి పరిదృశ్యంను చూపుతుంది.
ఈ మోడ్ల మధ్య మారడానికి, సరైన లింక్‌పై క్లిక్ చెయ్యండి. ఫార్మాటింగ్ బటన్లు ప్రత్యేక బ్రౌజర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఫీచర్‌లు, ఎడమ నుండి కుడి:
  • ఫాంట్
  • ఫాంట్ పరిమాణం
  • లావుగా
  • ఇటాలిక్
  • ఫాంట్ రంగు
  • లింక్
  • ఎడమకు-జస్టిఫై
  • మధ్య
  • కుడికి-జస్టిఫై
  • పూర్తిగా-జస్టిఫై
  • క్రమ (అంకెలున్న) జాబితా
  • క్రమం లేని (బులెట్ ఉన్న) జాబితా
  • బ్లాక్కోట్
  • అక్షర క్రమ తనిఖీ
  • చిత్రాన్ని అప్‌లోడ్ చెయ్యి
  • ఎంపిక నుండి ఫార్మాటింగ్ను తొలగించు
నేను నా బ్లాగులో కస్టమ్ డొమేన్‌‌‌ను ఎలా ఉపయోగించగలను?
మీరు మీ బ్లాగు చిరునామాలో blogspot.comను ఉంచుకోవడం గురించి శ్రద్ధ లేకపోతే, మీ స్వంత డొమేన్‌‌‌ను పొందవచ్చు. మేము ఇంతకు ముందు లాగ మీ మొత్తం కంటెంట్‌ను హోస్ట్ చేస్తాము, కానీ అది మీ క్రొత్త చిరునామాలో ప్రదర్శించబడుతుంది. దీనిని సెట్ చెయ్యడానికి మూడు భాగాలు ఉన్నాయి:

మీ డొమేన్‌‌

ముందుగా మీరు mysite.com వంటి ఒక డొమేన్‌‌ పేరును ఎంచుకుని మరియు దానిని నమోదు చెయ్యాలి. మీరు అనేక సంఖ్యలో వేర్వేరు రిజిస్ట్రార్ల నుండి డొమేన్‌‌ పేర్లను రిజిస్టర్ చెయ్యవచ్చు.

DNS సెట్టింగులు

తర్వాత, ghs.google.comతో మీ డొమేన్‌‌ అనుబంధమైన DNSతో మీ డొమేన్‌‌ కోసం ఒక CNAME రికార్డ్‌ను మీరు సృష్టించాలి. దీన్ని చేసే సరైన విధానం మీ డొమేన్‌‌ రిజిస్ట్రార్ ఆధారంగా విభిన్నంగా ఉంటుంది, కనుక దయచేసి మీ రిజిస్ట్రార్‌ను నేరుగా సంప్రదించండి వారు మీకు సహాయం చేస్తారు. క్రొత్త DNS నమోదు వెంటనే ప్రభావితం కానందువల్ల దయచేసి సహనంతో ఉండండి.

బ్లాగర్‌ సెట్టింగులు

ఈ సమయంలో, ఇతరులు మీ బ్లాగును చూడాలనుకున్నప్పుడు వారిని Googleకు మళ్లించడం DNS సర్వర్లకు తెలుసు. కాబట్టి, మీ డొమేన్‌‌‌తో సరైన బ్లాగును Google అనుబంధించి ఉందో లేదో అని మేము నిర్ధారించుకోవాలి. మీరు దీన్ని బ్లాగర్‌లో మీ బ్లాగు కోసం సెట్టింగులు | ప్రచురణ టాబ్‌లో చేస్తారు. మీరు Blogspotలో ప్రచురిస్తుంటే, మిమ్మల్ని కస్టమ్ డొమేన్‌కు మారమని ప్రతిపాదిస్తూ పైన ఒక లింక్‌ను చూస్తారు. కొనసాగి, ఆ లింక్‌పై క్లిక్ చెయ్యండి. Blogspot చిరునామా సెట్టింగ్ ఇప్పుడు మీ డొమేన్‌‌‌‌కు మారుతుంది. ఈ ప్రాసెస్ ప్రారంభంలో మీరు రిజిస్టర్ చేసిన డొమేన్‌‌‌లో పూర్తి చేసి, మీ సెట్టింగులను సేవ్ చెయ్యండి.

గమనికలు:

  • మీ క్రొత్త డొమేన్‌‌ మిమ్మల్ని మీ బ్లాగుకు తీసుకెళ్లకపోతే, అన్ని DNS సర్వర్లు అప్‌డేట్ చెయ్యబడ్డాయా లేదా అని నిర్ధారించడానికి ఒకటి, రెండు రోజులు వేచి ఉండండి. అది ఇంకా పనిచేయకపోతే, మీరు DNS సెట్టింగులను సరిగ్గా ఎంటర్‌ చేసారో లేదో నిర్ధారించడానికి మీ రిజిస్ట్రార్‌‌ను సంప్రదించండి.
  • మీ అసలు Blogspot చిరునామా మీ క్రొత్త డొమేన్‌‌‌‌కు స్వయంసిద్దంగా ఫార్వార్డ్ చెయ్యబడుతుంది. ఆ విధంగా, మీ సైట్‌కు ఇప్పటికే ఉన్న ఏదైనా లింక్‌లు లేదా బుక్‌మార్క్‌ ఇంకా పనిచేస్తాయి.
  • మీరు ఈ లక్షణంను డొమేన్‌‌‌‌లతో (ఉదా. mysite.com) లేదా సబ్డొమేన్‌‌‌‌లతో (ఉదా. name.mysite.com) ఉపయోగించవచ్చు. కాని, మీరు సబ్ డైరెక్టరీలను (ఉదా. mysite.com/blog/) లేదా వైల్డ్‌కార్డ్‌లను (ఉదా. *.mysite.com) పేర్కొనలేరు.
నా బ్లాగు కోసం కస్టమ్ డొమేన్‌‌ పేరును ఎక్కడ కొనుగోలు చెయ్యగలను?
సెట్టింగ్‌లు | ప్రచురించడం టాబ్ ద్వారా మా నుండి కొనడం ఒక సులభమైన పద్దతి. కాని, మీరు డొమేన్‌లను కొనడానికి సాధారణ మరియు సబబైన తక్కువ వార్షిక ఫీజులతో చాలా కంపెనీలు కలవు. డొమేన్ రిజిస్ట్రార్ కోసం Googleలో శోధిస్తే, అది అనేక ఎంపికలను చూపుతుంది. మీరు ఈ జాబితాను ఉపయోగించి కూడా షాపింగ్ చెయ్యవచ్చు:

No comments:

Post a Comment