Tuesday, July 3, 2012

బ్లాగులు గురించి సందేహాలు

నేను ఒక బ్లాగర్ ఖాతాను ఎలా సృష్టించగలను?
బ్లాగర్ హోమ్ పేజీ వద్ద , "మీ బ్లాగు ఇప్పుడే సృష్టించండి"ను క్లిక్ చెయ్యండి మరియు Google ఖాతాను సృష్టించండి. మీరు ఇంతకు ముందే Google ఉత్పత్తులైన orkut, Google గుంపులు, Gmail, మరియు ఇతరాలు ఉపయోగించి ఉంటే మీరు ఇప్పటికే Google ఖాతాను కలిగి ఉన్నారని గమనించండి.- అలానే ఐతే సైన్ ఇన్ చెయ్యండి. తర్వాత, మీ ప్రదర్శిత పేరును ఎంచుకోండి మరియు బ్లాగర్ యొక్క సేవా నిబంధనలను అంగీకరించండి. ఒకసారి అది మొత్తం సెట్ అయ్యాక, మీరు బ్లాగింగ్‌ను ఆరంభించడానికి సిద్దంగా ఉంటారు!
నేను ఒక బ్లాగర్ బ్లాగును ఎలా సృష్టించగలను?
ఒకసారి మీరు బ్లాగర్ ఖాతాను సృష్టించిన తర్వాత, www.blogger.comకు సైన్ ఇన్ చెయ్యండి మరియు "ఒక బ్లాగును సృష్టించు"ను క్లిక్ చెయ్యండి. 2వ దశలో, మీ బ్లాగు కోసం శీర్షిక మరియు చిరునామాను (URL) నమోదు చెయ్యండి. మీరు నిజ వ్యక్తి అని ధృవీకరించడానికి పద ధృవీకరణ పెట్టెలో అక్షరాలను టైపు చెయ్యండి మరియు "కొనసాగించు" క్లిక్ చెయ్యండి. 3వ దశలో, మీ బ్లాగు కోసం మీరు ఒక టెంప్లేట్‌ను ఎంచుకోవచ్చు; మీ పాఠకులకు అది ఇలా కనిపిస్తుంది. ఆపై 2వ దశలో మీరు ఎంచుకున్న చిరునామా వద్ద మీ క్రొత్త బ్లాగును బ్లాగర్ సృష్టిస్తుంది.
నేను నా బ్లాగులోకి ఎలా పోస్ట్ చెయ్యగలను?
మీ డాష్‌బోర్డులో, మీరు మీరు పోస్ట్ చేయదల్చిన బ్లాగు ప్రక్కన ఉన్న “క్రొత్త పోస్ట్”పై క్లిక్ చెయ్యండి. మీ పోస్ట్‌‌కు ఒక శీర్షికను ఇవ్వండి (ఇచ్చాపూరితం) మరియు పోస్ట్‌‌ను ఎంటర్ చెయ్యండి. మీరు పూర్తి చేసినపుడు,ఇది ప్రచురించిన తర్వాత ఎలా కనిపిస్తుందో ఒకసారి పరిదృశ్యం చెయ్యడానికి "పరిదృశ్యం" లింక్‌ను క్లిక్ చెయ్యండి. మీ పోస్ట్‌తో మీకు సంతృప్తి కలిగినప్పుడు, “ప్రచురించు”ను క్లిక్ చెయ్యండి.

No comments:

Post a Comment