Friday, July 6, 2012

ట్యాబ్లెట్ పీసీపైనా గేమింగ్ జోరు...

ట్యాబ్లెట్ పీసీపైనా గేమింగ్ జోరు....
కాలక్షేపం వీడియో గేమింగ్‌కు స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌పీసీలు బాగానే ఉండవచ్చుగానీ ఎక్స్‌బాక్స్, ప్లే స్టేషన్ల స్థాయిలో ఆటలాడాలంటే మాత్రం ఇబ్బందే. వీటి హార్డ్‌వేర్‌లలో ఉన్న పరిమితులు దీనికి కారణం. ఎక్స్‌బాక్స్ 360 ప్రాసెసింగ్ స్పీడ్‌తో పోలిస్తే ట్యాబ్లెట్ పీసీల ప్రాసెసింగ్ స్పీడ్ పిసరంతే మరి.

ఈ నేపథ్యంలో వీడియో గేమింగ్ సర్వీస్ కంపెనీ ‘ఆన్‌లైవ్’ (onlive) ఓ వినూత్న అప్లికేషన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గేమింగ్ కన్సోల్స్‌పై మాత్రమే ఆడగలిగే ఆటలనూ ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లకు దగ్గర చేసింది. క్లౌడ్ కంప్యూటింగ్ సాయంతో పనిచేసే ఈ అప్లికేషన్ అన్నిరకాల ట్యాబ్లెట్‌లపై పనిచేస్తుంది. అంతేకాదు.. ట్యాబ్లెట్‌పై సగం ఆడి సేవ్ చేసుకున్న గేమ్స్‌ను తిరిగి పీసీ, కన్సోల్స్‌పై కొనసాగించవచ్చు కూడా.
  

More Headlines

No comments:

Post a Comment