Tuesday, July 3, 2012

బ్లాగుల గురించి సందేహాలు

నేను బ్లాగర్‌ డిజైన్ లక్షణంను ఎలా ఉపయోగించగలను?
మీ డాష్‌బోర్డులో మీ బ్లాగు పేరును కనుగొని, దానికి ప్రక్కన ఉన్న "డిజైన్" లింక్‌ను క్లిక్ చెయ్యండి. మరొక స్థానానికి డ్రాగ్ చేసి డ్రాప్ చెయ్యడం ద్వారా ఇక్కడ మీరు ప్రదర్శించాలనుకుంటున్న రీతిలో మీ టెంప్లేట్‌లోని ఎలిమెంట్‌ల క్రమాన్ని మీరు అమర్చవచ్చు. అనేక టెంప్లేట్‌లలో మీ నావిగేషన్ పట్టీ, బ్లాగు పోస్ట్‌లు మరియు హెడర్ మినహా అన్ని ఎలిమెంట్లను మీరు తరలించవచ్చు. మీరు మీ బ్లాగు పేజీకి లేదా సైడ్‌బార్‌కు గాడ్జెట్‌లను జోడించాలనుకుంటే, "గాడ్జెట్‌ను జోడించు"ను క్లిక్ చెయ్యండి. ఈ చర్య మీరు గాడ్జెట్‌లను బ్రౌజ్ చేయడానికి ఒక పాప్-అప్ విండోను తెరుస్తుంది, తర్వాత వాటిని మీ బ్లాగ్‌కు జోడించి సేవ్ చెయ్యండి.
ఒకరు కంటే ఎక్కువ మంది ఒక బ్లాగుకి పోస్ట్‌‌చెయ్యవచ్చా?
చెయ్యవచ్చు, వీటిని “బృంద బ్లాగులు” అంటారు. సాధారణంగా, ఒకరు బ్లాగును ప్రాథమికంగా సృష్టించి, దానిలోకి చేరమని ఇతరులను ఆహ్వానిస్తారు. బృంద సభ్యులు నిర్వాహకులుగా అయినా లేదా రెగ్యులర్ పోస్టర్‌లుగా అయినా ఉండవచ్చు. నిర్వాహకులు అన్ని పోస్ట్‌లను (వారికి స్వంతమైనవి కాక) సవరించవచ్చు, బృంద సభ్యులను జోడించవచ్చు మరియు తొలగించవచ్చు (మరియు నిర్వాహక ప్రాప్తిని ఇవ్వవచ్చు) మరియు బ్లాగు సెట్టింగ్‌లను సవరించవచ్చు. నిర్వాహకులు కాని వారు బ్లాగుకు పోస్ట్ మాత్రమే చెయ్యగలరు. ఒక బ్లాగుకు చేరమని వ్యక్తులను ఆహ్వానించడానికి, మొదట సెట్టింగ్‌లు | అనుమతులు టాబ్‌కు వెళ్ళి, “రచయితలను జోడించు”పై క్లిక్ చెయ్యండి. ఆ తర్వాత, మీరు బ్లాగుకు ఆహ్వానిస్తున్న వ్యక్తుల ఇమెయిల్ చిరునామాలను టైపు చెయ్యండి; వారు త్వరలోనే ఆహ్వాన ఇమెయిల్‌ను అందుకుంటారు. Blogspot వద్ద బ్లాగ్ కోసం Google ఖాతాను కలిగి ఉండాలి, ఒకవేళ మీరు ఇప్పటి వరకు Google ఖాతాలు లేని రచయితలను ఆహ్వానిస్తే, ఒకదాన్ని సృష్టించాలని వారు ప్రాంప్ట్ చెయ్యబడతారు. ఆహ్వానాలను పంపించడానికి మీరు సిద్ధంగా ఉంటే, “ఆహ్వానించు”పై క్లిక్ చెయ్యండి. బ్లాగుకు ఒక క్రొత్త బృంద సభ్యుడు విజయవంతంగా చేరినప్పుడు, మీరు ఇమెయిల్‌ను అందుకుంటారు.

No comments:

Post a Comment