Saturday, July 7, 2012

ఇంటి ఇంటర్నెట్‌పై నిఘానేత్రం...

ఇంటి ఇంటర్నెట్‌పై నిఘానేత్రం... ఇంటర్నెట్ ఇప్పుడు ఇంటిల్లిపాదికీ అవసరమైనదే, కానీ అదే ఇంట్లో టీనేజ్ పిల్లలుంటే... వారు నెట్‌లోఎటువంటి సైట్లు బ్రౌజ్ చేస్తున్నారు అనే అనుమానం మొదలై పెనుభూతంగా మారుతోంది. ఇలాంటి డౌట్స్ కొంతమందికే పరిమితం అయినప్పటికీ, టీనేజర్స్‌ను అవాంచిత సైట్స్ నుంచి దూరంగా ఉంచాలనే అభిలాష ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే సైట్ కేర్ 4 టీనేజర్స్.కామ్ పిల్లల ఇంటర్నెట్ చర్యలపై నిఘా పెట్టలనుకొన్నవారు ఈ సైట్‌లోకి లాగిన్ అయ్యి, అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొంటే చాలు! ఇంటర్నెట్‌తో పాటు పనిచేసే ఆ అప్లికేషన్ అనుక్షణం బ్రౌజింగ్ హిస్టరీని నమోదు చేస్తూ ఉంటుంది. అవసరమనుకొన్నప్పుడు కేర్ 4 టీనేజర్స్ సైట్‌లోని మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే చాలు... మీ పీసీ నుంచి క్లిక్ చేసిన సైట్‌ల చిట్టా తెలుసుకోవచ్చు. పీసీలో బ్రౌజింగ్ హిస్టరీ తొలగించడం చాలా సులభం, కానీ దానిపై ఈ ఆన్‌లైన్ నిఘాను పెడితే ఎప్పుడైనా సమీక్షించుకోవచ్చు. మరి అనుమానంతో కాకపోయినా ఆసక్తితోనైనా బ్రౌజింగ్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి... http://www.care4teen.com

No comments:

Post a Comment